బాపు
వికీపీడియా నుండి
| బాపు | |
| జన్మ నామం | సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ |
|---|---|
| జననం | డిసెంబర్ 15,1933 |
| స్వస్థలం | నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్ |
| నివాసం | చెన్నై, తమిళనాడు |
| ఇతర పేర్లు | బాపు |
| వృత్తి | చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు సినిమా దర్శకుడు |
| మతం | హిందూ |
| భార్య/భర్త | భాగ్యవతి |
| తండ్రి | వేణు గోపాల రావు |
| తల్లి | సూర్యకాంతమ్మ |
| వెబ్‌సైటు | http://www.bapubomma.com/ |
బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు.బాపు బొమ్మల గురించి ప్రసిద్ది గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హ్రుద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది.
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
ఇలా కూనలమ్మ పదం రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతొ ఏకీబవించని వారు లేరు.బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతిరాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.
ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు,హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతొ పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలొ నిలిచిపొయాయనటం పొగడ్త కాదు.
క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపొయిన,తీసిన సినిమాలొ దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది,తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.
విషయ సూచిక |
[మార్చు] జీవితం
బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబర్ 15, 1933 వ సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం లో వేణు గోపాల రావు,సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు.[1] 1955 వ సంవత్సరం లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు.
[మార్చు] చిత్రకళ
బాపు చిత్రకళ ఒక విషయానికి పరమితంకాలేదు. 1945 నుండీ బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కధలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా సృష్టిస్తున్నారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు.
బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి.
నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించారు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.
- పొదుపుగా గీతలు వాడటం.
- ప్రవహించినట్లుండే ఒరవడి
- సందర్భానికి తగిన భావము
- తెలుగుదనము
బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి.స్టీవార్ట్స్ సంస్థలోనూ పని చేశారు. బాపు కృషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణ తో కలిసి రూపొందించిన బుడుగు పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్. ఇందులో బుడుగు తో పాటు సిగానపెసూనంబ తెలుగువారి హృదయంలో చిరకాలస్థానం సంపాదించుకొన్నారు. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి.
[మార్చు] బాపు చిత్రమాలిక
అసంఖ్యాకంగ ఈయన గీసిన అందమయిన, అద్భుతమయిన చిత్రాలలొనుండి మచ్చుకు కొన్ని...
|
రామాయణం క్లుప్తంగా |
[మార్చు] చలన చిత్రకళ
1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నారు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1976లొ వెలువడిన 'సీతాకల్యాణం' సినిమా చూసెవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది.
బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలని సచిత్రంగా ( స్టోరీబోర్డు ) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కిస్తారు.ఈ విదానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటారో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించగలుగుతారు.
ఉదాహరణకి...రాధాగోపాళం తెలుగు సినిమాకి ఈయన గీసుకున్న సన్నివేశపు చిత్రం.
[మార్చు] బాపు దర్శకత్వం వహించిన సినిమాలు
| చిత్రం పేరు | విడుదల సంవత్సరం | బాష |
|---|---|---|
| తెలుగు సుందరకాండ | 2008 | తెలుగు |
| రాధా గోపాళం | 2005 | తెలుగు |
| రాంబంటు | 1996 | తెలుగు |
| పెళ్ళికొడుకు | 1994 | తెలుగు |
| పరమాత్మా | 1994 | హిందీ |
| శ్రీనాథ కవిసార్వభౌమ | 1993 | తెలుగు |
| మిష్టర్ పెళ్ళాం | 1993 | తెలుగు |
| పెళ్ళి పుస్తకం | 1991 | తెలుగు |
| ప్రేమ్ ప్రతిగ్యా | 1989 | హిందీ |
| దిల్ జలా | 1987 | హిందీ |
| ప్యార్ కా సిందూర్ | 1986 | హిందీ |
| కళ్యాణ తాంబూలం | 1986 | తెలుగు |
| మేరా ధరమ్ | 1986 | హిందీ |
| ప్యారీ బెహనా | 1985 | హిందీ |
| బుల్లెట్ | 1985 | తెలుగు |
| జాకీ | 1985 | తెలుగు |
| మోహబ్బత్ | 1985 | హిందీ |
| సీతమ్మ సేత | 1984 | తెలుగు |
| మంత్రిగారి వియ్యంకుడు | 1983 | తెలుగు |
| వోహ్ సాత్ దిన్ | 1983 | హిందీ |
| ఏది ధర్మం ఏది న్యాయం | 1982 | తెలుగు |
| కృష్ణావతారం | 1982 | తెలుగు |
| నీతిదేవన్ మయగుగిరన్ | 1982 | తమిళం |
| పెళ్ళీడు పిల్లలు | 1982 | తెలుగు |
| బేజుబాన్ | 1981 | హిందీ |
| రాధా కళ్యాణం | 1981 | తెలుగు |
| త్యాగయ్య | 1981 | తెలుగు |
| హమ్ పాంచ్ | 1980 | హిందీ |
| వంశవృక్షం | 1980 | తెలుగు |
| కలియుగ రావణాసురుడు | 1980 | తెలుగు |
| పండంటి జీవితం | 1980 | తెలుగు |
| రాజాధిరాజు | 1980 | తెలుగు |
| తూర్పు వెళ్ళే రైలు | 1979 | తెలుగు |
| మనవూరి పాండవులు | 1978 | తెలుగు |
| అనోఖా శివభక్త్ | 1978 | హిందీ |
| గోరంత దీపం | 1978 | తెలుగు |
| స్నేహం | 1977 | తెలుగు |
| భక్త కన్నప్ప | 1976 | తెలుగు |
| సీతాస్వయంవర్ | 1976 | హిందీ |
| శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్ | 1976 | తెలుగు |
| సీతాకల్యాణం | 1976 | తెలుగు |
| ముత్యాల ముగ్గు | 1975 | తెలుగు |
| శ్రీ రామాంజనేయ యుద్ధం | 1974 | తెలుగు |
| అందాల రాముడు | 1973 | తెలుగు |
| సంపూర్ణ రామాయణం | 1971 | తెలుగు |
| బాలరాజు కధ | 1970 | తెలుగు |
| ఇంటి గౌరవం | 1970 | తెలుగు |
| బుద్ధిమంతుడు | 1969 | తెలుగు |
| బంగారు పిచ్చుక | 1968 | తెలుగు |
| సాక్షి | 1967 | తెలుగు |
[మార్చు] ప్రదర్శనలు
[మార్చు] ప్రముఖుల అభిప్రాయాలు
- శివలెంక రాధాకృష్ణ-ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని శ్రీ బాపు గారు మొదలు పెట్టారు.
[మార్చు] పురస్కారాలు
బాపు గారికి స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి. అందులో ముఖ్యమయినవి కొన్ని.
- బాపు గారి దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ పురస్కారం తో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యాకి చాయగ్రాకుడిగా పురస్కారం.
- 1986 వ సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం మదర్ థెరిస్సా బహుకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణ తో కలసి స్వీకారం.[2]
- చెన్నై(తమిళనాడు)లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిస్టాత్మకమయిన రాజ్యలక్ష్మి పురస్కారం 1982 వ సంవత్సరంలో ఇవ్వబడింది.
- 1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహుకరణ.
- 1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) వారిచే శిరోమణి పురస్కారం అమెరికాలో స్వీకరణ.
- మిస్టర్ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ పురస్కారం.(1993 వ సంవత్సరం)
- 1995 వ సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా(TANA) వారిచే తెలుగు చిత్ర కళా,సాహిత్య,సాంస్కృతిక,సినిమా రంగాలకి తన ఏభై సంవత్సరాల(గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకి గాను ఘన సన్మానం.
- బాపు గారిమీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.[3]
- 9 జూన్,2001 వ సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టుస్ (IIC) వారిచే జీవిత సాఫల్య పురస్కారం తో సన్మానం.
- 2 జూన్,2001 వ సంవత్సరంలో డిసెంబర్ న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే విశిష్ట పురస్కారంతో గౌరవం.
- అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవార్డు భాహుకరణ.[4]
- బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975),పెళ్లి పుస్తకం (1991), మిస్టర్ పెళ్ళాం (1993) సినిమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.
[మార్చు] మూలాలు
- ↑ http://www.bapubomma.com/biography.htm తీసుకొన్న తేది:09,జూన్ 2008.
- ↑ http://www.bapubomma.com/biography.htm తీసుకొన్న తేది:14, ఏప్రిల్ 2008.
- ↑ http://bapuart.com/pages.php?page=1&pID=5 తీసుకొన్న తేది:16,ఏప్రిల్ 2008.
- ↑ http://www.bapubomma.com/biography.htm తీసుకొన్న తేది:15,ఏప్రిల్ 2008.
[మార్చు] బయటి లింకులు
- http://www.bapubomma.com/
- http://www.bapuart.com
- http://bapuartcollection.com
- బాపు - ఒక పరిచయం
- మా సినిమాలు - బాపు
- నవతరంగం బాపు వ్యాసాలు
|
|
||
|---|---|---|
| తెలుగువారు | బాపు · జయదేవ్ · బాబు · సురేఖ · తులసీరాం · సత్యమూర్తి · రామకృష్ణ · బాలి · K · భగవాన్ · గీతా సుబ్బారావు · శంకు · రాగతి పండరి · AVM · శ్రీధర్ · రాజన్ · మల్లిక్ · | |
| ఇతరులు | ఊమెన్ · శంకర్ పిళ్ళై · అబూ అబ్రహం · ఆర్కే లక్ష్మణ్ · మారియో మిరండా · | |








