బొక్కెన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోలు సంచిని కట్టడానికి దానికి పైభాగాన ఉండే ఇనుప బొక్కెన

నీరును కొంచెం దూరం తీసుకు వెళ్లడానికి లేదా కొంత లోతు నుంచి నీరును పైకి తేవడానికి ఉపకరించే పరికరాన్ని బొక్కెన అని అంటారు. బొక్కెనను ఇంగ్లీషులో బక్కెట్ అంటారు.

వాడే సందర్భాన్ని బట్టి బక్కెట్ ను తెలుగులో వివిధ పేర్లతో పిలుస్తారు.

బక్కెట్[మార్చు]

ఇంటిలో ఒక గది నుంచి మరొక గదికి కుళాయి దగ్గర నుంచి ఇంటి లోనికి ఇలా కొద్ది దూరం నీరును తేచుకునేటప్పుడు వాడే బక్కెట్ ను బక్కెటు అంటారు.

బక్కెట్

ఈ బక్కెట్ ప్లాస్టిక్ తయారు చేయబడి ఉంటే ప్లాస్టిక్ బక్కెట్ అని ఇనుముతో తయారు చేసిన బక్కెట్ ను ఇనుప బక్కెట్ అని ఇత్తడితో చేసిన బక్కెట్ను ఇత్తడి బక్కెట్ అని ఇలా పదార్థంతో తయారు చేయబడిన బక్కెట్ ను ఆ పదార్థం పేరును ముందుకు చేర్చి ఆ బక్కెట్ గా పిలుస్తారు.

చేద[మార్చు]

బక్కెట్ కు తాడు కట్టి చేదుడు బావి నుంచి నీరును తోడుకుంటున్నప్పుడు లేక చేదుకుంటున్నప్పుడు ఈ బక్కెట్ ను చేద అని పిలుస్తారు.

చేద (బక్కెట్ కు తాడు కట్టినందువలన దీనిని చేద అంటారు.)

బొక్కెన[మార్చు]

పూర్వం ఎద్దుల సహాయముతో బావిలోంచి నీళ్ళను తోడటానికి ఉపయోగించే పెద్ద తోలు సంచిని బొక్కెన అంటారు. ఈ తోలు సంచిని కట్టడానికి దానికి పైభాగాన ఇనుప బొక్కెన ఉంటుంది.

తరువాత కొంత కాలానికి పెద్ద తోలు సంచి స్థానంలో పెద్ద ఇనుప బక్కెట్లు వచ్చాయి. వీటిని కూడా బొక్కెన గానే వ్యవహరించారు. ప్రస్తుత కాలంలో బొక్కెనలు ఉపయోగించడం లేదు.

పాత కాలం నాటి తోలు బొక్కెనలు కనుమరుగవగా ప్రస్తుతం ఇనుప బొక్కెనలు అక్కడక్కడా తారస పడుతుంటాయి.

సామెతలు[మార్చు]

తెగిన బొక్కెన నూతిలోకే

గ్యాలరీ[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బొక్కెన&oldid=1947205" నుండి వెలికితీశారు