భార్య
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ఒక పురుషుడు వివాహము చేసుకున్న స్త్రీని అతడి భార్య, పెళ్ళాం, ఇల్లాలు, గృహిణి, దార, పత్ని లేదా ధర్మపత్ని అంటారు.
తెలుగు భాషలో దార అంటే పెండ్లాము అని అర్ధము.[1] పరదార అనగా a neighbour's wife. దారకొమ్ము అనగా చమరుపోసే పసరపు కొమ్ము. దారపోయు అనగా To endow, to give by a formal ceremony, in which water is poured from the hand of the donor. To bestow as a solemn gift. To lose, పొగొట్టుకొను. దారాపుత్రాదులు అనగా భార్యాబిడ్డలు A family, a household. Lit: Wives, children, and all.
విషయ సూచిక |
[మార్చు] భార్యపై సామెతలు
- ఆలు మంచిదని అనబోకురన్నా అదివచ్ఛి మనఇంట అణిగియుండేదాక
- ఆలికి లొంగినవాడు అరగాణిలో పడినవాడు అటిటు ఔతారు
- ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
- ఆలికి అదుపు ఇంటికి మదుపు
- ఆలితో కలహించి ఆకాలికాదని పస్తు పండెడువాడు పంజు వెధవ
- ఆలికి గంజిపోయనివాడు ఆచారం చెప్పినట్లు
- ఆలిని అదుపులో పెట్టలేనివాడు అందరినీ అదుపులో పెట్టగలడా?
- ఆలిని ఒల్లని వాడు ఈలకూరలో ఉప్పులేదన్నాడట
- ఆలిని విడిస్తే హరిదాసు సంసారం విడిస్తే సన్యాసి
- ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం
- ఆలి మాటవిన్నవాడు అడివిలో పడ్డవాడు ఒకటే
- ఆలు ఏడ్చిన ఇల్లు ఎద్దుఏడ్చిన సేద్యం ముందుకురావు
- ఆలు కుదురైతే చేను కుదురు
- ఆలుమగల కలహం అన్నం తినేదాకనే
- ఇంటికి దీపం ఇల్లాలు
- ఇల్లాలి శుభ్రత ఇల్లు చెబుతుంది
- ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు
- భార్యమాట బ్రతుకుబాట
- భార్య అనుకూలవతి ఐతే సుఖి లేకుంటే వేదాంతి ఔతారు
- ఇల్లాలు గుడ్డిదైతే ఇంటికుండలకు చేటు
- ఇల్లాలులేని ఇల్లు దయ్యాలకొంప
[మార్చు] భార్యపై పాటలు
"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
[మార్చు] ఏకపత్నీవ్రతం
హిందూ పురాణాలలో శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు.
పన్నెండు శాతం దేశాల్లో ఒకేభార్య సిద్ధాంతాన్ని పాటిస్తారు.
[మార్చు] బహుభార్యత్వం
- ప్రధాన వ్యాసం: బహుభార్యాత్వం
బహుభార్యత్వం ఉన్న పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని బ్రిటన్‌లోని షీఫెల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెప్పారు. సాధారణంగా పురుషులు స్త్రీల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారు. ఏక భార్యత్వం అమలులో ఉన్న దేశాల్లో భార్యలు చనిపోతే భర్తలు మళ్లీ పెళ్లి చేసుకుంటారని , భర్తలు చనిపోయిన వితంతువులు మ్రాతం మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం లేదని మళ్లీ పెళ్లి చేసుకున్న పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం కూడా ఎక్కువైందని పరిశోధకులు తెలిపారుఈనాడు 21.8.2008
[మార్చు] భార్యా బాధితులు
- వైవాహిక సంబంధాలు, విడాకులు, పిల్లల సంరక్షణ తదితర అంశాల్లో చట్టాలన్నీ మహిళలకే అనుకూలంగా ఉన్నాయని భార్యా బాధితులు ఆరోపిస్తున్నారు. ఐపీసీలోని సెక్షన్ 498(ఎ) రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.విడిపోయిన దంపతులకు చెందిన పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని, కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు. వరకట్న నిషేధచట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని భార్యా బాధితులు విమర్శించారు.ఈనాడు 17.8.2009.
[మార్చు] భార్యాన్నజీవులు
తమ భార్యల కంటే చాలా తక్కువగా సంపాదించే వారు ఎప్పుడూ విచార వదనంలో మునిగితేలుతుంటారట.తమ భార్యల సంపాదనపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న పురుషులు వారిని మోసగించడంలో ముందుంటారట.ఈనాడు 17.8.2010.