బీడీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బీడీ కంపెనీలు

బీడీ ఒక రకమైన దక్షిణ ఆసియా సిగరెట్టు. పొగాకు చుట్టూ బీడీ ఆకుల్ని (Diospyros melonoxylon) చుట్టి ఒక చివర దారంతో కట్టి ఈ బీడీలు తయారుచేస్తారు. బీడీలలో పొగాకు 10-20 శాతం వరకు ఉంటుంది. అయితే సిగరెట్టుతో పోలిస్తే బీడీల వలన నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ మరియు తారు ఎక్కువగా శరీరంలోకి చేరుస్తుంది.[1]. పొగాకు లాగా బీడీలు ఉపయోగించడం వలన కూడా వివిధ రకాల వ్యాధులు మరియు కాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది.

బీడీ చుట్టడం భారతదేశంలో ఒక కుటీర పరిశ్రమ (cottage industry). సాధారణంగా గ్రామీణ స్త్రీలు వారివారి ఇండ్లలో వీటిని తయారుచేస్తారు. బీడీలలో చాలా రకాలున్నాయి. తయారైన రాష్ట్రాన్ని బట్టి, రుచిని బట్టి వాడకం ఆధారపడి ఉంటుంది. రుచులలో వెనీల, స్ట్రాబెర్రి, చక్ లేట్ మరియు మామిడి ముఖ్యమైనవి. సామాన్యంగా గుజరాత్, మైసూర్ రకాలు ఎక్కువమంది ఇష్టపడతారు.

సిగరెట్టుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు మూలంగా బీడీ తాగే అలవాటు ఎక్కువగా పేదలలో కనిపిస్తుంది. భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, శ్రీలంక, కంబోడియా మరియు బంగ్లాదేశ్ దేశాలలో బీడీలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక్క భారతదేశంలోనే సుమారు 850 బిలియన్ బీడీలు తాగుతున్నారని అంచనా.


బీడీ ఆకుల సేకరణ ఆడవీ ప్రాంతాలలో నివసించే షెడ్యూల్ కులాలు మరియు తెగల ప్రజల ఉపాధి కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.[2]


అభివృద్ది చెందిన దేశాలలో కూడా 31 నుండి 58 శాతం పాఠశాల విద్యార్ధులు బీడీలను రుచిచూసినట్లు అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని సర్వేలో తెలిసింది.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

బీడీ ఆకు చెట్టు

మూలాలు[మార్చు]

  1. Bidis and Krekets Fact Sheet — Centers for Disease Control and Prevention, February 2007
  2. Beedi Leaf Scheme of APFDC.
  3. Bidi Use Among Urban Youth — Massachusetts, March-April, 1999. Morbidity and Mortality Weekly Report September 17, 1999; 48(36):796–799.
"http://te.wikipedia.org/w/index.php?title=బీడీ&oldid=1196726" నుండి వెలికితీశారు