బీమా
భవిష్యత్తులో మన ఆరోగ్యానికి, వ్యాపారాలకు, ఆస్థులకు ఏమి జరుగుతుందో ఊహించలేం.మనకు, మన కుటుంబాలకి నష్టం కలిగే అవకాశాన్నించి రక్షణ పొందడాన్ని బీమా(Insurance) చేయటం అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే బీమా అనగా అనుకోని విపత్తు లకు బీమా సంస్ధచే అందచేయబడే ధన సహాయం. దీని ద్వారా కొంత మానసికంగా స్థిరత్వాన్ని పొందవచ్చు, విపత్తు సంభవిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఆస్థికి, ఆరోగ్యానికి, విలువైనది ఏదయినా బీమా చేయవచ్చు. దీని కొరకు వినియోగదారు, బీమా సంస్ధతో అనుకోని విపత్తులకి కావలసిన నష్ట పరిహారం, బీమా కాలం, విపత్తు మూలం అవబడే తెలిసిన వివరాలు ఏవైనా తెలియబరిచి, బీమా సంస్థ ఒప్పందం ప్రకారం ఒకసారి గాని, క్రమ పద్దతి లో డబ్బు (ప్రీమియం) చెల్లించాలి. అప్పుడు బీమా సంస్థ ఒప్పందం ప్రకారం విపత్తు సంభవించినపుడు, లేక కాల పరిమితి ముగిసిన రోజున ఒప్పందం ప్రకారం ఇవ్వ వలసిన ధనం ఇస్తుంది. బీమా ఒప్పందాలు పెట్టుబడితో మిళితం అయి, విపత్తు జరగక పోయినా, కాల పరిమితి ముగిసిసప్పుడు కొంత రాబడిని కలిగిస్తాయి.
ఆభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలలో ఎక్కువ మంది బీమా చేస్తున్నారు. మన దేశంలో అవగాహన తక్కువ వలన, ప్రభుత్వ రంగం సంస్థలు గుత్తాధిపత్యం వలన, జీవితంపై తాత్విక భావనల (జరిగేది ఏదో జరగక మానదు, అన్నింటికి ఆ భగవంతుడిదే భారం) వలన బీమా అంతగా వ్యాప్తిచెందలేదు. సరళీకృత విధానాల వలన,1991-92 లో బీమా రంగంలో ప్రైవేటు రంగంలోబహుళ జాతి సంస్థలు ప్రవేశించటం వలన, బీమా రంగం అభివృద్ధి పెరిగింది. దీనికి తోడు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. మల్హోత్రా కమిటీ సిఫార్సుల ననుసరించి బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ [1]1999 లో స్వయంనిర్ణాయక సంస్థగా స్థాపించబడి, ఆగష్టు 2000 లోరాజ్యాంగ సంస్థగా మారింది. బీమా రంగం 15-20 శాతం పెరుగుదలతో, అనుబంధ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలతో కలిసి భారత స్థూల జాతీయోత్పత్తి లో 7 శాతం భాగంగా వుంది.[1]
విషయ సూచిక |
[మార్చు] ప్రధాన కంపెనీలు
2009 మార్చి వరకు 21 సాధారణ బీమా సంస్థలు, 22 జీవిత బీమా సంస్థలు, 1 మళ్లీ బీమా (Reinsurer) సంస్థ పని చేస్తున్నాయి. [2]
- జీవిత బీమా
ఎల్ఐసి,ఐఎన్జివైశ్య, మ్యాక్స్ న్యూయార్క్, ఓం కోటక్ మహీంద్రా, టాటా ఎఐజి,బిర్లా సన్ లైఫ్, హెచ్డిఎఫ్సి,ఐసిఐసిఐ ప్రూడెన్షియల్, రిలయన్స్ ...
- సాధారణ బీమా
యునైటెడ్ ఇండియా.
[మార్చు] ఉద్యోగ స్థాయిలు
ఏజెంట్, కన్సల్టెంట్, అభివృద్ధి అధికారి,సర్వేయర్, అండర్ రైటర్, రిస్క్ మేనేజర్,క్లెయిమ్స్ అడ్జస్టర్
[మార్చు] ఉద్యోగానికి అర్హతలు
ఇంటర్మీడియట్ ఆ పై చదువుతో రకరకాల స్థాయిలలో ఉపాధి పొందవచ్చు.వాక్చాతుర్యం, ఓపిక, చిరునవ్వు, వినయంగా మాట్లాడటం, కష్టమర్ని ఒప్పించగల నేర్పు లాంటి మృదు నైపుణ్యాలుండాలి. తక్కువ చదువుతో పాక్షిక కాల ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వున్నాయి.
[మార్చు] ఉపాధికి శిక్షణ, తోడ్పాటు
ఏజెంటు శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ పొంది, సంబంధిత ఐఆర్డిఎ పరీక్షలో వుత్తీర్ణత తరువాత, పాక్షిక కాల, లేక పూర్తి కాల ఉద్యోగాలు పొందవచ్చు. కొన్ని బీమా సంస్థలు అభ్యర్థులను ఎంపిక చేసి, శిక్షణ యిప్పించి, ఉత్తీర్ణులైన తరువాత ఏజెంటుగా నియమిస్తాయి. జీవిత లేక సాధారణ బీమాకి 100 గంటలు, రెండింటికి 150 గంటలు శిక్షణ పొందాలి.
[మార్చు] వనరులు
|
||||||||