భరతనాట్యం

వికీపీడియా నుండి

ఫైలు:Bharathanatyam.jpg
ఒక భరతనాట్య వర్తకి

భరతవాట్యం దక్షిణ భారతదేశం లో నాట్య శాస్త్రం రచించిన భరతమువి పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. దక్షిణ భారతదేశం లోని పురాతవ దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు వాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని "తంజావూరు" లొ 'నట్టువన్నులు' మరియు దేవదాసీలు ఈ కళకు పోషకులు. భావం, రాగం, తాళం - ఈ మూడు ప్రాధమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి. కట్టుబాట్లు మరీ ఎక్కువ.


విషయ సూచిక

[మార్చు] విధానం

భరతనాట్య ప్రదర్శన

నాట్య శాస్త్రం లో ఇలా చెప్పబడింది (అ.44), "... నీలకంఠుడు (శివుడు) కైశికీ పద్దతి లో నృత్యం చేస్తుండగా నేను చూచాను. ఆ నృత్యం లో విస్తృతమైవ భంగిమలు (మృదు అంగహారాలు, చేతులు, కాళ్ల కదలికలు), (రసములు), (భావములు) ఉన్నాయి. ఆ నృత్యం యొక్క ఆత్మ (క్రియలు). ధరించే వస్త్రాలు అత్యంత మనోహరం గా ఉండాలి. (శృంగారమే) ఆ నృత్యానికి మూలం. 'మగవారికి ఆ నృత్యం నరిగా చేయడం సాధ్యం కాదు.' ఆడవారు తప్ప వేరెవరు దానిని సరైన విధానంలో చేయలేరు".

[మార్చు] ప్రసిద్ద భరతనాట్య కళాకారులు, గురువులు

ప్రపంచ వ్యాప్తంగా చాలా భరతనాట్య శిక్షణా సంస్థలు ఉన్నాయి. కొంతమంది ప్రసిద్ధమైన భరతనాట్యకళాకారులు, గురువుల పేర్లు:

  • పద్మా సుబ్రహ్మణ్యం
  • చిత్రా విశ్వేశ్వరన్
  • అడయార్ కె. లక్ష్మణన్
  • యామినీ కృష్ణమూర్తి
  • వైజయంతీ మాలా బాలి
  • శోభా నటరాజన్
  • అళర్మేల్ వల్లి
  • మేధా హరి
  • సుధారాణి రఘుపతి
  • సి. వి. చంద్రశేఖర్
  • కె. పి. & కాథరీన్ కణ్ణిరామవ్
  • వి.పి. & శాంతా ధనంజయన్
  • ఊర్మిళా సత్యనారాయణన్
  • అనితా రత్నం
  • ప్రియా మురళి
  • శ్రీలతా వినోద్

[మార్చు] పుట్టుక

ఈ రోజున భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరతనాట్యం ఎక్కువ ప్రాధాన్యతనూ ప్రాముఖ్యతనూ సంతరించుకుంది. దానికి ప్రధాన కారణం దాని మూలాలు మత ప్రాధాన్యతను కలిగి ఉండటమే. అంతే కాక తమిళుల చొరవ, ఆ శాస్త్రాన్ని తమ సొంతంగా వారు భావించటం కూడా భరతనాట్య ప్రాభవానికి కారణాలు. పుట్టుక విషయానికి వస్తే, భరతనాట్యాన్ని రచించింది భరతముని కాగా, ప్రస్తుతం వాడుక లో ఉన్న భరతనాట్యశాస్త్రాన్ని ఒక తాటి పైకి తెచ్చి, అమలు పరచిన వారు పందనల్లూరుకి చెందిన పొన్నయ్య, చెన్నయ్య, వడివేలు, శివానందం అనబడే నలుగురు అన్నదమ్ములయిన నట్టువన్నులు. వీరు పధ్ధెనిమిదవ (18)శతాబ్దానికి చెందినవారు. విద్వాన్ శ్రీ మీనాక్షీ సుందరం పిళ్ళై వీరి వారసులే. ఈ కళను దేవాలయం బయటికి తెచ్చి, ఒక వినోదంగా కాకుండా, ఒక శాస్త్రంగా గుర్తింపు, గౌరవం తెచ్చి, సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు శ్రీ రుక్మిణీదేవి అరుండలే. ఈమె మద్రాసు దగ్గరి తిరువన్మయూర్ లో " కళాక్షేత్ర " అనబడే గురుకుల స్థాయి పాఠశాల స్థాపించారు.

[మార్చు] బయటి లింకులు

[మార్చు] వెబ్‌లో దృశ్యశ్రవణ వనరులు

పేజీకి సంభందించిన లింకులు