భార్యాభర్తల సవాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌భార్యాభర్తల సవాల్
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖర్ రెడ్డి
తారాగణం మోహన్ బాబు ,
సుమలత
నిర్మాణ సంస్థ పద్మజ కళామందిర్
భాష తెలుగు

భార్యాభర్తల సవాల్ 1983 అక్టోబరు 6న విడుదలైన తెలుగు సినిమా. పద్మజ కళా మందిర్ పతాకం కింద ఆర్. రామకృష్ణరాజు, కె.ఎల్.ఎస్.ఎస్. రామచంద్రరాజు లు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు , సుమలత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు. [1]

తారాగణం[మార్చు]

  • మోహన్ బాబు
  • సుమలత
  • రావు గోపాలరావు (చక్రవర్తి),
  • గొల్లపూడి మారుతీరావు (బుల్లెబ్బాయి),
  • జయమాల (మేనక)

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
  • నిర్మాత: ఆర్.రామకృష్ణరాజు, కె.ఎల్.ఎస్.ఎస్. రామచంద్రరాజు;
  • కంపోజర్: రాజ్-కోటి
  • సమర్పణ: కె. వెంకటరామ రాజు;
  • సహ నిర్మాత: కె. రామరాజు
  • కథ: ఎన్వీ సుబ్బరాజు

పాటలు[మార్చు]

  1. ఆ గంగా యమునా కలిసేది ప్రయాగ ఈ పసుపు కుంకుమా - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన: వేటూరి
  2. కరవమంటే కప్పకు కోపం వదలమంటే పాముకి కోపం - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
  3. చిగురంత బావకు చెట్టంత కోపం డుం డుం డుం - పి. సుశీల,ఎం. రమేష్ - రచన: డా. సినారె
  4. ప్రియతమా ఓ ప్రియతమా ఒకసారి ప్రేమించి చూడు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
  5. రానైతే వచ్చావు ఈ చోటికి ఏమిచ్చి పోతావు ఈ తోటకి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె

మూలాలు[మార్చు]

  1. "Bharya Bharthala Sawal (1983)". Indiancine.ma. Retrieved 2022-12-24.

బాహ్య లంకెలు[మార్చు]