భట్టిప్రోలు
వికీపీడియా నుండి
| ?భట్టిప్రోలు మండలం గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | భట్టిప్రోలు |
| జిల్లా(లు) | గుంటూరు |
| గ్రామాలు | 12 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
51,380 (2001) • 25770 • 25610 • 65.93 • 72.63 • 59.22 |
భట్టిప్రోలు (Bhattiprolu) ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన గ్రామము మరియు అదే పేరు గల మండలమునకు కేంద్రము.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
భట్టిప్రోలు నిజనామము ప్రతీపాలపురము. ఆంధ్ర శాతవాహనుల కాలము పూర్వమునుండియే ఉన్న ప్రముఖ నగరము. శాసనముల ప్రకారము కుబేరకుడు అను రాజు ప్రతీపాలపురము పాలించాడు. భట్టిప్రోలు ప్రాముఖ్యత మరియు ప్రస్తావన అచట తవ్వకములలో బయల్పడ్డ బౌద్ధ స్తూపము ద్వారా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాయి. భట్టిప్రోలు ఊళ్ళోఉన్న చిన్నలంజ దిబ్బ మరియు విక్రమార్క కోట దిబ్బ తవ్వగా క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దములో నిర్మించిన బౌద్ధ స్తూపము కనపడింది.
[మార్చు] చారిత్రక శిధిలాలు
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దికి చెందిన భట్టిప్రోలు స్తూపం చరిత్ర తెలుసుకునేందుకు తొలినుంచి విదేశీయులే ఆసక్తి కనబరిచారు. క్రీ.శ 1870లో బోస్‌వెల్, 1871లో ఇర్లియట్, 1882లో రాబర్టు సెవెల్ లు దీన్ని సందర్శించారు. 1892లో అలెగ్జాండర్ రే ఇక్కడ జరిపిన తవ్వకాల్లో రాతి ధాతుకరండాన్ని కనుగొన్నారు. 1969-70 సంవత్సరాల్లో పురావస్తు శాఖ తరఫున ఆర్. సుబ్రహ్మణ్యం తవ్వకాలు జరిపారు. ఒక విహారపు పునాదులు బయటపడ్డాయి. బుద్దుని తల ప్రతిమ వెలుగుచూసింది. పలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. పురావస్తు శాఖ అంచనా ప్రకారం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఇది నిర్మాణం జరిగిందని తెలుస్తోంది [1].
ఇక్కడి స్థూపం 132 అడుగులు, వేదిక 148 అడుగుల వ్యాసాలతో ఉంది. 8 అడుగుల ఎత్తు, 8.4 అడుగుల వెడల్పు ప్రదక్షిణా పథం నలుదిక్కులా అయకపు అరుగులు కలిగిన ఈ స్థూపం వాస్తురీత్యా నూతన విషయాలను అందించింది. స్థూప నిర్మాణానికి 45 X 30 X 8 సెంటీమీటర్ల కొలతలున్న ఇటుకలు వాడారు.
భట్టిప్రోలు స్థూప తవ్వకాల్లో బయటపడిన ధాతువుల్ని అప్పటి బిట్రీష్ ప్రభుత్వం భద్రపర్చింది. 1892వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించిన మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియాకు నూతన స్థూపంలో నిక్షిప్తం చేసేందుకు వాటిని ఇవ్వటానికి అంగీకరించింది. 1893లో అమెరికాలో జరిగిన విశ్వమత మహాసభలకు హాజరైన శ్రీలంక బౌద్ద బిక్షువు అనగారిక ధర్మపాల ఈ సంస్థను స్థాపించారు. 1920వ సంవత్సరంలో కలకత్తాలోని శ్రీధర్మరాజిక విహార్‌లోని నూతన స్థూపంలో భట్టిప్రోలులోని బుద్ద ధాతువులున్న స్పటిక పేటికను నిక్షిప్తం చేశారు. అంతటి ప్రాముఖ్యతగల ఈ చారిత్రక ప్రదేశముపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి నిలపి అభివృద్ధి చేయవలిసిన అవసరం ఉంది.
[మార్చు] భట్టిప్రోలు లిపి
స్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి[2]. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి[3]. బౌద్ధమతముతోబాటు భట్టిప్రోలు లిపి కూడా దక్షిణ ఆసియా ఖండములో వ్యాపించి బర్మా, మలయా, థాయి, లాఓసు, కాంబొడియా మున్నగు భాషలకు లిపి ప్రదానము చేసింది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
సివంగులపాలెం, అద్దేపల్లి, భట్టిప్రోలు, సూరేపల్లి, కోనేటిపురం, పల్లెకోన, గొరిగపూడి, పెదపులివర్రు, వెల్లటూరు, పెసర్లంక, పెదలంక, ఓలేరు, ఐలవరం, కన్నెగంటివారి పాలెం
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ ఈనాడులో డిసెంబరు 6, 2005న వచ్చిన వార్త - తెలుగు తనం బ్లాగ్ సైటునుండి తీసుకొన్నది
- ↑ Ananda Buddha Vihara
- ↑ The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire
|
|||||||
|
|
|
|---|---|
| సివంగులపాలెం · అద్దేపల్లి · భట్టిప్రోలు · సూరేపల్లి · కోనేటిపురం · పల్లెకోన · గొరిగపూడి · పెదపులివర్రు · వెల్లటూరు · పెసర్లంక · పెదలంక · ఓలేరు · ఐలవరం · కన్నెగంటివారి పాలెం |