బీదరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బీదరు జిల్లా
రాష్ట్రము: కర్ణాటక
ప్రాంతము: [[]]
ముఖ్య పట్టణము: బీదరు
విస్తీర్ణము: చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: లక్షలు
పురుషులు: లక్షలు
స్త్రీలు: లక్షలు
పట్టణ: లక్షలు
గ్రామీణ: లక్షలు
జనసాంద్రత: / చ.కి.మీ
జనాభా వృద్ధి:  % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము:  %
పురుషులు:  %
స్త్రీలు:  %
చూడండి: కర్ణాటక జిల్లాలు

బీదర్ (Kannada: ಬೀದರ, Telugu: బీదరు, Marathi: बीदर) (ఈశాన్య)కర్నాటకలోని ఒక జిల్లా. ఇది పూర్వపు హైదరాబాదు రాష్ట్రములో ఉండి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయములో మైసూరు రాష్ట్రము (ఇప్పటికర్నాటక)లో విలీనము చేయబడినది. ఇక్కడ ప్రధాన భాష కన్నడము. తెలుగు మరియు మరాఠి ప్రభావము కూడా అధికముగానే ఉంటుంది. ఇది కర్నాటకలో ముస్లిం ప్రాబల్యముగల జిల్లా.

పూర్వచరిత్ర[మార్చు]

హైదరాబాద్ కు దగ్గర లో వున్న చారిత్రక ప్రదేశము " బీదర్ " . హైదరాబాద్‌ నుండి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది బీదర్‌. 9వ జాతీయ రహదారి మీద ఓ మూడు గంటల ప్రయాణం.ఇక్కడి వాతావరణము , ప్రకృతి అందాలకు ముచ్చట పడ్డ బహ్మనీ సుల్తాన్ 1429 లో బీదర్ నిర్మాణానికి పూనుకున్నాడని చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి . 1724 నుంచి 1948 వరకూ నిజాం నవాబుల ఏలుబడి లో వుంది . హైదరబాద్ ప్రాంతము లో బాగము గా వున్న బీదర్ ఆ తరువాత కర్ణాటక లో భాగమైపోయింది. పూర్వం దీని నుంచి వచ్చే దండయాత్రలను ఇబ్బందిగా భావించిన నేపద్యంలో ‘బెడదకోట’ గా పిలిచే వారు. బీదర్‌ పట్టణానికి మరో పేరుగా ఒకప్పుడు విదురా నగరం పేరుతో ఉండేదట. మహాభారతంలోని విదురుడు ఇక్కడే ఉండేవాడట.

1429లో బహమనీ రాజు ఒకటవ అహ్మద్‌ షా దీన్ని రాజధానిగా చేసుకున్నాడు. 'అహ్మదాబాద్‌ బీదర్‌' అని పేరు మార్చాడు. దాదాపు ఒక శతాబ్దం పాటు బహమనీ రాజుల పాలనలో ఉన్న బీదర్‌, 1527లో దక్కను పాలకులైన బరీద్‌ షాహీల చేతుల్లోకి వెళ్లింది. మరో రెండు వందల సంవత్సరాల తర్వాత ఔరంగజేబు బీదర్‌ని ఆక్రమించాడు. అతను 1713లో ఆసఫ్‌ జాహీని దక్కను ప్రాంత సుబేదారుగా నియమించాడు. ఆసఫ్‌ జాహీ 1724లో నైజాం ప్రభుత్వాన్ని నెలకొల్పాడు. ఇంతమంది చేతులు మారినా, బీదర్‌లో మనకు కనిపించే శిధిల కట్టడాల్లో చాలా వరకు బహమనీ రాజులవే కావడం విశేషం. ఈ పట్టణానికి అయిదు ద్వారాలున్నాయి.

చౌబారా[మార్చు]

బీదరు కోటకు చేరే ముందు ఎనభై అడుగుల ఎత్తున్న పహారా గోపురం వుంటుంది దానిని చౌబారా అంటారు. అయిదు శతాబ్దాల క్రితం దాని పైన సైనికులు పహారా కాస్తూ పట్టణానికి రక్షణగా ఉండేవారట.

సోలా కంభ్ మసీదు[మార్చు]

దీన్ని 1423లో నిర్మించారట. దీని మధ్య భాగంలో 16 స్తంభాలున్నాయి. అందువల్లే ఆ పేరు. మసీదు చుట్టూ అందమైన గార్డెన్‌ కూడా ఉంది

గగన్ మహల్[మార్చు]

అప్పటి రాణీవాసం పేరు గగన్ మహల్. చౌబారా గోపురానికి సమీపంలోనే మహమూద్‌ గవన్‌ మదరసా ఉంది. ఇది దాదాపుగా శిధిలమైపోయినట్లే. అప్పట్లో ఇది మూడంతస్థుల భవనమట. దీనికి నాలుగు ఎత్తైన మినార్లూ ఉంటేవట. ఇప్పుడొక్కటే మిగిలింది. దానిపై తాపడం చేసిన నీలం, తెలుపు, పసుపు రాళ్లు ఇరాన్‌ నుండి తెప్పించారట.

గురుద్వారా,అమృత కుండ్[మార్చు]

ఇక్కడ కొన్నాళ్ళు గురునానక్ వున్నారట అక్కడ ఒక్క సన్నని నీటిధార వస్తూ వుంటుంది దానిని గురునానక్ వేసిన మొదటి అడుగు ప్రాంతం అంటారు. అది ప్రవహించి ఒక చిన్న కుండీ వంటి నిర్మాణంలోకి వస్తుంది. దానిని అమృత కుండ్ అంటారు.

పాపనాశం శివాలయం[మార్చు]

శివభక్తుడైన రావణుని సంహారం తర్వాత తిరిగొస్తున్న రాముడు, శివభక్తుని సంహార దోషం తొలించుకునేందుకు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని చెపుతారు.

బసవ గిరి[మార్చు]

వీరశైవము క్లిష్ట పరిస్తితులలో వున్నప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు భూలోకములో ' బసవేశ్వరు ' ని గా అవతరించి వీర శైవ ధర్మమును ప్రభోదించాడట. ఆ బసవన్న ప్రార్ధనామందిరమే ఈ బసవగిరి.

జాలా నరసింహ దేవాలయం[మార్చు]

ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ వుండగా ' జలాసురుడు ' అనే రాక్ష్సుడు ఆయనను చాలా విసిగిస్తూ వున్నాడట . అప్పుడు లక్ష్మీనరసిమ్హ స్వామి వచ్చి జలాసురుడిని సమ్హరించాడట . జలాసురుడి కొద్దిగా పుణ్యము చేసుకొని వుండటము వల్ల , ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడట నరసిమ్హస్వామి . ఐతే నువ్విక్కడే వెలవాలి , నిన్ను నా పేరు తో కలిపి పిలువాలి అని కోరాడట జలాసురుడు . అప్పుడు నరసిమ్హస్వామి అక్కడ వెలిశి ' జలానరసిమ్హుడు ' గా కొలవబడుతున్నాడు .' జలా అంటే నీరు కాబట్టి , నరసిమ్హస్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తోందిట. ఇలా 600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేస్తే కానీ జాలా నరసింహుని సందర్శన సాధ్యం కాదు

వెలుపలి లింకులు[మార్చు]

http://prayanamlopadanisalu.blogspot.in/2011/10/blog-post.html

"http://te.wikipedia.org/w/index.php?title=బీదరు&oldid=1321372" నుండి వెలికితీశారు