బాంబే స్కాటిష్ పాఠశాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Bombay Scottish Mahim Wordmark.svg
200px
Perseverentia et fide in Deo
Perseverance and faith in God
Address
Veer Savarkar Marg, Mahim
Mumbai, Maharashtra, 400016, India
భౌగోళికాంశాలు 19°2′2.5″N 72°50′21″E / 19.034028°N 72.83917°E / 19.034028; 72.83917Coordinates: 19°2′2.5″N 72°50′21″E / 19.034028°N 72.83917°E / 19.034028; 72.83917
Information
Religious affiliation(s) Christianity
Founded 1847 [1]
Principal Melanie Chandrashekhar [2]
Vice principal Molly Paul
Teaching staff 110 [2]
Grades Kindergarten–10th [2]
Number of students 3000 [2]
Average class size 45
Language English
Classrooms 60 [3]
Campus size approximately 2 acres (8,100 m2)
Campus type Urban
Houses Blue, Green, Red, Yellow
Yearbook Tartan [2]
School fees Rs. 24,000 [2]
Affiliation Council for the Indian School Certificate Examinations [2]
Founder's Day 18 February [4]
వెబ్‌సైట్

బాంబే స్కాటిష్ పాఠశాల(BBS) స్కాటిష్ గా పిలుచుకునే ఈ పాఠశాల భారతదేశంలో ముంబైలోని మాహీంలో ఉంది. ఇది ప్రసిద్ద ప్రైవేటు కో-ఎడుకేషనల్ పగటి పాఠశాల గా ప్రాచుర్యం పొందింది. 1847లో స్కాటిష్ క్రైస్తవ మిషనరీలు స్కాటిష్ ఫిమేల్ ఆర్ఫనేజ్ పేరుతో దీనిని స్థాపించారు.[1]

ఈ పాఠశాలలో కిండర్ గార్టెన్ నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధిస్తారు. ఈ పాఠశాల కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎక్సామినేషన్, న్యూఢిల్లీ కు అనుబంధంగా సాగుతోంది. ఇది 10వ తరగతి ICSE పరీక్షలు నిర్వహిస్తుంది.

చరిత్ర[మార్చు]

1847లో బ్రిటిష్ ఇండియాలో భాగం అయిన ముంబైలోని బైకులాలో స్కాటిష్ మిషనరీస్ వారు స్కాటిష్ ఫిమేల్ ఆర్ఫనేజ్ పేరుతో దీనిని స్థాపించారు. ఆర్ఫనేజ్ ను స్కాటిష్ ప్రిస్ బైటేరియన్ సైనికులు, భారత నౌకా దళ సిబ్బంది కూతుళ్ళ విద్య బోధన కోసం ఏర్పాటు చేశారు. స్కాటిష్ ఫిమేల్ ఆర్ఫనేజ్ విజయవంతం అవడంతో బాలుర కోసం ఇదే రీతిన 1857లో ఆర్ఫనేజ్ ఫర్ ద సన్స్ ఆఫ్ ప్రిస్ బైటేరియన్ పేరుతో మరో బడిని ప్రారంభించారు. 1859లో స్కాటిష్ ఫిమేల్ ఆర్ఫనేజ్ , ఆర్ఫనేజ్ ఫర్ ద సన్స్ ఆఫ్ ప్రిస్ బైటేరియన్ లను విలీనం చేసి ది బాంబే ప్రిస్ బైటేరియన్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్ఫనేజ్ గా నామకరణం చేశారు. 1863లో ఈ విద్య కేంద్రం పేరును [1]బాంబే స్కాటిష్ ఆర్ఫనేజ్ గా మార్చారు. 18 ఫిబ్రవరి 1867న బాంబే స్కాటిష్ ఆర్ఫనేజ్ ట్రస్ట్ సభ్యుల మొదటి సమావేశం జరిగింది.[3]

మహీం బే పక్కన విశాలమైన స్థలాన్ని ఈ విద్య కేంద్రం కోసం సేకరించారు. ఇక్కడ ఒక పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ పాఠశాలల విద్య విధానాన్ని ఇక్కడ అవలంభించారు. 15 జులై 1875న పాఠశాల భవనాన్ని బాంబే ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి డి ఈ గోస్ట్లింగ్, జే మోరిస్ రూపకల్పన చేశారు. 1875 డిసెంబర్ 8న అప్పటి కౌన్సిల్ ప్రెసిడెంట్ మరియు గవర్నర్ అయిన సర్ ఫిలిప్ ఎడ్మండ్ వోడ్ హౌస్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ బడి నిర్మాణం 1878 ఫిబ్రవరి 28న పూర్తి అయింది. దీనికి అయిన వ్యయము రూ.84,015. 13 ఎప్రిల్ 1878న సర్ రిచర్డ్ టెంపుల్ బార్ట్ ఈ బడిని ప్రారంభించారు. దీనితో బైకుల నుంచి మహీంలోని కొత్త ప్రాంతానికి పాఠశాలను మార్చారు. విరాళాల సేకరణతో దీనిని నిర్వహించేవారు.[1]

ప్రారంభంలో విద్యార్థుల సంఖ్య 30 కన్నా తక్కువే. కొన్ని ఏళ్ళ వరకు ఈ సంఖ్య 55 నుంఛి 60 దాటలేదు. తరగతుల సంఖ్య, విద్య నాణ్యత పెరగడంతో ఇది ఉన్నత పాఠశాల స్థాయికి ఎదిగింది. ఈ పాఠశాలకు ది బాంబే స్కాటిష్ అర్ఫనేజ్ హై స్కూల్ గా నామకరణం చేశారు. అనాధ ఆశ్రమాన్ని మూసివేయడంతో పాటు 11 ,12 తరగతులు రద్దు చేసి బడి పేరును ది బాంబే స్కాటిష్ స్కూల్ గా మార్చారు. 1935లో విద్యార్థుల సంఖ్య మొట్టమొదటి సారిగా మూడు అంకెలకు చేరింది. మొదట్లో ఈ అనాధ ఆశ్రమంలో స్కాటిష్ వారికే అనుమతి ఉండేది. ఆ తరువాత బ్రిటిష్, యూరోప్ దేశాల వారిని[5] కూడా చేర్చుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం అన్ని వర్గాల వారిని చేర్చుకుంటున్నారు.

దీనికి అనుబంధంగా ముంబై లోని పోవై లో 1997లో ఓ శాఖను ఏర్పాటు చేశారు.[3]

ప్రాంగణం[మార్చు]

మహీం తీరానికి అభిముఖంగా వీర సావర్కర్ మార్గం (గతంలోని కాడేల్ రోడ్)లో ఈ బడి నెలకొని ఉంది. దీనికి ఎదురుగా పి డి హిందుజా నేషనల్ హాస్పిటల్, మెడికల్ రిసర్చ్ సెంటర్ ఉంది. ఈ ప్రాంగణం దాదాపు 2 ఎకరాలలో విస్తరించి ఉంది.

1900లో తీసిన బాంబే స్కాటిష్ స్కూల్ చిత్రం

హెరిటేజ్ బ్లాక్ (గతంలో మధ్య బ్లాక్), ఉత్తర బ్లాక్, దక్షిణ బ్లాక్ లుగా ఈ పాఠశాల ప్రాంగణం విభజించబడి ఉంది. ఈ పాఠశాల నాలుగో భవనాన్ని ఇటీవలే పూర్తి చేశారు. దీనిని ఉత్తర బ్లాక్ కు ఆనుకొని నిర్మించారు. బాస్కెట్ బాల్ కోర్ట్ కు కేటాయించిన స్థలాన్ని దాని నిర్మాణానికి ఉపయోగించారు. ఇప్పుడు ఇది ఇండోర్ బాస్కెట్ బాల్ కోర్ట్ గా వాడుకలో ఉంది.జూన్ 2009లో ఈ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఈ పాఠశాలలో విశాలమైన ఆట స్థలం ఉంది. చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం కేటాయించారు. ఆట స్థలం పక్కన 150 ఏళ్ళ పురాతన రాగి చెట్టు ఉంది. ఈ ప్రాంగణంలో మూడు హాలులు ఉన్నాయి- ది మాకే హాల్ ,ది గమలిఎల్ హాల్ ,ది సెయింట్ అన్ డ్రూస్ హాల్ .

హెరిటేజ్ బ్లాక్[మార్చు]

ఈ విద్యాలయపు మొదటి భవనం హెరిటేజ్ బ్లాక్. ఇది ఒక్క అంతస్తు భవనం. కలోనియల్ పద్ధతిలో నల్ల గ్రానైట్ తో అశ్లార్ మసొంరి శైలిలో దీనిని నిర్మించారు. మాకే హాల్ , పాఠశాల గ్రంధాలయం, ప్రధాన అధ్యాపకుడి నివాసం ఈ హెరిటేజ్ బ్లాక్ లోని భాగాలు. మాకే హాల్ వాస్తవానికి ఓ చాపెల్ (ప్రార్థనా కేంద్రం). దీనిని చివరి స్కాటిష్ ప్రధానోపాధ్యాయుడు అయిన ఆడం మాకే పేరు మీదుగా నామకరణం చేశారు. ప్రస్తుతం దీనిని మల్టిమీడియా ధియేటర్, సమావేశ మందిరం, గీతాలాపన మందిరంగా వినియోగిస్తున్నారు. కిండర్ గార్టెన్ తరగతులను హెరిటేజ్ బ్లాక్ లో నిర్వహిస్తున్నారు.

నార్త్ బ్లాక్[మార్చు]

నార్త్ బ్లాక్ కింది అంతస్తును 1937లో నిర్మించారు. ఆ తరువాత మరో రెండు అంతస్తులను జత చేశారు. ఈ బ్లాక్ లోనే సైన్సు ప్రయోగశాల, కళాకేంద్రం, ఉన్నత తరగతి గదులు ఉన్నాయి.

సౌత్ బ్లాక్[మార్చు]

మూడు అంతస్తుల ఈ సౌత్ బ్లాక్ ను 1967లో నిర్మించారు. సౌత్ బ్లాక్ కింది అంతస్తులో గమలిఎల్ హాల్ ఉంది. ఈ స్కూల్ మొదటి భారతీయ ప్రధాన ఉపాధ్యాయుడు లాజరస్ గమలిఎల్ పేరు మీదుగా దీనికి నామకరణం చేశారు. గమలిఎల్ హాల్ ఉదయపు ప్రార్థనలు, పోటీలు, పరీక్షలు నిర్వహించేందుకు ఉపయోగిస్తారు. గమలిఎల్ హాల్ లో ఓ శతాబ్దం చరిత్ర గల భారి పియానో ఉంది. ఈ బ్లాక్ లో మాధ్యమిక తరగతి గదులు, కంప్యుటర్ శాల ఉన్నాయి.

ప్రవేశాలు మరియు పాఠ్య ప్రణాళిక[మార్చు]

ప్రవేశాలు[మార్చు]

జూనియర్ కిండర్ గార్టెన్ ప్రవేశ ప్రకటనను జనవరిలో జారీ చేస్తారు. సీనియర్ కిండర్ గార్టెన్ నుంచి 8వ తరగతి వరకు గల ప్రవేశ ప్రకటనను [6]ఏప్రిల్ లో జారీ చేస్తారు. ప్రవేశ ప్రక్రియలో పూర్వ విద్యార్థుల సోదర, సోదరీ మణులు, ప్రొటెస్టంట్ క్రైస్తవులు, అధ్యాపకుల బంధువుల పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు.[7] ప్రవేశ ప్రక్రియలో భాగంగా అభ్యర్దులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

పాఠ్య ప్రణాళిక[మార్చు]

న్యూఢిల్లీకు చెందిన కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎక్జామినేషన్స్ వారు సిఫారసు చేసిన ఇండియన్ సర్టిఫికేట్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ICSE) పాఠ్య ప్రణాళికను అనుసరిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతుంది. హిందీ, ఫ్రెంచ్ లను రెండవ భాషగా భోదిస్తారు. మొదటి తరగతి నుంచి ఇంగ్లీష్, హిందీ బోధిస్తారు. ప్రాంతీయ భాష అయిన మరాఠీని మూడవ భాషగా పరిగణిస్తారు. మొదటి నుంచి ఏడవ తరగతి వరకు తప్పనిసరిగా బోధిస్తారు.[8]

ప్రీ స్కూల్ స్థాయిలో అనియత, పూర్వ ప్రాథమికలో స్వల్ప నియత, ఆ తరువాత క్రమానుగతంగా నియత స్థాయిలో బోధన సాగుతుంది. ప్రాథమిక తరగతుల వారికి ఎలాంటి ఇంటిపని ఇవ్వరు, ఉన్నత తరగతుల వారికి కొద్ది మొత్తంలో ఇంటిపని కేటాయిస్తారు.

విద్య సంవత్సరం రెండు భాగాలుగా ఉంటుంది. జూన్ లో మొదలై ఏప్రిల్ తో ముగుస్తుంది. మొదటి భాగం జూన్ నుంచి నవంబర్ వరకు, రెండో భాగం నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. పరీక్షలను సమయానుసారం నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షలు టర్మ్ చివరలో ఉంటాయి. అధ్యయన కోర్సులు కిండర్ గార్టెన్ నుంచి పదో తరగతి వరకు ఉంటాయి. పదో తరగతి చివరలో విద్యార్థులు ICSE పరీక్షలను రాయాల్సి ఉంటుంది. ICSE పరీక్షలలో ఇక్కడి విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. వీరు 100% ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తూ వస్తున్నారు.[citation needed]

ICSE పరీక్ష అభ్యర్థులు మూడవ భాష (మరాఠీ), ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, క్రీడలు, నైతిక విద్య, సామాజిక ఉపయోగకర, ఉత్పాదక కృత్యం (SUPW) లో సంతృప్తికర ఫలితాలను నమోదు చేయాల్సి ఉంటుంది. బడిలో ఈ అంశాలను అంతర్గతంగా మదింపు చేస్తారు. ఇవన్నీ ICSE పరీక్ష ఫలితాల ఉత్తీర్ణతగా పరిగణిస్తారు. మొదటి నుంచి పదవ తరగతి వరకు ప్రాజెక్ట్ వర్క్ ను మదింపు చేస్తారు. క్షేత్ర పర్యటన, శిబిరాలు, సామాజిక సేవ కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తారు.

పాఠ్యయేతర కార్యకలాపాలు[మార్చు]

పాఠ్యయేతర కార్యకలాపాల పై ప్రాధాన్యం చూపుతారు. విద్యార్థులు ఆధ్వర్యంలో క్లబ్ లు ఉన్నాయి, వీటిలో నేచర్ క్లబ్, ఇంటరాక్ట్ క్లబ్, సైన్సు క్లబ్, స్కౌట్స్ అండ్ గైడేస్, ది స్కాటిష్ జూనియర్ రైఫిల్ క్లబ్, తదితరమైనవి ముఖ్యమైనవి. అంతర్గత వక్తృత్వ పోటీలు, డ్రామాలు, క్రీడా పోటీలు మొదలైనవి విద్యార్థుల జీవితంలో భాగమౌతాయి. క్రీడల్లో ఫుట్ బాల్,క్రికెట్,బాస్కెట్ బాల్,స్విమ్మింగ్, థ్రో బాల్, రోలర్ స్కేటింగ్ తదితరాలు ఉన్నాయి. డ్యూక్ ఆఫ్ ఎడింబర్గ్ పురస్కారం పోటీలు కూడా నిర్వహిస్తారు.[9]

పాఠశాల జీవితం[మార్చు]

పాఠశాల పతాకం మరియు షీల్డ్[మార్చు]

పాఠశాల జెండా

పాఠశాల పతాకం నీలంగా ఉండి అందులో తెలుపు రంగులో సెయింట్ అండ్రూ శిలువ ఉంటుంది. స్కాట్లాండ్ అధికారిక మతగురువే సెయింట్ అండ్రూ. కార్యక్రమాలు, ఉత్సవాల సమయంలో పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సెయింట్ అండ్రూ శిలువను షీల్డ్ ప్రతిబింబిస్తుంది. క్రక్స్ దికాసట(శిలువ)లోని నాలుగు భాగాలు బడిలోని నాలుగు హౌస్ లకు తార్కాణంగా నిలుస్తాయి. అవి ఫ్లూర్ డి-లిస్,ది కాసిల్, ది లయన్, ది పాంట్రీ.[10]

లక్ష్యం, పాఠశాల గీతం మరియు ప్రార్థనా గేయం[మార్చు]

'పర్సివరెంటియా ఎట్ ఫైడ్ ఇన్ డియో', లాటిన్ భాషలో 'సంరక్షణ మరియు భగవంతుడి పై నమ్మకం' అని అర్థం.[11] ఉదయం ప్రార్థన సమయంలో, ప్రత్యేక సందర్భాలలో పాఠశాల గీతాన్ని ఆలపిస్తారు. 'కరేజ్ బ్రదర్, డు నాట్ స్టంబాల్' అనేది ప్రార్థనా గేయం. సాలం 23 ని ఆయా కార్యక్రమాల సందర్భంగా పాడతారు.

హౌస్ విధానం[మార్చు]

సామాజిక బాధ్యత, పరస్పర సహకార భావం పెంపొందించే ఉద్దేశంతో హౌస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. బడిలో దీనికే చాలా ప్రాముఖ్యం ఉంది. ఆయా హౌస్ లకు చెందిన విద్యార్థులు క్రీడలు మరియు ఇతర అంశాల్లో పోటీ పడుతుంటారు.

పాఠశాలలో నాలుగు హౌస్ లు ఉన్నాయి. అవి - బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో. స్కాటిష్ క్లాన్ పేరు మీదుగా బాలుర హౌస్ లకు, బ్రిటన్ రాణి పేరు మీద బాలికల హౌస్ ల పేర్లు పెట్టారు.

! బాలురు ! బాలికలు |- |స్టైల్ = "బ్యాక్ గ్రౌండ్ -కలర్: నీలం" |మాక్ గ్రిగర్ | ఎలిజబెత్ |- |స్టైల్ ="బ్యాక్ గ్రౌండ్ -కలర్: గ్రీన్ | స్టైల్ ="బ్యాక్ గ్రౌండ్ -కలర్:#edf3fe"|కెన్నెడీ | స్టైల్ ="బ్యాక్ గ్రౌండ్ -కలర్:#edf3fe"|విక్టోరియా |- |స్టైల్ ="బ్యాక్ గ్రౌండ్ -కలర్:రెడ్"| | మాక్ ఫేర్సన్ | కాతరిన్ |- |స్టైల్ =""బ్యాక్ గ్రౌండ్ -కలర్:ఎల్లో"| | స్టైల్ ="బ్యాక్ గ్రౌండ్ -కలర్:#edf3fe"|హడ్డౌ | స్టైల్ =""బ్యాక్ గ్రౌండ్ -కలర్:#edf3fe"|అన్ని |}

స్కూల్ యునిఫాం[మార్చు]

పాఠశాలలో అందరు పిల్లలకు యూనిఫాం తప్పనిసరి. కిండార్ గార్టెన్ నుంచి 7 వ తరగతి చదివే బాలురకు బూడిద రంగు నిక్కర్లు, ఆ పై తరగతి వాళ్ళు ప్యాంట్లు వేసుకోవాలి. బాలురందరూ సగం చేతులున్న తెల్లటి చొక్కాలు, దానిపై నీలం రంగు టై ధరించాలి. హౌస్ బ్యాడ్జి, లెదర్ బెల్టు, తెల్లటి సాక్స్, నలుపు రంగు లేస్ షూ వేయాలి. బాలికలకు బూడిద రంగు గౌను, సగం చేతుల తెలుపు చొక్కా, చున్ని, నీలం టై, హౌస్ బ్యాడ్జి, తెలుపు సాక్స్,బకాల్ తో కూడిన నలుపు షూని యూనిఫాంగా నిర్దేశించారు.[12]

సంస్కృతి[మార్చు]

బాంబే స్కాటిష్ ఓ ప్రపంచ ప్రఖ్యాత పాఠశాల. క్రైస్తవ విలువలను పిల్లల్లో పెంచేందుకు పాఠశాల కృషి చేస్తోంది. డిసెంబర్ లో క్రిస్టమస్ పండుగను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. క్రీడల సమావేశం, పాఠశాలను వీడే విద్యార్థులు కోసం వీడుకోలు పార్టీలను ఏడాదికి ఒక్కసారి ఏర్పాటు చేస్తారు. వక్తృత్వం, నాటకాలు, పాటల పోటీలను ఆయా హౌస్ ల మధ్య నిర్వహిస్తారు. 2002లో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఈ పాఠశాలకు ముంబై ప్రాంతంలో మొదటి స్థానం దక్కింది.[13] క్రమశిక్షణకు ఈ పాఠశాల మారుపేరు.

సదుపాయాలు[మార్చు]

ఈ పాఠశాలకు 20,000 పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంది. పాఠశాల సమయాలలో అవి అన్నీ విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలకు వేరు వేరు ప్రయోగశాలలు ఉన్నాయి. క్రుత్యాధార బోధనలో భాగంగా ఈ ప్రయోగశాలలను 9 ,10 వ తరగతి విద్యార్థులు వినియోగిస్తారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాన్ని అందించడానికి రెండు కంప్యూటర్ ప్రయోగశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయుల, విద్యార్థుల కోసం ఇంటరాక్ట్ క్లబ్ కాఫిటేరియాను నిర్వహిస్తుంది.[14]

పాలన[మార్చు]

మేనేజింగ్ కమిటి ఆద్వర్యంలో పాఠశాల నిర్వహణ సాగుతుంది. ప్రస్తుతం మెలానీ చంద్రశేఖర్ ప్రధానోపాధ్యాయునిగా వ్యవహరిస్తున్నారు. డా.డి.పే.యెన్.ప్రసాద్ స్థానంలో వీరు వచ్చారు. పాఠశాల పాఠ్య సంబంధ వ్యవహారాలను చీఫ్ అకాడమిక్ కో-ఆర్డినేటర్ చూసుకుంటారు. ప్రస్తుత చీఫ్ అకాడమిక్ కో-ఆర్డినేటర్ గా మాలి పౌల్ ఉన్నారు. 2005-06లో మోనికా బోస్ స్థానంలో వీరు వచ్చారు. వీరితో పాటు జూనియర్ మిడిల్, సీనియర్ పాఠశాల స్థాయిల్లో అకాడమిక్ కో-ఆర్దినేటర్స్ ఉంటారు.

విద్యార్ధి కార్యాలయ-అధికారులు[మార్చు]

ఉపాధ్యాయుల సిఫార్సు పై ప్రిన్సిపాల్ 10వ తరగతికి చెందిన వారిలో స్కూల్ కాప్టెన్, ఇద్దరు వైస్ కాప్టెన్ లను నియమిస్తారు. దీనికి అదనంగా హౌస్ కాప్టెన్, వైస్ కాప్టెన్ (ఒక్కో హౌస్ కి ఇద్దరు) చొప్పున హౌస్ మిస్ట్రెస్ ఎంపిక చేస్తారు. హౌస్ లోని క్రీడ సంబంధ వ్యవహారాలను చూసేందుకు గేమ్స్ కాప్టెన్, వైస్ కాప్టెన్ లు ఉంటారు.

ప్రముఖ పూర్వ విద్యార్థులు[మార్చు]

ఇప్పటి, ఒక్కప్పటి ప్రసిద్ద వ్యక్తులలోని చాలా మంది ఈ పాఠశాలలో చదివారు.[15][16]

కళలు, వినోద రంగం[మార్చు]

  • జాన్ అబ్రహం- బాలీవుడ్ నటుడు, ఒకప్పటి మోడల్.[17]
  • లక్కి అలీ(1976)- భారత గేయ రచయిత, గాయకుడు,సంగీతకారుడు, నటుడు[18]
  • అభిషేక్ బచ్చన్ - బాలీవుడ్ నటుడు[19]
  • వికాస్ భల్ల - ఇండియన్ టెలివిజన్ నటుడు, గాయకుడు[20]
  • అర్జున్ బిజ్లాని - ఇండియన్ టెలివిజన్ నటుడు[21]
  • ఆదిత్య చోప్రా(1987)- భారత చలన చిత్ర దర్శకుడు, రచయత, నిర్మాత[22]
  • ఉదయ్ చోప్రా - బాలీవుడ్ నటుడు[23]
  • శాంత గోఖలే- రచయత, అనువాదకర్త, పాత్రికేయుడు, నాటక విమర్శకుడు.
  • రంజిత్ హస్కోటే (1984)- భారత కవి, కళ విమర్శకుడు, కల్చరల్ థియరిస్ట్, స్వతంత్ర క్యూరేటర్.[24]
  • రాహుల్ జగిత్ యాని - మోడల్[25]
  • ఏక్తా కపూర్ - భారత టెలివిజన్ నిర్మాత.[26]
  • రనబీర్ కపూర్ - బాలీవుడ్ నటుడు[27]
  • తుషార్ కపూర్ - బాలీవుడ్ నటుడు[28]
  • ఆమిర్ ఖాన్ (1981)- బాలీవుడ్ నటుడు[29]
  • ఇమ్రాన్ ఖాన్ - బాలీవుడ్ నటుడు[30]
  • మన్సూర్ ఖాన్ - సినీ దర్శకుడు[31]
  • లేస్లి లేవిస్ - సంగీతకారుడు, కలోనియల్ కసిన్స్ ద్వార పాచుర్యం పొందారు.
  • అజీజ్ మిర్జా - బాలీవుడ్ దర్శకుడు[32]
  • మేఘన రెడ్డి - మోడల్,V J[33]
  • [34]సుష్మరెడ్డి - మోడల్, V J,రచయిత
  • హృతిక్ రోషన్ - బాలీవుడ్ నటుడు[35]
  • రాహుల్ శర్మ - హిందుస్తానీ శాస్త్రీయ సంగీతకారుడు[36]
  • పియా త్రివేది - మోడల్, చానల్ V VJ[37]

క్రీడలు[మార్చు]

  • రోహన్ గవాస్కర్ - భారత క్రికెటర్[38]

ఇతరులు[మార్చు]

  • దివంగత నీరజ భానోట్ – పాన్ ఏం ఏర్ వేస్ సినియర్ ఫ్లైట్ పార్సర్, అశోక చక్ర గ్రహీత[39]
  • మానవేంద్ర సింగ్ గోహిల్ - రాజ్ పిప్లా సంస్థాన రాజ వంశీకులు[40]

సూపర్ ఇన్ టెన్ డెంట్ , ప్రధానోపాధ్యాయులు[మార్చు]

ఈ విద్య కేంద్రానికి పన్నెండు మంది ప్రధానోపాధ్యాయులు పని చేశారు. లజారాస్ గమలిఎల్ , ఆడం మాకే పేర్లు మీదుగా గమలిఎల్ హాల్, ఆడం మాకే హాల్ ఉన్నాయి. మహీంలో పదవి కాలం పూర్తి చేసుకున్న తరువాత మార్క్ డేవిడ్ ఈ సంస్థ శాఖ అయిన పోవై లోని బాంబే స్కాటిష్ స్కూల్ మొదటి ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రధానోపాధ్యాయుల వివరాలు[41]

వృతి పేరు పదవీ కాలం
సూపర్ ఇన్ టెన్ డెంట్ జాన్ అండర్సన్ 1884–1914
సూపర్ ఇన్ టెన్ డెంట్ డి. జి. రాస్ 1914–1916
సూపర్ ఇన్ టెన్ డెంట్ ఎచ్. ఎం. గ్రీన్ 1916–1921
సూపర్ ఇన్ టెన్ డెంట్ తోర్న్టన్ రిప్లే 1921–1927
సూపర్ ఇన్ టెన్ డెంట్/ప్రధానోపాధ్యాయుడు ఆడం మాకే 1927–1947
ప్రధానోపాధ్యాయుడు ఎస్. ఏ. బడ్వే 1947–1957
ప్రధానోపాధ్యాయుడు లజారుస్ గమలిఎల్ 1957–1984
ప్రధానోపాధ్యాయుడు ఏ. టి. బాల్ రాజ్ 1984–1987
ప్రధానోపాధ్యాయుడు మార్క్ డేవిడ్ 1987–1997
ప్రధానోపాధ్యాయుడు రివ్.అరుణ్ థామస్ 1997–1999
ప్రధానోపాధ్యాయుడు డి.పి.యెన్. ప్రసాద్ 1999–2009
ప్రధానోపాధ్యాయుడు మెలనీ చంద్రశేఖర్ 2009–ఇప్పటి వరకు

వీటిని పరిశీలించండి[మార్చు]

Lua error in package.lua at line 80: module `Module:Portal/images/s' not found.Lua error in package.lua at line 80: module `Module:Portal/images/m' not found.Lua error in package.lua at line 80: module `Module:Portal/images/e' not found.
  • బాంబే స్కాటిష్ స్కూల్, పోవై
  • ఇండియన్ సర్టిఫికేట్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
  • భారతదేశంలో విద్య
  • భారత్ లోని విద్యాలయాల జాబితా
  • ప్రపంచంలోని పురాతన విద్యాలయాల జాబితా

మూలం[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 Pinder, D.A. (1904). Visitor's illustrated guide to Bombay. G. Claridge & Co. పేజీ. 96. సంగ్రహించిన తేదీ 17 February 2010. 
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Antique charm, modern outlook". Hindustan Times. 17 November 2009. సంగ్రహించిన తేదీ 29 January 2010. 
  3. 3.0 3.1 3.2 "Institution profile of Bombay Scottish School". EducationWorldOnline.net. 2009. సంగ్రహించిన తేదీ 17 February 2010. 
  4. "Alumni of Bombay Scottish School". Bombay Scottish School, Mahim. 2009. సంగ్రహించిన తేదీ 16 March 2010. 
  5. "History of Bombay Scottish School". Dinesh.com. 2009. సంగ్రహించిన తేదీ 27 January 2010. 
  6. "Admissions". Bombay Scottish School, Mahim. 2009. సంగ్రహించిన తేదీ 30 April 2010. 
  7. "Soaring nursery fees give parents the jitters". DNA. 10 November 2007. సంగ్రహించిన తేదీ 30 April 2010. 
  8. "Curriculum of Bombay Scottish School". Bombay Scottish School, Mahim. 2009. సంగ్రహించిన తేదీ 17 April 2010. 
  9. "Sports at Bombay Scottish School". Bombay Scottish School, Mahim. 2009. సంగ్రహించిన తేదీ 28 January 2010. 
  10. "School Emblem". Bombay Scottish School, Mahim. 2009. సంగ్రహించిన తేదీ 27 January 2010. 
  11. "School Motto". Bombay Scottish School, Mahim. 2009. సంగ్రహించిన తేదీ 27 January 2010. 
  12. "School Uniform". Bombay Scottish School, Powai. 2009. సంగ్రహించిన తేదీ 28 January 2010. 
  13. "India's Best Schools". Outlook. 16 December 2002. సంగ్రహించిన తేదీ 28 January 2010. 
  14. "Campus Facilities". Bombay Scottish School, Mahim. 2008. సంగ్రహించిన తేదీ 27 January 2010. 
  15. "BSS Famous Ex-Students". Dinesh.com. 2009. సంగ్రహించిన తేదీ 17 April 2010. 
  16. "BSS Famous Ex-Students". Dinesh.com. 2009. సంగ్రహించిన తేదీ 27 January 2010. 
  17. "Profile of John Abraham". MiD DAY. 1 July 2009. సంగ్రహించిన తేదీ 28 January 2010. 
  18. "ALI is MAALI at home". The Hindu. 25 September 2003. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  19. "Biography of Abhishek Bachchan". IMDB. 2009. సంగ్రహించిన తేదీ 2 February 2010. 
  20. "Face Off with Vikas Bhalla". The Indian Express. 3 February 1998. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  21. "Rising Stars of Miley Jab Hum Tum". The Indian Television Academy. 1 December 2008. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  22. "She has the Best Curves". The Indian Express. 8 August 2004. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  23. "Uday Chopra has built a state-of-the-art gym at Yashraj Studios". MiD DAY. 28 October 2009. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  24. "Ranjit Hoskote's Profile". Culturebase.net. 2007. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  25. "Transcript of Live Chat with Rahul Jagtiani". Indiatimes.com. 17 February 2005. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  26. "Super Six She's – Ekta Kapoor – Winning the war after losing the battle!". The Indian Television Academy. 14 September 2009. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  27. "Ranbir goes down memory lane". NDTV. 27 September 2009. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  28. "Transcript of Chat with Tusshar Kapoor". Rediff.com. 22 May 2001. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  29. "Biography of Aamir Khan". Aamirfans.com. 2009. సంగ్రహించిన తేదీ 28 January 2010. 
  30. "Dark Horse, White Knight". Tehelka. 19 July 2008. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  31. "Profile of Mansoor Khan". Acres Wild. సంగ్రహించిన తేదీ 28 March 2010. 
  32. "Dream maker". The Hindu. 2003. సంగ్రహించిన తేదీ 28 March 2010. 
  33. "Profile of Meghna Reddy". Mapsofindia.com. 2005. సంగ్రహించిన తేదీ 28 March 2010. 
  34. "I'm not sure if acting is my true calling". Rediff.com. 2005. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  35. "Hrithik Roshan's Profile". MiD DAY. 2008. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  36. "My Fundays". The Telegraph. 29 July 2009. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  37. "No longer still". The Hindu. 19 May 2005. సంగ్రహించిన తేదీ 30 January 2010. 
  38. "Rohan bowls maiden over". The Times of India. 2 April 2003. సంగ్రహించిన తేదీ 2 February 2010. 
  39. "24 years on, Neerja killer droned out". The Times of India. 17 January 2010. సంగ్రహించిన తేదీ 29 January 2010. 
  40. "Such A Long Journey". Tehelka. 18 July 2009. సంగ్రహించిన తేదీ 19 April 2010. 
  41. "Principals of Bombay Scottish School". Dinesh.com. 2009. సంగ్రహించిన తేదీ 17 April 2010. 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Mumbai topics