భారతదేశంలో పవన శక్తి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భారత్‌లో పవన విద్యుత్ అభివృద్ధి 1990లలో ప్రారంభమైంది, గత కొన్ని సంవత్సరాలుగా ఇది గణనీయంగా పెరుగుతూ వచ్చింది. డెన్మార్మ్ లేదా USతో పోలిస్తే సాపేక్షికంగా పవన పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టినప్పటికీ, ప్రపంచంలో పవన శక్తి సామర్థ్యత విషయంలో భారతదేశం అయిదవ అతిపెద్ద వ్యవస్థాపక దేశంగా గుర్తింపు పొందింది.[1]

2009 అక్టోబర్ 31 నాటికి, భారత్‌లో పవన శక్తి వ్యవస్థాపక సామర్థ్యం 11806.69[2] MWకు చేరుకుంది, ప్రధానంగా ఇది తమిళనాడు (4900.765 MW),[3] మహారాష్ట్ర (1945.25 MW), గుజరాత్ (1580.61 MW), కర్ణాటక (1350.23 MW), రాజస్థాన్ (745.5 MW), మధ్యప్రదేశ్ (212.8 MW), ఆంధ్రప్రదేశ్ (132.45 MW), కేరళ (46.5 MW), ఒడిషా (2MW),[4][5] పశ్చిమ బెంగాల్ (1.1 MW) మరియు ఇతర రాష్ట్రాలలో (3.20 MW) [6] వ్యాపించింది. 2012 నాటికి భారత్‌లో అదనంగా 6,000 MW పవన శక్తిని స్థాపించనున్నట్లు అంచనా వేయబడింది.[7] భారత దేశపు మొత్తం విద్యుత్ సామర్థ్యంలో పవన శక్తి 6% మేరకు ఉంది, దేశం మొత్తం విద్యుత్‌లో ఈ రంగం 1.6%న్ని ఉత్పత్తి చేస్తోంది.[8] భారత్ ఇప్పుడు పవన అట్లాస్ కోసం సిద్ధమవుతోంది[9]

పర్యావలోకనం[మార్చు]

ఇండియా ప్రపంచంలో కెల్ల ఐదవ పెద్ద వాయు శక్తీ సమర్పకులు అందులో వార్షిక శక్తి ఉత్పత్తి 8,896 MW.[10] ఇక్కడ చూపించబడినది తమిళ నాడు లోని కయతార్ వాయు శక్తి కేంద్రం

2009 నాటికి ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పిన పవన శక్తి 157,899 MWలకు చేరుకుంది. USA (35,159 MW), జర్మనీ (25,777 MW), స్పెయిన్ (19,149 MW) మరియు చైనా (25,104 MW)లతో ముందుండగా భారత్ అయిదవ స్థానంలో ఉంది.[11] పవన టర్బైన్‌‌లను నెలకొల్పడానికి తక్కువ కాలం పట్టడం, పవన విద్యుత్ యంత్రాల విశ్వసనీయత, పని సామర్థ్యం పెరుగుతుండటం వల్ల భారత్‌లో పవన శక్తి అదనపు సామర్థ్య అవకాశంగా మారింది.[12]

సజ్‌లోన్, భారతీయ యాజమాన్యంలోని సంస్థగా, గత దశాబ్దంలోనే ప్రపంచ రంగంమీద కనిపించింది, 2006 నాటికి ఇది ప్రపంచ పవన టర్బైన్‌ అమ్మకాల్లో 7.7 శాతం మార్కెట్ వాటాను కైవశం చేసుకుంది. సజ్‌‍లోన్ ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో వాయు టర్బైన్‌లకు సంబంధించి ప్రముఖ తయారీదారుగా ఉంది, ఇది భారత్‌లో 52 శాతం మార్కెట్ వాటాను చేజక్కించుకుంది. సజ్‌లోని విజయం, అధునాత వాయు టర్బైన్‌ టెక్నాలజీలో భారత్‌ని అభివృద్ధి చెందుతున్న దేశాల నేతగా మార్చింది.[13]

రాష్ట్రస్థాయి పవన శక్తి[మార్చు]

భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పవన విద్యుత్ వ్యవస్థాపనలు పెరుగుతూ వస్తున్నాయి.

===తమిళనాడు (4889.765 MW)

=[మార్చు]

ఇండియా తన అవసరాలకు అనుగుణంగా శిలాజ ఇంధనంపై నమ్మకాన్ని తగ్గించుటకు సిద్ధమైనది.ఇక్కడ చూపించబడినది తమిళనాడు లోని ముప్పందాల్ వాయు శక్తి కేంద్రం.

తమిళనాడు దేశంలోనే అతి ఎక్కుప పవన శక్తి తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది: 2010 మార్చి నాటికి ఇక్కడి పవన శక్తి 4889.765 MWకి చేరుకుంది.[3] అరల్‌వైమొళికి అనతిదూరంలోని ఉపఖండంలోనే అతి పెద్దదైన ముప్పండల్ పవన క్షేత్రం ఒకప్పుడు దారిద్ర్యంలో కూరుకుపోయి ఉండిన ముప్పండల్ గ్రామానికి సమీపంలో ఉంది, గ్రామస్తులు చేసే పనికి గాను వారికి ఇది విద్యుత్ సరఫరా చేస్తూంది.[14][15] భారతదేశపు $2 బిలియన్ల విలువైన పరిశుధ్ద ఇంధన కార్యక్రమానికి ఈ గ్రామం ఒక నమూనాగా ఎంచుకోబడినది, ఈ ప్రాంతంలో పవన టర్బైన్‌ క్షేత్రాలను నెలకొల్పినందుకు గాను విదేశీ కంపెనీలకు పన్ను రాయితీలను ఇస్తున్నారు. 2009 ఫిబ్రవరిలో, కేప్ ఎనర్జీ సంస్థ ద్వారా తిరునల్వేలి జిల్లాలో 250 KW (మొత్తం 15 MW) పరిమాణంలోని 60 యూనిట్లను ఏర్పర్చడానికి శ్రీరామ్ EPC కంపెనీ రూ.700 మిలియన్ల కాంట్రాక్టును చేజిక్కించుకుంది.[16] భారత్‌లో పవన ఇంధనం అభివృద్ధిలో ఎనెర్కోన్ సంస్థ కూడా ప్రధాన పాత్రను పోషిస్తోంది. తమిళనాడులో, కోయంబత్తూరు, తిరుప్పూరు జిల్లాలు 2002 నుంచి అనేక పవన మిల్లులను నెలకొల్పాయి, ప్రత్యేకించి ఈ రెండు జిల్లాల్లోని చిట్టిపాళ్యం, కెథనూర్, గుడిమంగళం, పూలవాడి, మురుంగపట్టి (MGV స్థలం), సుంకరముదకు, కొంగల్‌నగరం, గోమంగళం, అంథియూర్ ప్రాంతాల్లో అధిక పవన శక్తి ఉత్పత్తి స్థలాలు ఉన్నాయి.

మహరాష్ట్ర (1942.25 MW)[మార్చు]

పవన శక్తి ఉత్పత్తి సామర్థ్యంలో తమిళనాడు తర్వాత మహరాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. సజ్‌లోన్ సంస్థ ఇక్కడ భారీ స్థాయిలో పాలు పంచుకుంది.[12] ఒకప్పుడు ఆసియాలోనే అతి పెద్ద పవన క్షేత్రంగా ఉండిన వంకుశవాడె పవన పార్క్‌‌ (201 MW)ను నిర్వహిస్తోంది, ఇది మహారాష్ట్ర సతారా జిల్లాలోని కొయినా రిజర్వాయర్ సమీపంలో ఉంది.[17]

గుజరాత్ (1782 MW)[మార్చు]

జామానగర్‌లోని సమనా &సడోదర్ ప్రాంతం చైనా లైట్ పవర్ (CLP) మరియు టాటా పవర్ వంటి ఇంధన సంస్థలకు ఆతిథ్యమివ్వడానికి ఎంపిక చేయబడింది, ఈ రెండు సంస్థలూ ఈ ప్రాంతంలో రూ.8.15 బిలియన్ ($189.5 మిలియన్‌)లను మదుపు చేయడానికి సంకల్పించాయి. భారత్‌లోని తన అనుబంధ సంస్థ CLP ఇండియా ద్వారా CLP సంస్థ సమనా ప్రాంతంలో 100.8 MW విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 126 పవన టర్బైన్‌లను నెలకొల్పడానికి దాదాపు రూ.5 బిలియన్‌లను మదుపు చేస్తోంది. టాటా పవర్ ఈ ప్రాంతంలోనే రూ.3.15 బిలియన్ల వ్యయంతో 50 MW శక్తిని ఉత్పత్తి చేయడానికి పవన టర్బైన్‌లను స్థాపించింది. ప్రభుత్వ అంచనా ప్రకారం, వచ్చే సంవత్సరం ప్రారంభానికి ఈ రెండు ప్రాజెక్టులూ పని ప్రారంభించనున్నాయి. పవన శక్తిమీద భారీగా మదుపు చేసిన గుజరాత్ ప్రభుత్వం, మొత్తం 360 MW పవన శక్తిని ఉత్పత్తి చేయగల 450 టర్బైన్‌లను నెలకొల్పడానికి సమనా అనువైన ప్రాంతంగా గుర్తించింది. రాష్ట్రంలో పవన ఇంధన అభివృద్ధిలో మదుపు చేయడాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం అధిక పవన ఇంధన సుంకంతో సహా పలు రాయితీలను పరిచయం చేసింది. సమనా హై టెన్షన్ ట్రాన్మిషన్ గ్రిడ్‌ను కలిగి ఉంది పవన టర్బైన్‌లచే ఉత్పత్తయ్యే విద్యుత్తును ఈ గ్రిడ్ ద్వారా సరఫరా చేయవచ్చు. దీనికోసం, సడోదర్ వద్ద ఒక సబ్‌స్టేషన్‌ని నెలకొల్పారు. ఈ రెండు ప్రాజెక్టులనూ ఎనెర్కోన్ లిమిటెడ్ నిర్వహిస్తోంది, ఇది జర్మనీకి చెందిన ఎనెర్కోన్ మరియు ముంబై కేంద్రంగా పనిచేసే మెహ్రా గ్రూప్‌లు ఏర్పర్చిన జాయింట్ వెంచర్.[18]

ONGC లిమిటెడ్ తన మొట్టమొదటి పవన శక్తి ప్రాజెక్టును ప్రారంభించింది. 51 MW ప్రాజెక్ట్ గుజరాత్‌ కుచ్ జిల్లాలోని మోటిసింధోలిలో నెలకొల్పబడింది. ONGC ఒక్కోదానిలో 1.5-mw సామర్థ్యం కలిగిన 34 టర్బైన్‌లతో కూడిన పవన క్షేత్రాన్ని నెలకొల్పడానికి 2008 జనవరిలో సజలోన్ ఎనర్జీపై EPC ఆర్డర్‌ని తీసుకుని వచ్చింది. ఈ ప్రాజెక్టుపై పనిని 2008 ఫిబ్రవరిలో ప్రారంభించారు, నిర్మాణం మొదలు పెట్టిన 43 రోజులలోపే తొలి మూడు టర్బైన్లు ఉత్పత్తి ప్రారంభించాయని తెలిసింది. ఈ 308 కోట్ల కాప్టివ్ పవన క్షేత్రంనుంచి ఉత్పత్తైన శక్తిని గుజరాత్ రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానిస్తారు, అక్కడినుంచి ONGC దీన్ని అంకాళేశ్వర్, అహమ్మదాబాద్, మెహసన మరియు వడోదర కేంద్రాలకోసం ఉపయోగిస్తుంది. వచ్చే రెండు సంవత్సరాలలో 200 MW కాప్టివ్ పవన శక్తి సామర్థ్యంతో కూడిన కేంద్రాలను ఇక్కడ ఏర్పర్చాలని ONGC లక్ష్యంగా పెట్టుకుంది.[19]

కర్ణాటక (1340.23 MW)[మార్చు]

కర్ణాటకలో అనేక చిన్న పవన క్షేత్రాలున్నాయి, ఇవన్నీ కలిసి ఈ రాష్ట్రాన్ని భారత దేశంలోనే అత్యధికంగా పవన మిల్ క్షేత్రాలు ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా తయారు చేస్తున్నాయి. చిత్రదుర్గ, గడగ్ వంటి జిల్లాల్లో అధిక సంఖ్యలో పవనమిల్లులను ఏర్పర్చారు. చిత్రదుర్గ,[citation needed]గడగ్[citation needed] వంటి జిల్లాల్లో అధిక సంఖ్యలో పవన మిల్లులను ఏర్పర్చారు.

భారత్‌లో ACCIONA సంస్థ స్థాపించిన తొలి పవన క్షేత్రాలు 13.2 MW అరసినగుంది (ARA) మరియు 16.5 MW అనబురు (ANA). (కర్ణాటక రాష్ట్రం) లోని దావన్‌గెరె జిల్లాలో ఈ సంస్థ 29.7 MW సామర్థ్యం ఉన్న పవన క్షేత్రాలను నెలకొల్పింది మరియు వెస్టాస్ విండ్ టెక్నాలజీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా సరఫరా చేయబడిన 18 వెస్టాస్ 1.65 MW పవన టర్బైన్‌లను ఇది కలిగి ఉంది.[citation needed]

ARA పవన క్షేత్రాన్ని 2008 జూన్‌లో ప్రారంభించారు, ANA పవన క్షేత్రాన్ని 2008 సెప్టెంబర్‌లో ఏర్పర్చారు. ఒక్కో సంస్థ 100% ఉత్పత్తి లక్ష్యంతో బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ (BESCOM)తో 20 సంవత్సరాల శక్తి కొనుగోలు ఒప్పందం (PPA)పై సంతకాలు చేశాయి. ARA మరియు ANAలు, క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజం (CDM) ఆధ్వర్యంలో CER గుర్తింపు పొందిన అసియోనా సంస్థ యొక్క తొలి పవన క్షేత్రాలు కావడం విశేషం.[citation needed]

ACCIONA ది స్పానిష్ కార్బన్ ఫండ్‌ కోసం ప్రపంచ బ్యాంకుతో చర్చలు జరుపుతోంది, ఇది 2010 మరియు 2012 మధ్య కాలంలో ప్రారంభం కాగల CERల కోసం కొనుగోలు దారుగా ప్రాజెక్టులో చేరడానికి స్పానిష్ సంస్థ అంచనాలు తయారుచేస్తోంది. నిబంధనలలో భాగంగా పర్యావరణ మరియు సామాజిక అంచనాను నిర్వహించారు, సంబంధిత డాక్యుమెంట్లను కూడా అందజేశారు. ఇవి ప్రపంచ బ్యాంకు యొక్క బహిరంగ వెల్లడి విధానం అవసరాలకు తగినవిధంగా ఉంటున్నాయి.[citation needed]

రాజస్థాన్ (738.5 MW)[మార్చు]

గుర్గావన్‌లో ప్రధాన కార్యాలయం గల గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్ రాజస్థాన్ జోధ్‌పూర్ జిల్లాలో అతి పెద్ద పవన క్షేత్రాన్ని నిర్మించడంలో ముందంజలో ఉంది. మొత్తం 31.5 mw సామర్థ్యంలో 12 mwను ఇప్పటికే పూర్తి చేసినట్లు సీనియర్ అధికారి[who?] ఒకరు ప్రాజెక్ట్ పర్యవేక్షకులకు తెలిపారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నామని తను చెప్పారు. INOX గ్రూప్ కంపెనీకి సంబంధించినంతవరకు ఇది అతిపెద్ద పవన క్షేత్రం. 2006-07లో, మహారాష్ట్ర సతారా జిల్లాలోని పంచాగ్ని సమీపంలో ఉన్న గుఢె గ్రామం వద్ద 23.1-mw పవన శక్తి ప్రాజెక్టును GFL ప్రారంభించింది. ఈ రెండు పవన క్షేత్రాలు గ్రిడ్‌కి అనుసంధానమై ఉన్నాయి మరియు ఇవి కంపెనీకి కార్బన్ రుణాలను సంపాదించనున్నాయని ఈ అధికారి పేర్కొన్నారు.[citation needed] విడిగా జరిగిన ఒక పరిణామంలో, ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ ACC లిమిటెడ్ రాజస్థాన్‌లో 11 mw సామర్థ్యంతో ఒక కొత్త పవన శక్తి ప్రాజెక్టును ఏర్పర్చనున్నట్లు ప్రతిపాదించింది. రూ.60 కోట్ల వ్యయం కాగలదని భావిస్తున్న ఈ పవన క్షేత్రం సంస్థకు చెందిన లఖెరీ సిమెంట్‌ విద్యుత్ అవసరాలను తీర్చగలదు, ఆధునికీకరణ పథకం ద్వారా ఈ సంస్థ సామర్థ్యాన్ని 0.9 మిలియన్ tpa నుంచి 1.5 మిలియన్ tpaలకు పెంచారు. ACCకి సంబంధించినంతవరకు, తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉదయత్తూరు వద్ద ఏర్పర్చిన 9-mw క్షేత్రం తర్వాత ఇది రెండో పవన శక్తి ప్రాజెక్ట్.[citation needed] నెలకొల్పిన సామర్థ్యాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం అయిదు అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబడనప్పటికీ, రాజస్థాన్ కొత్త పవన క్షేత్రాలకు ముఖ్యమైన గమ్యస్థానంగా ఆవిర్భవిస్తోంది. 2007 చివరి నాటికి, ఈ ఉత్తరాది రాష్ట్రం మొత్తం 496 mwల సామర్థ్యం కలిగి ఉంది, ఇది భారత్ మొత్తం సామర్థ్యంలో 6.3 శాతం వాటాగా ఉంది.[citation needed]

మధ్యప్రదేశ్ (212.8 MW)[మార్చు]

ఈ విశిష్ట భావనను దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్ ప్రభుత్వం MPWL సంస్థకు దేవస్ సమీపంలోని నగ్డా హిల్స్ వద్ద మరొక 15 MW ప్రాజెక్టును మంజూరు చేయించింది. మొత్తం WEGలను 31.03.2008న ప్రారంభించారు, ఇవి విజయవంతంగా నడుస్తున్నాయి.[20]

కేరళ (26.5 MW)[మార్చు]

రాష్ట్రంలోని మొదటి పవన క్షేత్రాన్ని పాలక్కాడ్ జిల్లాలోని కంజికోడె వద్ద నెలకొల్పారు. ఇది 23.00 MW పవన శక్తిని ఉత్పత్తి చేస్తోంది. ఇదుక్కి జిల్లా లోని రామక్కాల్‌మేడు వద్ద ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక కొత్త పవన క్షేత్ర ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 10.5 MW విద్యుత్తును ఉత్పత్తి చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి V. S. అచ్యుతానందన్ 2008 ఏప్రిల్‌‍లో ప్రారంభించారు.[citation needed]

కేరళ ప్రభుత్వ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏజెన్సీ ఫర్ నాన్-కన్వెన్షనల్ ఎనర్జీ అండ్ రూరల్ టెక్నాలజీ (ANERT) అనే స్వయంప్రతిపత్తి సంస్థ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ప్రైవేట్ భూములలో మొత్తం 600 mw విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి పవన క్షేత్రాలను ఏర్పర్చింది. ఈ సంస్థ ప్రైవేట్ డెవలపర్ల ద్వారా పవన క్షేత్రాల ఏర్పాటుకోసం 16 స్థలాలను గుర్తించింది. ప్రారంభ దశగా, ANERT కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డ్‌తో కలసి ఇదుక్కి జిల్లాలో రమక్కాల్‌‍మేడు వద్ద 2 mw విద్యుత్ ప్రాజెక్టును ఉత్పత్తి చేయడానికి ఒక ప్రదర్శనాత్మక ప్రాజెక్టును నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.21 కోట్లు వ్యయం కాగలదని అంచనా వేశారు. పాలక్కాడ్ మరియు తిరువనంతపురం జిల్లాలతో పాటుగా ఇతర పవన క్షేత్రాలు ఉన్నాయి. మొత్తం 6,095 mw విద్యుత్ సామర్థ్యంలో సాంప్రదాయేతర ఇంధనరంగం తోడ్పాటు కేవలం 5.5 శాతం మాత్రమే ఉంది, కేరళ ప్రభుత్వం దీన్ని 30 శాతానికి పెంచాలని భావిస్తోంది. కేరళలోని శక్తి వనరులను పునరుద్ధరణను అభివృద్ధి చేసి, ప్రోత్సహించే రంగంలో ANERT నిమగ్నమై ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సాంప్రదాయేతర శక్తి వనరులకు సంబంధించిన పునరుద్ధరణాత్మక ఇంధన కార్యక్రమాలను అమలు చేయడానికి కూడా ఇది నోడల్ ఏజెన్సీగా ఉంటోంది.[citation needed]

పశ్చిమ బెంగాల్ (1.10MW)[మార్చు]

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం పవన శక్తి కేంద్రాల స్థాపన 1.10 మెగావాట్లు మాత్రమే ఉంది, దీనికి 2006-2007లో కేవలం 0.5 మెగావాట్లను మాత్రమే అదనంగా ఉత్పత్తి చేశారు, 2007–2008 మరియు 2008–2009 సంవత్సరాలలో అదనపు ఉత్పత్తి మచ్చుకు కూడా లేదు.

బెంగాల్ - మెగా 50 MW పవన ఇంధన ప్రాజెక్ట్ త్వరలో దేశం కోసం నిర్మాణం కానుంది[citation needed]

పశ్చిమ బెంగాల్‌లో అతి పెద్ద పవన-విద్యుత్ ప్రాజెక్టును ఏర్పర్చడానికి సజ్‌లోన్ ఎనర్జీ లిమిటెడ్ పధకాలు రచిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో భారీ పవన-శక్తి ప్రాజెక్టు ఏర్పాటుకు సజ్‌లోన్ ఎనర్జీ లిమిటెడ్ పథకం రచిస్తోంది, దీనికోసం అది కోస్టల్ మిడ్నపూర్ మరియు దక్షిణ 24 పరగణాల జిల్లాల కేసి చూస్తోంది. పశ్చిమబెంగాల్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఛైర్మన్ SP గోన్ చౌదురి ప్రకారం, 50 MW ప్రాజెక్టు గ్రిడ్‌కి అనుసంధానించే నాణ్యత గల విద్యుత్‌ని సరఫరా చేయనుంది. విద్యుత్ శాఖలో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న గోన్ చౌదురి, ఇది పశ్చిమబెంగాల్‌లో పవన ఇంధనాన్ని ఉపయోగించే అతి పెద్ద ప్రాజెక్టు కాగలదని చెప్పారు. ప్రస్తుతానికి, సజ్‌లాన్ నిపుణులు ఉత్తమ స్థలంకోసం చూస్తున్నారు. సజ్‌లోన్ పూర్తిగా వ్యాపార ప్రయోజనాలకోసమే విద్యుత్‌ని ఉత్పత్తి చేసి దాన్ని స్థానిక విద్యుత్ సంస్థలకు అమ్మే లక్ష్యంతో ఉంది.[citation needed]

ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (Ireda) వద్ద లభ్యమవుతున్న నిధులకు ఆశించకుండానే, సజ్‌లోన్ ప్రారంభంలో రూ.250 కోట్లను మదుపుగా పెట్టనుందని గోన్ చౌదురి చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో అయిదు పవన విద్యుత్ యూనిట్లు ఉన్నాయని చౌదురి చెప్పారు, ఫ్రేజర్‌గంజ్ వద్ద 1 MW విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు, సాగర్ ఐలాండ్ వద్ద, 1 MWను ఉత్పత్తి చేసే మిశ్రమ పవన-డీజెల్ ప్లాంట్ ఉంది. పశ్చిమ బెంగాల్‌లో, రెన్యూవబుల్ ఎనర్జీపై ఆధారపడిన యూనిట్ల ద్వారా తయారైన విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి విద్యుత్ సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. విద్యుత్ తయారీ విభాగాలకు ప్రత్యేక రేట్లను కూడా ప్రతిపాదిస్తున్నారు. ఇది ఈ రంగంలో మదుపు పెట్టడానికి ప్రైవేట్ రంగ కంపెనీలను ప్రోత్సహించిందని, విద్యుత్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఎస్. బెనర్జీ చెప్పారు.[citation needed]

భారత్‌లో ప్రాజెక్టులు[మార్చు]

భారత్‌లో అతి పెద్ద పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు (10MW అంతకంటే ఎక్కువ)[21]

విద్యుత్ కేంద్రం నిర్మాత ప్రాంతం రాష్ట్రం మొత్తం సామర్థ్యం (MWe)
వంకుశ్వాడె విండ్ పార్క్ సజ్‌లోన్ ఎనర్జీ లిమిటెడ్. సతారా జిల్లా. మహారాష్ట్ర 259
కేప్ కొమోరిన్ అబాన్ లాయిడ్ చిలెస్ ఆఫ్‌షోర్ లిమిటెడ్. కన్యాకుమారి తమిళనాడు 33
కాయథర్ సుభాష్ సుభాష్ లిమిటెడ్. కాయథార్ తమిళనాడు 30
రామక్కాల్‌మేడు సుభాష్ లిమిటెడ్. రామక్కాల్‌మేడు కేరళ 25
ముప్పండల్ విండ్ ముప్పండల్ విండ్ ఫార్మ్ ముప్పండల్ తమిళనాడు 513[citation needed]
గుడిమంగళం గుడిమంగళం విండ్ ఫార్మ్ గుడిమంగళం తమిళనాడు 21
పుత్లూర్ RCI వెస్కేర్(ఇండియా) లిమిటెడ్. పుత్లూర్ ఆంధ్ర ప్రదేశ్ 20
లండా ఇండియా దాండియా ఇండియా లిమిటెడ్. లండా గుజరాత్ 15
చెన్నయ్ మోహన్ మోహన్ బ్రెవరీస్ & డిస్టిల్లరీస్ లిమిటెడ్. చెన్నై తమిళనాడు 15
జమ్‌గుద్రాణి MP MP విండ్‌ఫార్మ్స్ లిమిటెడ్. దేవాస్ మధ్యప్రదేశ్ 14
జోగ్‌మట్టి BSES BSES లిమిటెడ్. చిత్రదుర్గ జిల్లా కర్ణాటక 14
పెరుంగుడి నేవమ్ నేవమ్ పవర్ కంపెనీ లిమిటెడ్. పెరుంగుడి తమిళనాడు 12
కెథనుర్ విండ్ ఫార్మ్ కెథనూర్ విండ్ ఫార్మ్ కెథనూర్ తమిళనాడు 11
హైద్రాబాద్ APSRTC ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రాపిడ్ ట్రాన్సిట్ కార్పొరేషన్. హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ 10
ముప్పందల్ మద్రాస్ మద్రాస్ సిమెంట్స్ లిమిటెడ్. ముప్పందల్ తమిళనాడు 10
పూలవాడి చెట్టినాడ్ చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్. లిమిటెడ్. పూలవాడి తమిళనాడు 10

అవరోధాలు[మార్చు]

పవన టర్బైన్‌లకు ప్రారంభ వ్యయం MW సాంప్రదాయక శిలాజ ఇంధన జనరేటర్లను నెలకొల్పేదానికంటే ఎక్కువగానే ఉంటుంది. రోటర్ బ్లేడ్‌ల ద్వారా శబ్దం ఉత్పత్తవుతుంది. చాలావరకు పవన క్షేత్రాల కోసం ఎంచుకున్న ప్రాంతాలలో సాధారణంగా ఇది సమస్య కాదు పైగా, UKలోని పవన క్షేత్రాలలో శబ్దంపై ఆరోపణలు దాదాపు ఉనికిలో లేవని సాల్‌ఫోర్డ్ యూనివర్శిటీ[22] పరిశోధన సూచిస్తోంది.

ఉపయోగం[మార్చు]

అత్యధిక సామర్థ్యంతో నెలకొల్పినప్పటికీ, భారత్‌లో పవన విద్యుత్ వాస్తవ వినియోగం తక్కువగానే ఉంది, ప్లాంట్ల నిర్వహణ కంటే వాటి స్థాపన కోసం ఇచ్చే ప్రోత్సాహకాలు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అందుకనే భారత్‌లో పవన క్షేత్రాల స్థాపన సామర్థ్యం 6%గా ఉన్నప్పటికీ, వాస్తవ విద్యుత్ ఉత్పత్తి 1.6%గా మాత్రమే ఉంటోంది. ఇప్పటికే నెలకొల్పిన పవన విద్యుత్ సంస్థల నిర్వహణకోసం అదనంగా ప్రోత్సాహకాలు కల్పించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.[8]

భవిష్యత్తు[మార్చు]

2007-12 మధ్యకాలంలో 10,500 MWను ఉత్పత్తి చేయాలని నూతన మరియు రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ (MNRE) లక్ష్యంగా పెట్టుకుంది కాని, 2012 నాటికి కేవలం 6,000 MW విద్యుత్తును మాత్రమే వాణిజ్య ప్రయోజనం కోసం అదనంగా ఉత్పత్తి చేసే అవకాశం అందుబాటులో ఉండవచ్చు.[7]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • భారతదేశ శక్తి ప్రణాళిక
 • భారతదేశంలో సౌరశక్తి
 • భారి వాయు కేంద్రాలు యొక్క జాబితా

సూచనలు[మార్చు]

 1. "వరల్డ్ విండ్ ఎనర్జి రిపోర్ట్ 2008". నివేదిక "వరల్డ్ విండ్ ఎనర్జి రిపోర్ట్ 2008"
 2. http://www.windpowerindia.com/statstate.html
 3. 3.0 3.1 http://www.tn.gov.in/policynotes/pdf/energy.pdf
 4. http://www.projectsmonitor.com/detailnews.asp?newsid=15318
 5. http://www.azocleantech.com/details.asp?newsID=9397
 6. http://www.indianwindpower.com/installed_wind_capacity.php
 7. 7.0 7.1 ఇండియా 2012 నాటికీ అదనంగా 6,000 మెగావాట్ల వాయు శక్తీ పొందనుంది; కానీ లక్ష్యనికన్న తక్కువ
 8. 8.0 8.1 http://www.peopleandplanet.net/doc.php?id=3357
 9. http://cleanpowerdrive.blogspot.com/2010/05/wind-atlas-harnessing-wind-power-in.html
 10. http://www.business-standard.com/india/storypage.php?tp=on&autono=44562
 11. గ్లోబల్ విండ్ 2008 రిపోర్ట్
 12. 12.0 12.1 సుజ్లోన్ భాగస్వాములు మహారాష్ట్ర తో సంవత్సరానికి రికార్డ్ స్థాయిలో వాయు శక్తీని ఉత్పత్తి చేసారు
 13. లెవిస్, జోస్సా I. (2007). ఏ కంపారిషన్ ఆన్ అఫ్ విండ్ పవర్ ఇండస్ట్రి డెవ్లప్మెంట్ స్ట్రాటజీస్ ఇన్ స్పైన్, ఇండియా అండ్ చైనా
 14. "Tapping the Wind - India". February 2005. Retrieved 2006-10-28. 
 15. Watts, Himangshu (November 11 2003MGV will provide more information). "Clean Energy Brings Windfall to Indian Village". Reuters News Service. Retrieved 2006-10-28.  Check date values in: |date= (help)
 16. http://economictimes.indiatimes.com/News/News-By-Industry/Energy/Power/Shriram-EPC-bags-70-cr-contract/articleshow/4199499.cms
 17. [1]
 18. గుజరాత్ సమాన వాయు శక్తీ కేంద్రం గా మారనుంది.
 19. ONGC మొదటి విండ్ ఫారం ప్రాజెక్ట్ ను ప్రారంబించినది.
 20. http://www.windpowerindia.com/generation.htm
 21. http://www.eai.in/ref/ae/win/win.html
 22. సల్ఫోర్డ్ యునివర్సిటీ, మూర్హౌస్, AT, హేస్, M, వాన్ హనర్బైన్, S, పైపర్, BJ మరియు ఆడమ్స్, MD 2007.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Economy of India related topics మూస:Wind power by country మూస:Wind power మూస:Renewable energy by country