Coordinates: 16°17′16″N 80°54′40″E / 16.287835°N 80.911139°E / 16.287835; 80.911139

భట్లపెనుమర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భట్లపెనుమర్రు
—  రెవెన్యూ గ్రామం  —
భట్లపెనుమర్రు is located in Andhra Pradesh
భట్లపెనుమర్రు
భట్లపెనుమర్రు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°17′16″N 80°54′40″E / 16.287835°N 80.911139°E / 16.287835; 80.911139
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,016
 - పురుషులు 1,495
 - స్త్రీలు 1,521
 - గృహాల సంఖ్య 1,007
పిన్ కోడ్ 521138
ఎస్.టి.డి కోడ్ 08671

భట్లపెనుమర్రు, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం.భట్లపెనుమర్రు కృష్ణ పరీవాహక గ్రామం.ఇది మండల కేంద్రమైన మొవ్వ నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1007 ఇళ్లతో, 3016 జనాభాతో 1166 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1495, ఆడవారి సంఖ్య 1521. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1399 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 13. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589676[1].ఈ గ్రామం సముద్రమట్టానికి 7 మీ.ఎత్తులో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి మొవ్వలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మొవ్వలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మచిలీపట్నంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

2015, సెప్టెంబరు-3వ తేదీనాడు విజయవాడలో నిర్వహించిన స్కూల్ గేంస్ జిల్లా ఎంపిక పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి, రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి ఎంపికైనది. 2015, సెప్టెంబరు-27వ తేదీనాడు భీమవరంలో నిర్వహించు రాష్ట్రస్థాయి పోటీలలో ఈమె పాల్గొంటుంది. [5] ఈ పాఠశాల ఆవరణలో 3.31 లక్షల రూపాయల ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులతో, 28/18 పరిమాణంలో ఒక ఖో-ఖో కోర్టు, 660 మీటర్ల నడక (డబుల్) ట్రాక్ నిర్మాణాలను చేపట్టినారు. [8]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

భట్ల పెనుమర్రులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

భట్ల పెనుమర్రులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

భట్ల పెనుమర్రులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 123 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1042 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1042 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

భట్ల పెనుమర్రులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1042 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

భట్ల పెనుమర్రులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, కాయధాన్యాలు, పసుపు

గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3206. ఇందులో పురుషుల సంఖ్య 1581, స్త్రీల సంఖ్య 1625, గ్రామంలో నివాస గృహాలు 901 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1166 హెక్టారులు.

2011 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 3,016 -అందులో పురుషుల సంఖ్య 1,495 - స్త్రీల సంఖ్య 1,521 - గ్రామంలో నివాస గృహాల సంఖ్య 1,007

గ్రామ చరిత్ర[మార్చు]

2016, జనవరి-14న, ఈ గ్రామంలోని పింగళి వెంకయ్య భవనంలో ఈడుపుగంటి ప్రహ్లాద్, రచన-సేకరణలో, భట్లపెనుమర్రు గ్రామ చరిత్ర పుస్తకాన్ని, మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆవిష్కరించారు. [6]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

  • ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
  • పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

పింగళి వెంకయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త.
  • పింగళి వెంకయ్య - ఈ గ్రామంలో జన్మించాడు. స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. గ్రామస్థులు, దాతల దాతృత్వంతో "పింగళి స్మారక భవనం" నిర్మించారు. 2014, ఆగస్టు 2న జయంతి కార్యక్రమాన్ని ఈ భవనంలోనే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా, వ్యాస రచన, వక్తృత్వపు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసారు..
  • చలసాని ప్రసాదరావు - రచయిత, చిత్రకారుడు
  • టి. కల్పనాదేవి - మాజీ లోక్‌సభ సభ్యురాలు
  • కామినేని ఈశ్వరరావు - (క్రీడాకారుడు)
  • దండమూడి రాజగోపాలరావు - వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కొడాలి దయాకర్, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉప సర్పంచిగా రేణుకమ్మ ఎన్నికైంది. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రెండవ దళిత బహుజన పరిరక్షణ సంఘం (డి.భి.పి.ఎస్) రాష్ట్ర మహాసభలలో, కొడాలి దయాకర్ ఆ సంఘం కోశాధికారిగా ఎన్నికైనాడు. [4]&[8]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • శ్రీ సంతానవేణుగోపాలస్వామివారి ఆలయం
  • శ్రీ బొల్లావారి అంకమ్మ తల్లి ఆలయం:ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అమ్మవారి వార్షిక మహోత్సవాలు వైశాఖపౌర్ణమి సందర్భంగా (మే నెలలో) ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ జాతరకు బొల్లా వంశీయులు, భక్తులు వివిధ ప్రాంతాలనుండి గ్రామానికి తరలివచ్చెదరు. ఈ సందర్భంగా సుడి కపిరి, మద్యాహ్న కపిరి, పూల కపిరి, అంక గుడారం, దిబ్బాల అంకమ్మ సంబరం, మాతా సుంకు చెరుగుట, మైలు తీర్చుకోవడం, గజాల కొలుపు, మొక్కుల సమర్పణ మొదలగు కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

భట్లపెనుమర్రు గ్రామంలో ఉన్నటువంటి ఆయా కులాలను బట్టి ఆయా వృత్తులు నిర్వహిస్తారు. అయితే ప్రధాన వృత్తి మాత్రం వ్యవసాయ కూలి. గ్రామంలో అన్ని కులాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇవిగాక జర్నలిస్ట్, వ్యవసాయం, కల్లుగీత, రజక, వర్తక, వాణిజ్య, డప్పు వాయిద్యం, తాపీ, రంగులు వేయడం, కమిషన్ వ్యాపారం, మెకానిక్, హోటల్, దర్జీ, మాంసపు దుకాణాలు, గొర్రెల పెంపకం, పాడిపశువుల పెంపకం, పలు చేతి వృత్తుల వారు గ్రామంలో ఉన్నారు. వీటితో పాటు ఈ గ్రామ వాస్తవ్యులు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలతో పాటు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. అంతేగాక రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం గ్రామానికి కంఠాభరణం లా ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]