బెల్లంకొండ

వికీపీడియా నుండి

  ?బెల్లంకొండ మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో బెల్లంకొండ మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో బెల్లంకొండ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము బెల్లంకొండ
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 13
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
30,790 (2001)
• 15600
• 15190
• 47.06
• 59.15
• 34.79


పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు - బెల్లంకొండ. గుంటూరు జిల్లాలో గుంటూరు-పొందుగల రహదారి పక్కన సత్తెనపల్లికి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు మాచర్ల రైలు మార్గంలో ఉంది.

వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. 1511 లో శ్రీ కృష్ణదేవ రాయలు అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న బెల్లంకొండ దుర్గమును స్వాధీనం చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్యము పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉన్నది. సదాశివ రాయలు కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము (1554) ద్వారా తెలుస్తున్నది.


వివాదాస్పదమైన పులిచింతల ప్రాజెక్టు వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: పులిచింతల, కోళ్ళూరు , చిట్యాల, కేతవరం, బోదనం.


[మార్చు] మండలంలోని గ్రామాలు

  1. పులిచింతల,
  2. కోళ్ళూరు గొల్లపేట
  3. చిట్యాల, చిట్యాలతండా
  4. కేతవరం , నూతికేతవరం
  5. వెంకటాయపాలెం ,
  6. బోదనం,గోపాలపురం ,కామేపల్లి
  7. ఎమ్మాజీగూడెం,
  8. మన్నేసుల్తాన్‌పాలెం,
  9. పాపయ్యపాలెం,
  10. చండ్రాజుపాలెం,
  11. వన్నయ్యపాలెం,
  12. మాచాయపాలెం,
  13. బెల్లంకొండ

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు