భారతీయ రిజర్వ్ బాంక్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India-RBI) భారత దేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును 1935, ఏప్రిల్ 1 న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 ప్రకారము స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావనం ముంబాయి నగరం లో ఉంది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్ననూ 1949 లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలో ఉంది.
రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్ . ఇతనికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంలో ఆర్థిక నైపుణ్యం కల వ్యక్తులను ఈ బ్యాంకు అధిపతులుగా నియమించబడతారు. మనదేశ ప్రస్తుత ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ గతంలో రిజర్వ్ బ్యంకు గవర్నర్ గా పనిచేసినారు. రిజర్వ్ బ్యంకుకు ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఈయన 2008 సెప్టెంబర్ 5 న వేణుగోపాల రెడ్డి నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు కలవు.
విషయ సూచిక |
[మార్చు] రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు
- ఆస్‌బోర్న్ స్మిత్ (1935-1937)
- జేమ్స్ టేలర్ (1937-1943)
- సి.డి.దేశ్‌ముఖ్ (1943-1949)
- బెనెగల్ రామారావు
- కె.జి.అంబెగాంకర్ (1957)
- హెచ్.వి.జి.అయ్యంగార్ (1957-1962)
- పి.సి.భట్టాచార్య (1962-1967)
- ఎల్.కె.ఝా (1967-1970)
- బి.ఎన్.అదార్కర్ (1970)
- ఎస్.జగన్నాథన్ (1970-1975)
- ఎన్.సి.సేన్‌గుప్తా (1975)
- కె.ఆర్.పూరి (1975-1977)
- య.నరసింహమ్ (1977)
- ఐ.జి.పటేల్ (1977-1982)
- మన్‌మోహన్ సింగ్ (1982-1985)
- ఏ.ఘోష్ (1985)
- ఆర్.ఎన్.మల్హోత్రా (1985-1990)
- ఎస్.వెంకట్రామన్ (1990-1992)
- సి.రంగరాజన్ (1992-1997)
- బిమల్ జలన్ (1997-2003)
- వై.వేణుగోపాల రెడ్డి (2003- 2008)
- దువ్వూరి సుబ్బారావు 2008 - ప్రస్తుతం వరకు)
[మార్చు] డైరెక్టర్ల బోర్డు
జూన్ 27,2006 న, భారత ప్రభుత్వము కేంద్ర బోర్డు డైరక్టర్ల నియామకాలను జారీచేసింది, ఇందులో 13 సభ్యులున్నారు, అజీం ప్రేమ్ జీ మరియు కుమారమంగళం బిర్లా లు వున్నారు. ఇతర సభ్యులు:
- సురేష్ టెండూల్కర్, ఆర్థికవేత్త మరియు సభ్యుడు, ప్రధానమంత్రి సలహా మండలి.
- యూ. ఆర్. రావు, మాజీ ఛైర్మన్, ఇస్రో (ISRO) మరియు ఛైర్మన్ శోధనా మండలి, భౌతిక పరిశోధనాలయం, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్.
- లక్ష్మీ చంద్, రిటైర్డ్ IAS ఆఫీసరు.
- శశిరేఖ రాజగోపాలన్, కన్సల్టెంట్, సహకారాలు.
- సురేష్ కుమార్ నియోతియా, ఛైర్మన్, అంబుజా సిమెంట్.
- ఏ. వైద్యనాథన్, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్.
- మన్మోహన్ శర్మ, FRS, మాజీ డైరెక్టరు, ముంబై విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నలజీ.
- డి. జయవర్థనవేలు, ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టరు, లక్ష్మీ మెషీన్ వర్క్స్ లిమిటెడ్.
వీరు నామినేట్ చేయబడ్డారు
- వై.హెచ్. మాలెగం, ఛార్టర్డ్ అకౌంటెంటు.
- అశోక్ ఎస్. గంగూలీ, సభ్యుడు, ఇన్వెస్ట్ మెంట్ కమీషన్ మరియు ఛైర్మన్, ICICI OneSource.
పదవీ విరమణ పొందిన డైరెక్టర్లు
1 జూలై, 2006, వినియోగదారులకు మెరుగైన సేవల కొరకు ఒక ప్రత్యేక డిపార్ట్ మెంటును (CSD) ఏర్పాటు చేసింది.
[మార్చు] ప్రధాన ఉద్దేశ్యాలు
[మార్చు] ద్రవ్య అధికారం
- ద్రవ్య పాలసీలను సూత్రీకరిస్తుంది, అమలు చేస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది.
- ఉద్దేశ్యం: రూపాయి విలువను స్థిరీకరిస్తుంది మరియు తయారీ సెక్టారులకు రుణప్రవాహ సౌకర్యాలు కలుగజేస్తుంది
- ఆర్థికంలో ఆప్టిమమ్ లిక్విడిటీ ను మెయింటైన్ చేస్తుంది.
[మార్చు] ఎక్స్ ఛేంజి కంట్రోల్ మేనేజరుగా
- విదేశీ మారకద్రవ్యాన్ని, ఫారిన్ ఎక్స్ ఛేంజి ఆక్ట్ 1999 ను మేనేజ్ చేస్తుంది.
- ఉద్దేశ్యం: బాహ్య వాణిజ్యం మరియు చెల్లింపులు మరియు, భారత్ లో విదేశీ మార్కెట్ ను అభివృధ్ధి చేయుటకు పాటుపడుతుంది
[మార్చు] కరెన్సీల విడుదల
- కరెన్సీ ను విడుదల చేస్తుంది లేక కరెన్సీను, నాణేలను నాశనం చేసి సర్కులేషన్ ను క్రమబద్దీకరిస్తుంది
- ఉద్దేశ్యం: ప్రజలకు నాణ్యమైన కరెన్సీని అందుబాటు చేస్తుంది మరియు వాణిజ్య బ్యాంకులకు రుణాలిస్తుంది, జి.డి.పి. ని అభివృద్ధి పరుస్తుంది.
[మార్చు] అభివృద్ధి పాత్ర
- జాతీయ ఉద్దేశ్యాలను సాధించేందుకు అభివృద్ధి పథకాలను అమలుపరుస్తుంది
[మార్చు] వాణిజ్య బ్యాంకుల పెద్ద లయబిలిటీలు
క్రింది లెక్కలు మిలియన్ రూపాయలలో. చూడుము [1] మరియు [2]
| సంవత్సరం | డిపాజిట్లు మరియు ఇతర ఖాతాలు[1] | బిల్లుల చెల్లింపులు |
|---|---|---|
| 1950 | 9,983 | 173 |
| 1955 | 11,592 | 262 |
| 1960 | 20,218 | 317 |
| 1965 | 32,897 | 446 |
| 1970 | 64,793 | 923 |
| 1975 | 156,665 | 2,254 |
| 1980 | 439,869 | 10,995 |
| 1985 | 1,032,134 | 24,556 |
| 1990 | 1,820,468 | 38,656 |
| 1995 | 3,984,352 | 116,622 |
[మార్చు] వాణిజ్య బ్యాంకుల మేజర్ ఆస్తులు
క్రింది లెక్కలు మిలియన్ రూపాయలలో. చూడుము [3] మరియు [4]
| సంవత్సరం | పెట్టుబడి [2] | అడ్వాన్సులు [3] |
|---|---|---|
| 1950 | 4,330 | 5,353 |
| 1955 | 4,600 | 7,037 |
| 1960 | 7,241 | 12,458 |
| 1965 | 9,884 | 21,954 |
| 1970 | 18,148 | 46,850 |
| 1975 | 45,999 | 106,167 |
| 1980 | 126,642 | 272,673 |
| 1985 | 303,378 | 623,553 |
| 1990 | 687,151 | 1,095,412 |
| 1995 | 1,750,206 | 2,243,308 |
[మార్చు] ఇవి కూడా చూడండి
|
|||||||||||
|
|||||
[మార్చు] బయటి లింకులు
- రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మెన్ సైట్
- భారత ద్రవ్యవిధానం
- రిజర్వ్ బ్యాంక్ మాండేటు సంస్కరణలు
- రిజర్వ్ బ్యాంక్ నిర్వహణలు
- గవర్నర్ల పేజీల రిజర్వ్ బ్యాంక్ అధికారిక సైట్
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found