బియాంత్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బియాంత్ సింగ్
జననం
బియాంత్ సింగ్

(1959-01-06)1959 జనవరి 6
జైతు, పంజాబ్, భారతదేశం
మరణం1984 అక్టోబరు 31(1984-10-31) (వయసు 25)
న్యూఢిల్లీ, భారతదేశం
మరణ కారణంహత్య తర్వాత విచారణ సమయంలో కాల్చి చంపబడ్డారు
జాతీయతభారతదేశం
వృత్తిభారత ప్రధాని అంగరక్షకుడు
ఉద్యోగంభారతదేశ ప్రభుత్వం
నేరారోపణ(లు)ఇందిరా గాంధీ హత్య
జీవిత భాగస్వామి
విమల్ కౌర్ ఖల్సా
(m. 1976; మరణం 1990)
తల్లిదండ్రులు
  • బాబా సుచా సింగ్ (తండ్రి)
  • కార్టర్ కౌర్ (తల్లి)

బియాంత్ సింగ్ ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా వుండగా ఆమెకు అంగ రక్షకులుగా వున్న వారిలో ఒకడు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో గోల్డెన్‌టెంపుల్-హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా సహచర అంగ రక్షకుడు సత్వంత్ సింగ్ తో కలసి 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ పై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ సందర్భంలో బియాంత్ సింగ్ ను ఇతర బాడీ గార్డులు తక్షణమే కాల్చి చంపారు.

కుటుంబం[మార్చు]

బియాంత్ సింగ్ రామ్‌దాసియా సిక్కు కుటుంబంలో బాబా సుచా సింగ్, కర్తార్ కౌర్ దంపతులకు 1959 జనవరి 6న జన్మించాడు.[1] సింగ్ భార్య బిమల్ కౌర్ ఖల్సా మొదట్లో సిక్కు మిలిటెంట్ గ్రూపులో చేరింది. తరువాత జైలు పాలయింది.[2] తరువాత ఆమె రోపార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలుపొందింది. అతని తండ్రి బాబా సుచా సింగ్ కూడా బతిండా లోక్ సభ నియోజకవర్గం నుండి సభ్యునిగా ఎన్నికయ్యాడు.[3][4][5] అతని కుమారుడు సర్బిజిత్ సింగ్ సిరోమణి అకాలీదళ్ (మన్న్) నాయకుడు.

ఇందిరా గాంధీ హత్య[మార్చు]

అక్టోబరు 31 1984 న సుమారు 9:20 కు ఐరిష్ టెలివిజన్ కొరకు డాక్యుమెంటరీ నిర్మాణం కోసం బ్రిటిష్ నటుడు "పీటర్ ఉస్తినోవ్"కు ఇంటర్వ్యూ యిచ్చుటకు వెళ్ళవలసి ఉంది. ఆ సందర్భంలో ఆమె తన యింటి ఉద్యానవనం గుండా నడుచుకుంటూ యింటి సమీపంలో గల అక్బర్ రోడ్డు అఫీసుకు వెళ్ళుచున్నది.[6]

ఆమె తన వికెట్ గేట్ వద్దకు వచ్చేసరికి అక్కడ కాపలాగా ఉన్న సత్వంత్‌సింగ్ , బియాంత్ సింగ్ లు కాల్పులు జరిపారు. సబ్‌ఇనస్పెక్టరు అయిన బియాంత్ సింగ్ మూడు రౌండ్లు కాల్పులు ఉదరంలోకి జరిపాడు.[7] వెంటనే సత్వంత్ సింగ్ తన వద్ద ఉన్న స్టెన్ గన్ తో 30 రౌండ్ల కాల్పులను ఆమె నేలకూలే వరకు కాల్చాడు.[7] కాల్పుల అనంతరం ఇద్దరూ వారి ఆయుధాలను నేలపైకి విసిరి వేసారు. బియాంత్ సింగ్ "నేను ఏది చేయాలనుకున్నానో అది చేసాను. నీవు ఏమి చేయాలనుకున్నావో అది చేసావు" అని అన్నాడు. తరువాతి ఆరు నిమిషాలలో ఇండో టిబిటన్ బోర్డర్ పోలీసుకు సంబంధించిన సైనికులైన తార్సెమ్‌సింగ్ జమ్వాల్, రామ్‌శరణ్ లు వారిని పట్టుకొని బియాంత్‌సింగ్ ను ప్రత్యేక గదిలో కాల్చి చంపారు. బియాంత్ సింగ్ ఆ గదిలో ఉన్న అధికారులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించినందున అతనిని కాల్చి చంపారు. సత్వంత్ సింగ్ ఇందిరాగాంధీ యొక్క యితర అంగరక్షకునిచే అరెస్టు కాబడినాడు.[8] సత్వంత్ సింగ్ తన తోడు దొంగ అయిన కేహార్ సింగ్ తో సహా 1989లో ఉరి తీయబడ్డాడు.[9]

గౌరవాలు, మరణ వార్షికోత్సవాలు[మార్చు]

  • 2003 లో అమృత్‌సర్ లోని స్వర్ణదేవాలయ కాంప్లెక్స్‌లో ఉన్న అకాల్ తఖ్త్‌లోని ఎత్తైన సిక్కు తాత్కాలిక సీటులో భోగ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో అతనికి నివాళులు అర్పించారు.
  • 2004 లో అతని మరణ వార్షికోత్సవాన్ని మళ్ళీ అమృత్‌సర్‌లోని అకల్ తఖ్త్‌లో జరుపుకున్నారు, అక్కడ అతని తల్లిని ప్రధాన పూజారి సత్కరించాడు. వివిధ రాజకీయ పార్టీలు సత్వంత్ సింగ్, కేహర్ సింగ్ లకు నివాళులు అర్పించారు.[10]
  • 2008 జనవరి 6న అకల్ తఖ్త్ బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్‌లను 'సిక్కు మతం అమరవీరులు' గా ప్రకటించారు,,[11][12][13]
  • భారతదేశంలో సిక్కు మతం కేంద్రీకృత రాజకీయ పార్టీ శిరోమణి అకాలీదళ్, బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ మరణ వార్షికోత్సవాన్ని 2008 అక్టోబరు 31 న మొదటిసారి 'బలిదానం' దినంగా జరుపుకుంది; ప్రతి అక్టోబరు 31 నుండి, వారి 'బలిదాన దినం' శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ వద్ద పాటించారు.[14]

మూలాలు[మార్చు]

  1. "Perspective : What Motivated Beant Singh to assassinate Indira Gandhi?". The Indian Panorama (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-12-08. Retrieved 2020-06-04.
  2. "Sikhs Sought in Slaying". India; Amritsar (India): NYTimes.com. 6 June 1986. Archived from the original on 6 జూన్ 2010. Retrieved 13 October 2012.
  3. Crossette, Barbara (22 December 1989). "India's New Chief Given A Go-Ahead - New York Times". Nytimes.com. Retrieved 13 October 2012.
  4. MyNews.in. "'Father didn't kill Indira Gandhi to make Sikhs happy': Beant Singh's son". MyNews.in. Archived from the original on 5 మార్చి 2014. Retrieved 18 జూన్ 2020.
  5. "Family profile". Indiaenews.com. 28 September 2012. Archived from the original on 25 ఫిబ్రవరి 2012. Retrieved 25 January 2018.
  6. "25 years after Indira Gandhi's assassination". CNN-IBN. 30 October 2009. Archived from the original on 4 నవంబరు 2011. Retrieved 18 జూన్ 2020.
  7. 7.0 7.1 Smith, William E. (12 November 1984). "Indira Gandhi's assassination sparks a fearful round of sectarian violence". Time. Retrieved 19 January 2013.
  8. "Questions still surround Gandhi assassination". Times Daily. New Delhi. AP. 24 November 1984. Retrieved 19 January 2013.
  9. Dr. Sangat Kr. Singh, The Sikhs in History, p. 393
  10. "The Tribune, Chandigarh, India - Punjab". Tribuneindia.com. Retrieved 19 January 2013.
  11. "Chandigarh, India - Punjab". Tribuneindia.com. 7 January 2003.
  12. "National: Indira Gandhi killers labelled martyrs". The Hindu. Chennai, India. 7 January 2003. Archived from the original on 10 జనవరి 2008. Retrieved 13 October 2012.
  13. "Indira assassin 'great martyr': Vedanti". The Indian Express. 7 January 2003. Retrieved 13 October 2012.
  14. "Chandigarh, India - Punjab". Tribuneindia.com. 1 November 2009. Archived from the original on 25 అక్టోబరు 2012. Retrieved 25 January 2018.

బయటి లింకులు[మార్చు]