భక్త ప్రహ్లాద (నాటకం)

వికీపీడియా నుండి
(భక్తప్రహ్లాద (నాటకం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భక్త ప్రహ్లాద ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన నాటకం. తెలుగు నాటకరంగంలో 19 భక్త ప్రహ్లాద నాటకాలు ప్రదర్శన చేయగా, వాటిల్లో ఆంధ్ర నాటక హితామహులుగా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన ఏడొవది భక్త ప్రహ్లాద నాటకం బాగా జనాదరణ పొందింది.[1]

కథ సంగ్రహం[మార్చు]

శాపగ్రస్తులైన జయవిజయులు భూలోకంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. దానవులైన వీరు యజ్ఞ వాటికలను ధ్వంసం చేస్తూ దేవతలను హింసిస్తారు. శ్రీ మహావిష్ణువు వరాహావతారమున హిరణ్యాక్షుని వధిస్తాడు. తమ్ముని మృతితో కోపించిన హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మెప్పిస్తాడు. ఆయన ద్వారా వరం పొందుతాడు. హిరణ్యకశిపుడు ఇంద్రలోకాన్ని ఆక్రమించి, వారిని బాధిస్తాడు. విద్యనభ్యసించడం, హరినామస్మరణ మానని తనయుడు ప్రహ్లాదుని అనేక విధాల చిత్రహింసలకు గురి చేయడం, చివరకు శ్రీ మహావిష్ణువు స్తంభం నుండి ఉగ్రనరసింహరూపాన ప్రత్యక్షమై హిరణ్యకశిపుని వధించడంతో కథ ముగుస్తుంది.

పాత్రలు[మార్చు]

ఇతర వివరాలు[మార్చు]

  1. ఈ నాటకాన్ని సురభి నాటక సమాజం ప్రదర్శించేవారు.
  2. ఈ నాటకంతోనే తెలుగు టాకీ సినిమాను ప్రారంభించాలని హెచ్.ఎం.రెడ్డి నిర్ణయించుకొని నటుడు సి.యస్.ఆర్. ఆంజనేయులు సహకారంతో సురభి నాటక సమాజం బృందంతో మాట్లాడి, వారితో కలిసి భక్త ప్రహ్లాద సినిమాను తీశాడు.[2]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (27 April 2019). "భక్త ప్రహ్లాద బతికే ఉన్నాడు". www.ntnews.com. నగేష్ బీరెడ్డి. Archived from the original on 21 జనవరి 2020. Retrieved 21 January 2020.
  2. ఆంధ్రభూమి, సినిమా (23 January 2017). "భక్త ప్రహ్లాద (ఫ్లాష్‌బ్యాక్ @ 50)". andhrabhoomi.net. సివిఆర్ మాణిక్యేశ్వరి. Archived from the original on 14 ఏప్రిల్ 2019. Retrieved 21 January 2020.