భికాజీ రుస్తుం కామా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భికాజీ రుస్తుం కామా
{{{lived}}}
Madam Bhikaiji Cama.jpg
Madame Bhikaiji Cama
పుట్టిన తేదీ: 24 September 1861
జన్మస్థలం: Bombay, British India
మరణించిన తేదీ: 13 August 1936
నిర్యాణ స్థలం: Bombay, British India
ఉద్యమము: Indian independence movement
ప్రధాన సంస్థలు: India House,
Paris Indian Society,
Indian National Congress

భికాజీ రుస్తుం కామా' (Bhikaiji Rustom Cama) (1861 - 1936) భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్సీ వనిత. 1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. రోగగ్రస్తులకు సేవలు చేస్తున్న ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. 1901 చికిత్స కోసం ఇంగ్లండ్ కు పంపబడినది. అక్కడున్న భారత స్వాతంత్ర్యోద్యమ కర్త శాంయజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై, 1905 లో దాదాభాయ్ నౌరోజీ కి సహాయకురాలిగా ఇండియన్ హోం రూల్ సొసైటీని స్థాపించింది. బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని, ఇండియాకు వెళ్ళనీయనందా ప్రభుత్వం. భికాజీ ఇంగ్లండ్ వదలి పారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకుంది. 1907 ఆగష్టులో జర్మనీలోని స్టుట్ గార్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ కు వెళ్ళి మనదేశ స్వాతంత్ర్యం కోసం వారి మద్దతు కోరింది. మనదేశానికొక పతాకం ఉండాలని, దామోదర్ వినాయక్ సావర్కర్ తో కలసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారుచేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది. ప్రస్తుత మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం భికాజీ కృషే. మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రులైన బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బలవంతాన, భికాజీ ఫ్రాన్స్ లో నిర్భంధించబడింది. యుద్ధానంతరం ఫ్రాన్స్ లోనే యుండి, మన స్వాతంత్ర్యం కోసం వ్యాసాలు వ్రాస్తూ, ప్రసంగాలు చేస్తుండేది. 1935 తీవ్రమైన అస్వస్థతకు గురై, భారతదేశం తిరిగివచ్చి 1936లో మరణించింది. తన యావదాస్తిని ఆవాబాయి పెటిట్ అనాథ శరణాలయం కి దానం చేసింది.

Design of the "Flag of Indian Independence" raised by Bhikhaiji Cama on 22 August 1907, at the International Socialist Conference in Stuttgart, Germany.
Based on the Calcutta Flag, the green, yellow and red fields represent Islam, Hinduism and Buddhism respectively. The crescent and the sun again represent Islam and Hinduism. The eight lotuses in the upper register represent the eight provinces of British India. The words in the middle are in Devanagri script and read Vande Mataram "[We] Bow to thee Mother [India]", the slogan of the Indian National Congress.
The design was adopted in 1914 as the emblem of the Berlin Committee (later known as the Indian Independence Committee). The original flag raised by Cama in Stuttgart is now on display at the Maratha and Kesari Library in Pune.

ఇంతటి గొప్ప దేశ భక్తురాలి స్మృత్యర్థం ఆమె జన్మ శతాబ్ది సందర్భంగా 1962 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 1997 సంవత్సరంలో మన కోస్ట్ గార్డ్ లోని అతివేగపు గస్తీ నౌకను ఆమె పేరు పెట్టారు.