బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
వికీపీడియా నుండి
ఆసియా ఖండంలోనే అతిపురాతనమైన స్టాక్ ఎక్స్ఛేంజీ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (Bombay Stock Exchange} (Marathi: मुंबई शेयर बाजार). దీనిని ముంబాయిలోని దలాల్ స్ట్రీట్ లో 1875లో స్థాపించారు. ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో ప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు 4800కి పైగా కంపెనీలు లిస్టింగ్ అయ్యాయి. 2007 ఆగస్టు నాటికి ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ అయిన కంపెనీల పెట్టుబడి విలువ 1.11 ట్రిలియన్ డాలర్లు. దక్షిణాసియాలో ప్రస్తుతం ఇంత విలువ కల్గియున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఇదొక్కటే. 2007 అక్టోబర్ 29న దీని ఇండెక్స్ 20,000 దాటి రికార్డు సృష్టించింది. 2008, జనవరి 10న 21,000 దాటింది. 2008, జనవరి 21న 1400 పాయింట్లను కోల్పోవడం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ చరిత్రలోనే అత్యంత భారీ పతనం.
[మార్చు] సెన్సెక్స్ వృద్ధి కాలరేఖ
- 1000 : 1990 జూలై 25
- 2000 : 1992 జనవరి 15
- 3000 : 1992 ఫిబ్రవరి 29
- 4000 : 1992 మార్చి 30
- 5000 : 1999 అక్టోబర్ 8
- 6000 : 2000 ఫిబ్రవరి 11
- 7000 : 2005 జూన్ 20
- 8000 : 2005 సెప్టెంబర్ 8
- 9000 : 2005 నవంబర్ 28
- 10,000 : 2006 ఫిబ్రవరి 6
- 11,000 : 2006 మార్చి 21
- 12,000 : 2006 ఏప్రిల్ 20
- 13,000 : 2006 అక్టోబర్ 30
- 14,000 : 2006 డిసెంబర్ 5
- 15,000 : 2007 జూలై 6
- 16,000 : 2007 సెప్టెంబర్ 19
- 17,000 : 2007 సెప్టెంబర్ 26
- 18,000 : 2007 అక్టోబర్ 9
- 19,000 : 2007 అక్టోబర్ 15
- 20,000 : 2007 అక్టోబర్ 29
- 21,000 : 2008 జనవరి 10
[మార్చు] బయటి లింకులు
- Bombay Stock Exchange — official web site
- National Stock Exchange official web site
- BSE NSE Daily News
- Investor Souk Latest information, market buzz and other details about Indian IPO/FPOs