భుజంగాసనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భుజంగాసనం.

భుజంగాసనము (సంస్కృతం: भुजङ्गसन) యోగాలో ఒక విధమైన ఆసనము. సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అని అర్థం. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం పడగ ఎత్తిన పాము వలె ఉంటుంది కనుక దీనిని భుజంగాసనమని పేరువచ్చింది. భుజంగాసనం చాలా సులువైన వ్యాయామ రీతిగా చెప్పవచ్చు. అయితే, దీంట్లో తప్పులు కూడా సునాయాసంగానే చేసే అవకాశముంది. కాబట్టి ఈ ఆసనం ద్వారా గరిష్ఠ ప్రయోజనాలు పొందడానికి గాను దీని గురించిన వివరాల పట్ల శ్రద్ధ వహించాలి.

విరామ స్థితిలో ఉన్నప్పుడు, నింపాదిగా ఈ భుజంగాసనాన్ని ప్రయత్నిస్తే మంచిది. ఈ ఆసనం వేసేటప్పుడు మీ వెన్నెముక కండరాలు ఒత్తిడికి గురికారాదు. అలాగే ఆసనాన్ని త్వరత్వరగాను, ఉన్నట్లుండి కూడా వేయడానికి ప్రయత్నించరాదు. భుజంగాసనాన్ని శలభాసనము, ధనురాసనాలతో కలిపి వేయాలి, ఈ మూడు ఆసనాలు కలిపి త్రయంగా ఏర్పడతాయి.

ఈ మూడు ఆసనాలూ పరస్పరం అనుసంధానమై ఉంటాయి. భుజంగాసనానికి వ్యతిరేక భంగిమలు హలాసనంగా, పశ్చిమోత్తాసనంగా రూపు దాలుస్తాయి.

పద్ధతి[మార్చు]

  • బోర్లా పడుకొని రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి నేలమీద ఆనించాలి.
  • రెండు చేతులను ఛాతీకి దగ్గరగా నేలమీద ఉంచాలి.
  • కొద్దిగా శ్వాస పీల్చి, తలపైకి ఎత్తి నడుమును వెనుకకు వీలైనంత వరకు వంచాలి.
  • కొద్ధి క్షణాలు తరువాత మెల్లగా తలను నేలపై ఆనించాలి.
  • కొద్ది క్షణాలు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.

ప్రయోజనాలు[మార్చు]

  • రుతుక్రమం సకాలంలో రాకుండా బాధపడుతున్న మహిళలకు భుజంగాసనం ప్రత్యేకించి లబ్ధి చేకూరుస్తుంది.
  • అండాశయం, మూత్రాశయానికి సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది.
  • గర్భసంచిని, చుట్టుపక్కల ఉన్న కటి ప్రాంతాలను ఇది క్రమబద్ధంగా పనిచేసేలా చూస్తుంది. పొత్తి కడుపు భాగంలో ఒత్తిడిని పెంచడం ద్వారా ఇది జరుగుతుంది.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం ఈ ఆసనం వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
  • స్వల్ప రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే భుజంగాసనాన్ని తప్పక వేసి మంచి ఫలితాలు పొందవచ్చు.
  • పెద్దప్రేగు, పొట్టలోని వాయువును భుజంగాసనం వెలుపలకు నెడుతుంది.
  • మెడ, వీపుకు సంబంధించిన అన్నిరకాల నొప్పులకు భుజంగాసనం దివ్యంగా పనిచేస్తుంది.