ఉగ్గాని

వికీపీడియా నుండి
(బొరుగుల తిరగవాత నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బజ్జీలతో వడ్డించిన ఉగ్గాని

బొరుగుల (మరమరాల) తో తయారు చేయబడు అల్పాహారం. ఎక్కువగా రాయలసీమలో, దక్షిణ కర్ణాటకలో చేయబడుతుంది.

తయారు చేయు విధానం: బొరుగులని నీళ్ళలో నానబెట్టి, (రంధ్రాల గిన్నెలోకి వాటిని వేసి) నీటిని మొత్తం వడగట్టాలి.

పప్పులు (పుట్నాలు), ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు (లేదా కారంపొడి) మిక్సీలో వేసుకోవాలి. దీనిని నానిన బొరుగులతో కలిపి ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని, పోపు గింజలతో దోరగా వేయించుకోవాలి. (రుచికి టమోటా ముక్కలను కూడా చేర్చుకోవచ్చును.) బొరుగులకి పోపు పెట్టుకోవాలి. (పులుపు కోసం పొయ్యి పై నుండి దించిన తర్వాత నిమ్మకాయ కూడా పిండుకొనవచ్చును.) వీటిలోకి బజ్జీలు నంజుకొంటే చాలా రుచిగా ఉంటాయి.

దీనినే అనంతపురంలో ఉగ్గాని గా, కర్నూలులో బొరుగుల తిరగవాతగా, కడపలో బొరుగుల చిత్రాన్నంగా మరి కొన్ని చోట్ల బొరుగుల ఉప్మాగా వ్యవహరిస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఉగ్గాని&oldid=1976837" నుండి వెలికితీశారు