బ్రతికిన కాలేజీ

వికీపీడియా నుండి
(బతికిన కాలేజి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బ్రతికిన కాలేజీ పాలగుమ్మి పద్మరాజు రాసిన నవల.[1] నిజానికి నవలిక లోని కథకూ, శీర్షికకీ ఎటువంటి సంబంధం లేదు. కనీసం అందుకు సంబంధించిన వివరణ కూడా లేదు. ఈ నవలికలో "నా సంజాయిషీ" అనే పేరిట పద్మరాజు రాసిన ముందుమాట ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సంజాయిషీలో రచయిత పద్మరాజు ఈ నవలా రచనకి "వోడ్ హౌస్" శైలి స్ఫూర్తి నిచ్చిందని చెప్పాడమే కాక " వోడ్ హౌస్ లాగా రాయగలగడం అస్ంభవమని నాకు తెలుసు. అయితే రాయాలన్న అభిలాష చాలా కాలంగా బాధపెడుతోంది. అసాధ్యమైనది సాధించాలని పూనుకున్నాను, నా వైఫల్యాన్ని మీకర్పిస్తున్నాను" అన్నాడు.

రచన నేపథ్యం[మార్చు]

నలభై ఏళ్ల క్రితం కొత్తరకంగా వెలుగు చూసిన ఎమెస్కో పాకెట్ పుస్తకాల తొలివిడతలో ప్రచురింపబడిన నవల బ్రతికిన కాలేజీ. ఆ విడతలోనే విశ్వనాథ వారి దిండుక్రింద పోకచెక్క నవల కూడా ఉంది. ఎమెస్కో పాకెట్ బుక్స్ నూతన ధోరణికి నిజంగా తగిన నవల బ్రతికిన కాలేజీ. రూపురేఖా విలాసాల్లో కొత్తదనం ఎమెస్కో పాకెట్ బుక్స్ వి అయితే, వస్తువులో, పోకడలో అంతకన్నా కొత్తది బ్రతికిన కాలేజీ నవల అంటారు ప్రముఖ విమర్శకుడు రాజారామమోహనరావు.

ఇతివృత్తం[మార్చు]

ఈ నవల అసాంతం హాస్యంతో ముంచెత్తే ప్రేమ కథ. పెళ్ళి చూపులకని వెళ్ళి పెళ్ళి కుమార్తె చెల్లెలితో తొలిచూపులోనే ప్రేమలో పడ్డ యువకుడు "పట్టూ" కథ. "పట్టూ" ప్రేమని గెలిపించే బాద్యతను తన మీద వేసుకున్న అతని మిత్రుడు "చింతా" ఈ నవలలో ప్రధాన కథానాయకుడు. ఈ నవలలో ఇతర పాత్రలైన శాంతమ్మ, శేషయ్య, కామన్న, మస్తాను, నటరాజ మార్తాండ శర్మ, రామలింగయ్య, రోశయ్య మొలలగు వారికి ప్రత్యేకమైన హాస్య పూరితమైన గుర్తింపు ఇచ్చాడు రచయిత.

మూలాలు[మార్చు]

  1. gotelugu.com. "..prayanam story review | Gotelugu.com". gotelugu.com. Retrieved 2021-04-21.