భజన
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
భజన (Bhajan) భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు కల అనేక సేవల రూపాలలో ఒకటి. దేవాలయములలో, ఇతర ప్రార్ధనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి పాడిన మీరా బాయి భజనలు బాగా ప్రాచుర్యం పొందినవి.
[మార్చు] భజనలు - రకాలు
భజనల్లో పలు రకాలు కలవు. ఇవి ఒక్కో ప్రాంతాలలో ఒక్కోవిధంగా నడుస్తుంటాయి.
- సాధారణ భజనలు
సాదారణంగా భజనలు దేవాలయాలలో చేస్తుంటారు.
- సాంస్కృతిక భజనలు
ఈ రకపు భజనలు కొంత ఖర్చు, శ్రమలతో కూడుకొన్నవి. ధనవంతులు, రాజులు, సంస్థానాదీశులు ఇటువంటి వాటిని ప్రోత్సహించేవారు. ఇవి పాటలు పాడటంలో ప్రావీణ్యమున్నవారు, సంగీత వాయిద్యాల సహకారంతో నిర్వహించు కార్యక్రమాలు. ఇవి వినేందుకు వీనుల విందుగా శ్రావ్యంగా ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా కొంత శిక్షణ, సాధన అవసరం.
- గృహములలో భజనలు
ఇవి ప్రత్యేక సంధర్భాలలో, విశేషాలను అనుసరించి నిర్వహిస్తుంటారు. వీటికి ఉదాహరణలు- అయ్యప్ప భజనలు, గృహప్రవేశ సమయంలో నిర్వహించు భజనలు,
- నగర సంకీర్తనలు
తెల్లవారు ఝామున కొందరు భక్తులు సమూహంగా ఊరిలో సంచరిస్తూ చేస్తూ నిర్వహించే భజనలను నగర సంకీర్తనం అంటారు.
- హిందూ భజనలు
- క్రిష్టియన్ భజనలు