బిపిన్ చంద్ర పాల్ (నవంబర్ 7, 1858–మే 20 1932) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక బందే మాతరంను మొదలెట్టాడు. ఆ పత్రికలో అరబిందో వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై గాంధీ సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. బ్రహ్మ సమాజంలో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.
[మార్చు] బయటి లంకెలు