బారామతి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(బారామతి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బారామతి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°9′23″N 74°34′49″E మార్చు
పటం

బారామతి లోక్‌సభ నియోజకవర్గం (Baramati Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. కేంద్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఇక్కడి నుంచి 6 సార్లు విజయం సాధించాడు. తొలిసారి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తరఫున, 3 సార్లు కాంగ్రెస్ తరఫున, ఆ తర్వాత రెండు సార్లు నేషనలిస్ట్ పార్టీ తరఫున గెలుపొందినాడు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఈ నియోజకవర్గపు ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలు.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు[మార్చు]

  1. దౌండ్
  2. ఇందాపూర్
  3. బారామతి
  4. పురందార్
  5. భోర్
  6. ఖడక్‌వస్లా

విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

  • 1977: సంభాజీరావు కకాడే (భారతీయ లోక్‌దళ్)
  • 1980: శంకర్‌రావు పాటిల్ (కాంగ్రెస్ ఐ)
  • 1984:శరద్ పవార్ (ఇండీయన్ కాంగ్రెస్ సోషలిస్ట్)
  • 1985 (ఉప ఎన్నిక) : సంభాజీరావు కకాడే (జనతా పార్టీ)
  • 1989: శంకర్‌రావు పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1991: అజిత్ పవార్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1996: శరద్ పవార్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1998: శరద్ పవార్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1999: శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
  • 2004: శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
  • 2009: సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
  • 2014: సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
  • 2019: సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)

2009 ఎన్నికలు[మార్చు]

2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుప్రియా సేలే తన సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాంతా నలవాడేపై 3,36,831 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. సుప్రియాకు 4,87,827 ఓట్లు రాగా, నలవాడేకు 1,50,996 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]