బైతుల్ మాల్

వికీపీడియా నుండి

బైతుల్ మాల్ (ఆంగ్లం : Bayt al-mal) లేదా బైత్ అల్-మాల్, ఈ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం విత్త గృహము లేదా ధన గృహము. ఇస్లాం పరిభాషలో చారిత్రకంగా ఇది ఒక ఆర్థిక సంస్థ, దీని ప్రధాన ఉద్దేశ్యం పన్నుల విధానాలు. ఖలీఫాల కాలంలో సుల్తానుల కాలంలో ఇది 'అధికారిక ఖజానా గృహం' గా జకాత్ రెవెన్యూల కొరకు మరియు ప్రజా పనులకొరకు పనిచేసింది. నవీన ఇస్లామీయ ఆర్థిక వేత్తలు, ఈ విధానం ప్రస్తుత సమాజానికి ప్రత్యేకంగా ఇస్లామీయ సమాజానికి సరియైనదిగా అభివర్ణిస్తారు.