బిర్లా నక్షత్రశాల, చెన్నై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిర్లా ప్లానిటోరియం
స్థాపితం11-05-1988
ప్రదేశంనెం. 4, గాంధీ మండపం రోడ్డు, కొత్తూర్‌పురం, చెన్నై, భారతదేశం.
భౌగోళికాంశాలు13°00′43″N 80°14′37″E / 13.012°N 80.2437°E / 13.012; 80.2437
రకంప్లానిటోరియం మ్యూజియం
డైరక్టరుపి. అయ్యంపెరుమాళ్
Public transit accessకస్తూర్బా నగర్ MRTS స్టేషను
వెబ్‌సైటుhttp://tnstc.gov.in/index.htm

బిర్లా నక్షత్రశాల, చెన్నై అనగా చెన్నైలో ఉన్న ఒక పెద్ద ఖగోళ సందర్శన శాల. ఇది రాత్రి పూట ఆకాశంలో పయనిస్తున్నట్లుగా కాల్పనిక పర్యటనను అందిస్తుంది, ప్రత్యేకంగా చిల్లుల అర్ధగోళ అల్యూమినియం అంతర్గత గోపురంపై విశ్వ సంబంధిత ప్రదర్శనలను చూపుతుంది. ఇది దేశంలో ఐదవ B. M. బిర్లా ప్లానిటోరియం, [1] ఇది కొత్తూర్‌పురంలో పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రాంగణంలో ఉన్నది, ఈ సెంటర్ 500పైగా ప్రదర్శనలతో ఫిజికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, శక్తి, లైఫ్ సైన్సు, ఇన్నోవేషన్, రవాణా, అంతర్జాతీయ డాల్స్, పిల్లల, మెటీరియల్స్ సైన్స్ అనే ఎనిమిది గ్యాలరీల భవన సముదాయాన్ని కలిగి ఉంది. దీనిని భారతదేశం యొక్క గొప్ప పారిశ్రామికవేత్త, దూరదృష్టి కలిగిన B. M. బిర్లా జ్ఞాపకార్థం 1988లో నిర్మించబడింది, ఇది భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్లానిటోరియం. భారతదేశంలోని ఇతర బిర్లా ప్లానిటోరియంలలో కోల్‌కతాలోని M. P. బిర్లా ప్లానిటోరియం, హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం, తిరుచిరాపల్లి ప్లానిటోరియం, కోయంబత్తూరు ప్లానిటోరియాలు ఉన్నాయి.

ప్రదర్శనలు[మార్చు]

ప్లానిటోరియం ప్రతిరోజు వివిధ భాషలలో వేర్వేరు సమయాల్లో స్కై షోలను నిర్వహిస్తుంది. ప్రదర్శనలలో సౌర వ్యవస్థ, ఆకాశం, రుతువులు, గ్రహణాలు, భూమి, చంద్రునిపై మనిషి, తోకచుక్కలు, షూటింగ్ ఉల్కలు, నక్షత్ర చక్రం, లోతైన ఆకాశం ఉన్నాయి. 2007 నుండి, ప్లానిటోరియం ఈ అంశాలపై 35 కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఖగోళ శాస్త్రం, విభిన్న విశ్వ దృగ్విషయాల యొక్క వివిధ అంశాలపై ఆడియో-విజువల్ ప్రోగ్రామ్‌లు కూడా చూపబడ్డాయి. ప్రోగ్రామ్ థీమ్‌లు ప్రతి 3 నెలలకు మార్చబడతాయి.[2] షోలు ఇంగ్లీషు, తమిళంలో నిర్వహిస్తారు. ప్లానిటోరియం, సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ జాతీయ సెలవు దినాల్లో మినహా అన్ని రోజులలో ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:45 వరకు తెరిచి ఉంటుంది.

సైన్స్ పార్క్ వద్ద ఒక రాకెట్ నమూనా
పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్, బిర్లా ప్లానిటోరియం, చెన్నై

మూలాలు[మార్చు]

  1. Muthiah, S. (2014). Madras Rediscovered. Chennai: EastWest. p. 282. ISBN 978-93-84030-28-5.
  2. "Birla Planetarium". ChennaiNetwork.com. Archived from the original on 15 October 2011. Retrieved 16 Oct 2011.