బ్రాంప్టన్
|
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
నగర చరిత్ర [మార్చు]
1834 లో ప్రస్తుతపు మెయిన్ మరియు క్వీన్ స్ట్రీట్ లోవిలియమ్ బఫీస్ టావర్న్ పేరుతో నడపబడిన భవనం మాత్రమే ప్రస్తుతపు బ్రాంప్టన్‌కి కేంద్రం.ఈ ప్రాంతం బఫీస్ కార్నర్‌గా గుర్తింప బడింది.1834 లో జాన్ ఎలియాట్ ఇక్కడ్ బ్రాంప్టన్ పేరుతో ఇళ్ళ స్థలాలు రూపొందించి విక్రయించడంతోఈ ప్రాంతం ప్రజలలో బ్రాంప్టన్ గా స్థిరపడి పోయింది.
1854 లో అప్పుట్లో నూతనంగా స్థాపించబడిన కంట్రీ అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ పీల్ వ్యవసాయ ఉత్పత్తుల సంతను మెయిన్ మరియు క్వీన్ స్ట్రీట్ మూలలో ఏర్పాటు చేశారు.వ్యవసాయ ఉత్పత్తులు,ధాన్యాలు,దుంపలూ,పాల ఉత్పత్తులు ఇక్కడ అమ్మకానికి వచ్చాయి.ప్రస్తుతం జరుగుతున్న బ్రాంప్టన్స్ ఫార్మర్ మార్కెట్కి ఇది ప్రారంభం.తరవాతి కాలలంలో ఇక్కడ గుర్రాలు,పెంపుడు జంతువులు,స్వల్పంగా ఇతర జంతువులు విక్రయానికి రావడం ప్రారంభం అయింది.ఆ వ్యవశాయ ఉత్పత్తుల సంత చివరికి ప్రస్తుత ఆధినిక బ్రాంప్టన్ ఫాల్ ఫైర్‌గారూపాంతరం చెందింది.అదే సంవత్సరం బ్రాంప్టన్ విలేజ్ జాబితాలోకి చేరింది.
1887లో ఫెడరల్ ప్రభుత్వం ఈ విలేజ్ మొట్టమొదటి ఉచిత గ్రంధాలయం ఏర్పాటు చేయడానికి నిధులను విడుదల చేసింది.1907లో స్టీల్ వ్యాపారంలో అగ్రగణ్యుడైన ఆన్‌డ్ర్యూ కార్నెగీ నుండి నిదులను సేకరించి అనేకమంది చదవడానికి వసతి కల్పించేలా బ్రాంప్టన్ లైబ్రెరీ భవననిర్మాణం చేపట్టింది.
బ్రాంప్టన్ వ్యవసాయులు కొంతమంది నగరంలో పనిచేస్తున్న భీమా ఆఫీసుల నుండి పాలసీలు పొందడానికి సమస్యలు తలెత్తడంతో క్లైర్ విల్లె హాల్ లో పలు సమావేశాలు జరిపి ది కంట్రీ ఆఫ్ పీల్ ఫార్మర్స్ ముచ్యుయల్ ఫైర్ పేరుతో భీమా సంస్థను స్థాపించలని నిశ్చయానికి వచ్చారు.1955లో ఈ సంస్థ మూడవ సారి స్థల మార్పిడి చేసి 103 క్వీన్ స్ట్రీట్ వెస్ట్ కి మార్చి తన పేరుని పీల్ ముచ్యుయెల్ ఇన్సూరెన్స్ కంపనీగా మార్చుకుంది.ఇది బ్రాంప్టన్ నగరంలోని అత్యంత పురాతన స్తంస్థ.1890 లో హార్మ్స్‌వర్త్ డెకరేటింగ్ సెంటర్ హార్మ్స్ వర్త్ అండ్ సన్ పేరుతో స్థాపించబడింది.ఇది మొదట వారి ఇంటి ముందరి భాగంలో ప్రారంభించారు.పాత భవనం మంటలకు గురి కావడంతో 1904 సెప్టెంబర్ 1లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశాన్ని $1400 డాలర్లకు కొనుగోలు చేశారు.ఇది ఎక్కువ కాలంగా బ్రాంప్టన్లో పనిచేస్తున్న చిల్లర సామానుల దుకాణం.