భువన్ చంద్ర ఖండూరి
| భువన్ చంద్ర ఖండూరి | |
|
|
|
| పదవీ కాలము 2011, సెప్టెంబరు 10 నుంచి |
|
| ముందు | రమేష్ పోఖ్రియార్ |
|---|---|
|
|
|
| జననం | అక్టోబర్ 1 1934 (వయసు 77) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ |
| రాజకీయ పార్టీ | |
| భార్య/భర్త | అరుణా ఖండూరి |
| సంతానము | ఒక కూతురు, ఒక కుమారుడు |
| అక్టోబరు 1, 2011 | |
భువన్ చంద్ర ఖండూరి (Bhuwan Chandra Khanduri) అక్టోబరు 1, 1934లో జన్మించాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
విషయ సూచిక |
[మార్చు] వ్యక్తిగత జీవితం
భువన్ చంద్ర ఖండూరి 1934 అక్టోబరు 1న ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జన్మించాడు. అలహాబారు, పూనా, కొత్తఢిల్లీ, సికింద్రాబాదులలో విద్యనభ్యసించాడు. 1954 నుండి 1990 వరకు భారత సైన్యంలో పనిచేశాడు. 1982లో అతివిశిష్ట సేవా మెడల్ కూడా పొందినాడు.
[మార్చు] రాజకీయ జీవితం
ఖండూరి సైన్యం నుంచి పదవీ విరమణ పొందిన పిమ్మట 1991లో గర్వాల్ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా స్థానం పొందినాడు. 2003లో కేబినెట్ ర్యాంకును పొందినాడు. పలు పార్లమెంటరీ కమిటీలలో కూడా పనిచేశాడు. 2007 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2009 లోకసభ ఎన్నికలలో భాజపా పరాజయానికి నైతిక బాధ్యత వహించి ఖండూరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించాడు. సెప్టెంబరు 10, 2011న[1] రెండవ పర్యాయం ఖండూరి ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేశాడు.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
|
||||||||||||||||||||||||||||||||