భారతదేశంలో మతములు
భారతదేశంలో మతములు : భారతదేశపు జనాభాలో హిందూ మతమును అవలంబించువారు 80% గలరు. భారత్ లో రెండవ అతిపెద్ద మతము ఇస్లాం (13.43%) జనాభాతో యున్నది. ఇతర భారతీయ మతములు బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము ను అవలంబించు వారు 3% జనాభాకన్నా తక్కువ గలరు. భారత్ లోని 2% జనాభా క్రైస్తవ మతమును అవలంబించుచున్నది.
విషయ సూచిక |
[మార్చు] జనగణన
భారతదేశంలో మత ప్రాతిపదికపైన జనాభా విభజన :
| మతము | వ్యక్తులు | శాతము |
|---|---|---|
| మొత్తం మతములు | 1,028,610,328 | 100.00% |
| హిందువులు | 827,578,868 | 80.456% |
| ముస్లింలు | 138,188,240 | 13.434% |
| క్రైస్తవులు | 24,080,016 | 2.341% |
| సిక్కులు | 19,215,730 | 1.868% |
| బౌద్ధులు | 7,955,207 | 0.773% |
| జైనులు | 4,225,053 | 0.41% |
| ఇతరులు | 6,639,626 | 0.645% |
| లెక్కించని మతములు | 727,588 | 0.07% |
| విషయము | హిందువులు[2] | ముస్లింలు[3] | క్రైస్తవులు[4] | సిక్కులు[5] | బౌద్ధులు[6] | జైనులు[7] | ఇతరులు[8] |
|---|---|---|---|---|---|---|---|
| 2001 మొత్తం జనాభాలో % | 80.46 | 13.43 | 2.34 | 1.87 | 0.77 | 0.41 | 0.65 |
| 10-సం.లలో పెరుగుదల % (est '91–'01)[9][β] | 20.3 | 36.0 | 22.6 | 18.2 | 24.5 | 26 | 103.1 |
| లింగ నిష్పత్తి* (సగటు 933) | 931 | 936 | 1009 | 893 | 953 | 940 | 992 |
| అక్షరాస్యతా శాతం (సగటు 64.8) | 65.1 | 59.1 | 80.3 | 69.4 | 72.7 | 94.1 | 47.0 |
| పని నిమగ్నతా శాతం | 40.4 | 31.3 | 39.7 | 37.7 | 40.6 | 32.9 | 48.4 |
| గ్రామీణ లింగ నిష్పత్తి[9] | 944 | 953 | 1001 | 895 | 958 | 937 | 995 |
| పట్టణ లింగ నిష్పత్తి[9] | 894 | 907 | 1026 | 886 | 944 | 941 | 966 |
| శిశు లింగ నిష్పత్తి (0–6 సం.లు) | 925 | 950 | 964 | 786 | 942 | 870 | 976 |
వనరులు: మతములపై మొదటి రిపోర్టు: 2001 భారత జనాభా గణాంకాలు[10]
α. ^ మావో-మరామ్, పావోమాటా మరియు మణిపూర్ కు చెందిన 'సేనాపతి జిల్లా' కు చెందిన పురుల్ ఉప-విభజనలను లెక్కలోకి తీరుకోలేదు. β. ^ 1991 లో అస్సాం మరియు జమ్ము కాశ్మీర్ లో జనగణన జరుగలేదు. ఈ సమాచారములో కూర్చబడలేదు.
[మార్చు] భారత ఉపఖండము
భారత ఉపఖండములో మతముల సమాచారములు:
- భారతదేశం : 80% హిందువులు, 13% ముస్లిములు, 2% క్రైస్తవులు, 2% సిక్కులు (1,100 M)
- పాకిస్తాన్: 97% ముస్లిములు, 2% హిందువులు, 1% క్రైస్తవులు (165 M)
- బంగ్లాదేశ్: 83% ముస్లిములు, 16% హిందువులు (150 M)
- మయన్మార్: 89% బౌద్ధులు, 4% ముస్లిములు, 4% క్రైస్తవులు (43 M)
- శ్రీలంక: 70% బౌద్ధులు, 15% హిందువులు, 7% ముస్లిములు, 7% క్రైస్తవులు (20 M)
వీటి మొత్తంలో : 63% హిందువులు, 29% ముస్లిములు, 5% బౌద్ధులు, 2% క్రైస్తవులు, మరియు 1% సిక్కులు.
[మార్చు] మతములు మరియు విభాగాలు
[మార్చు] హిందూ మతము
భారతదేశ జనాభాలో 80% కన్నా ఎక్కువ జనాభా గల మతము. ప్రపంచంలో గల హిందూ మతస్థులలో 90% కన్నా ఎక్కువగా భారత్ లోనే నివసిస్తున్నారు.
- ఈ మతము గురించి చూడండి : హిందూ మతము
[మార్చు] అయ్యావళి
దక్షిణ భారత దేశంలో ఈ సమూహం గలదు. వీరు హిందూ మతమునకు అంతర్భాగంగానే వున్నారు. వీరెక్కువగా తమిళనాడు మరియు కేరళ లో గలరు.
[మార్చు] ఇస్లాం
- ప్రధాన వ్యాసం: భారతదేశంలో ఇస్లాం
- దీనిలో సున్నీ ఇస్లాం మరియు షియా ఇస్లాం అను రెండు పెద్ద వర్గాలు గలవు.
[మార్చు] అహ్మదీయ
అహ్మదీయ అనునది ఒక చిన్న ఉద్యమము. దీనిని మిర్జా గులాం అహ్మద్ ప్రారంభించాడు. ఇతనిని అనుసరించేవారి సంఖ్య భారత్ లో కొద్దిగా గలదు. వీరు ముస్లింల సమూహములోనే ఒక అంతర్భాగమని భావిస్తారు గాని, ఇస్లాం కు ఈ ఉద్యమానికి ఏలాంటి సంబంధం లేదని, ఇదొక ఫిత్నా అని ముస్లింలు భావిస్తారు.
[మార్చు] జైన మతము
భారతదేశంలో జైన మతస్థులు దాదాపు భారత జనాభాలో 0.4% గలరు.
- ఈ మతము గురించి చూడండి : జైన మతము
[మార్చు] బౌద్ధ మతము
భారతదేశంలో బౌద్ధ మతస్థులు దాదాపు 90 లక్షలు గలరు. వీరెక్కువగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మరియు జమ్ము కాశ్మీర్ లోని లఢక్ ప్రాంతంలో గలరు.
- ఈ మతము గురించి చూడండి : బౌద్ధ మతము
[మార్చు] సిక్కు మతము
భారతదేశంలో సిక్కు మతస్థులు 1.93 కోట్లు గలరు. వీరెక్కువగా పంజాబు రాష్ట్రం మరియు ఢిల్లీ, హర్యానా లో గలరు. భారతదేశంలోని పలు నగరాలలోనూ వీరి జనాభా కానవస్తుంది.
- ఈ మతము గురించి చూడండి : సిక్కు మతము
[మార్చు] క్రైస్తవ మతము
భారతదేశంలో క్రైస్తవులు దాదాపు 2.9% గలరు. భారతదేశమంతటా వ్యాపించియున్నారు.
- ఈ మతము గురించి చూడండి : క్రైస్తవ మతము.
[మార్చు] యూద మతము
ఈ మతస్తులు భారత్ లో 1991 జనగణన ప్రకారం 5271 మంది గలరు. వీరెక్కువగా మహారాష్ట్ర మరియు కేరళ లో గలరు.
- ఈ మతము గురించి చూడండి : యూద మతము
[మార్చు] జొరాస్ట్రియన్ మతము
జొరాస్ట్రియన్లు లేదా పారసీ మతస్తులు భారతదేశ జనాభాలో 0.06% గలరు. వీరెక్కువగా ముంబాయి లో గలరు.
- ఈ మతము గురించి చూడండి : జొరాస్ట్రియన్ మతము
[మార్చు] బహాయి విశ్వాసము
ఈ మతస్తులు భారత్ లో దాదా పు 22 లక్షల మంది వున్నారు. ప్రపంచంలోని బహాయి విశ్వాసులలోని ఎక్కువమంది భారతదేశంలో వున్నారు.
- ఈ మతము గురించి చూడండి : బహాయి విశ్వాసము
[మార్చు] పాదపీఠికలు
- ↑ Tables: Profiles by main religions. DATA FILE (in Spreadsheet format). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. తీసుకొన్న తేదీ: 2007-04-17. Please download the file (which is compressed by winzip) to see the data in spreadsheet.
- ↑ Tables: Profiles by main religions: Hindus (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. తీసుకొన్న తేదీ: 2007-04-17.
- ↑ Tables: Profiles by main religions: Muslims (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. తీసుకొన్న తేదీ: 2007-04-17.
- ↑ Tables: Profiles by main religions: Christians (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. తీసుకొన్న తేదీ: 2007-04-17.
- ↑ Tables: Profiles by main religions: Sikhs (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. తీసుకొన్న తేదీ: 2007-04-17.
- ↑ Tables: Profiles by main religions: Buddhists (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. తీసుకొన్న తేదీ: 2007-04-17.
- ↑ Tables: Profiles by main religions: Jains (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. తీసుకొన్న తేదీ: 2007-04-17.
- ↑ Tables: Profiles by main religions: Other religions (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. తీసుకొన్న తేదీ: 2007-04-17.
- ↑ 9.0 9.1 9.2 A snapshot of population size, distribution, growth and socio economic characteristics of religious communities from Census 2001 (PDF). Census of India 2001: DATA ON RELIGION pp1–9. Office of the Registrar General, India. తీసుకొన్న తేదీ: 2007-04-20.
- ↑ Tables: Profiles by main religions.. Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. తీసుకొన్న తేదీ: 2007-04-17.
[మార్చు] మూలాలు
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})