భూచక్రగడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భూచక్రగడ్డ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
Order:
Family:
Genus:
Species:
M. oblongifolia
Binomial name
Maerua oblongifolia
Forssk. (A.Rich.)
భైరవకోనలో పలుచని పొరలుగా కోసి అమ్ముతున్న భూచక్రగడ్డను కొంటున్న యువకులు
అమెరికా కలబంద

తిరునాళ్ళ సమయంలో లేదా ఉత్స‌వాల స‌మ‌యంలో చెంచులు అమెరికా కలబంద మొదలు నుంచి భూచక్రగడ్డ అనే ఈ గడ్డను తీసి అమ్ముతుంటారు. భూచ‌క్ర‌గ‌డ్డ సేక‌రణ చుట్టూ అనేక న‌మ్మ‌కాలు, ఆచారాలు ముడిపెట్టుకునివున్నాయి. భూచ‌క్ర‌గ‌డ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. కాబ‌ట్టి దీనిని ల‌క్ష్మిగ‌డ్డ అని, ల‌చ్చిగ‌డ్డ అని కూడా పిలుస్తుంటారు. చెంచు తండాల్లో దీన్ని ల‌చ్చిగ‌డ్డ అని మాత్ర‌మే పిలుస్తారు. న‌ర‌సింహ‌స్వామిని ఆరాధించే చెంచులు భూచ‌క్ర‌గ‌డ్డ‌ను న‌ర‌సింహ‌స్వామి ప్ర‌సాదంగా కూడా భావిస్తుంటారు. ఉత్స‌వాల స‌మ‌యంలో అమ్మేట‌ప్పుడు దీనిని గ‌డ్డ‌ప్ర‌సాద‌మ‌ని చెప్తుంటారు. ఒక గ‌డ్డను అమ్ముకుంటే వేల రూపాయల ఆదాయం లభిస్తుంది కాబట్టి దీనిని రహస్యంగా అమెరికా కలబంద మొదలు నుంచి సేకరించి అమ్ముతుంటారు. ఏవరైనా ఈ భూచక్రగడ్డ ఏ మొక్క నుంచి లభిస్తుంది అని అడిగినా, అమ్మేవారు ఇది శ్రీశైలం అడవులలో చాలా అరుదుగా లభిస్తుందని రకరకాలుగా చెబుతుంటారు. భూచక్రగడ్డ చర్చ పేజీలో మొదటిసారిగా 2013లో "కొందరు పెద్ద కలబంద చెట్టు మొదలును భూచక్రగడ్డలాగా జువ్వి దానికి చుట్టూరు ఎర్రమట్టి పూచి దానిని భూచక్రగడ్డ అని అమ్ముతారని ఒక అభిప్రాయం ఉంది" అని తెలుగు వికీపీడియాలో తెలియజేయడంతో ఇది ఏవిధంగా లభిస్తుందనేది వెలుగులోకి వచ్చింది. దీని వేరు అర అడుగు నుంచి అడుగు ఆడ్డుకొలత వ్యాసంతో రెండు నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. స్థూపాకారంలో ఉండే ఈ గడ్డను అడవి ప్రాంతాల నుంచి స్వీకరించి పలుచని పొరలుగా ఈ గడ్డను కోస్తూ అమ్ముతుంటారు. ఈ గడ్డ రుచిగా, తీయగా ఉండేందుకు ఈ గడ్డ పలుచని పొరలకు చక్కెర నీటిని అద్దుతారు. ఇది ఇండియా, పాకిస్తాన్, ఆఫ్రికా, సౌదీ అరేబియాలో ఉంటుంది. దీని వేరు భాగము కొబ్బరి కంజె లాగ రుచికరంగా ఉండును. ఇది పంచదారతో కలిపి తింటారు. గిరిజన ప్రాంతాల ప్రజలు దీనిని సేకరించి ప్రజలు రద్దీగా వుండే ప్రదేశాలలో అమ్ముతారు. దీనిని వేసవి కాలంలో దాహం వెంటనే నివారించుటకు తీసుకుంటారు.

నమ్మకాలు[మార్చు]

భూచ‌క్ర‌గ‌డ్డ సేక‌రణ చుట్టూ అనేక న‌మ్మ‌కాలు, ఆచారాలు ముడిపెట్టుకునివున్నాయి. భూచ‌క్ర‌గ‌డ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. ఒక గ‌డ్డ దొరికితే కుటుంబ‌మంతా క‌నీసం నెల‌రోజులు బ‌తికే ఆదాయాన్నిస్తుంది కాబ‌ట్టి దీనిని ల‌క్ష్మిగ‌డ్డ అని, ల‌చ్చిగ‌డ్డ అని కూడా పిలుస్తుంటారు. చెంచు తండాల్లో దీన్ని ల‌చ్చిగ‌డ్డ అని మాత్ర‌మే పిలుస్తారు. న‌ర‌సింహ‌స్వామిని ఆరాధించే చెంచులు భూచ‌క్ర‌గ‌డ్డ‌ను న‌ర‌సింహ‌స్వామి ప్ర‌సాదంగా కూడా భావిస్తుంటారు. ఉత్స‌వాల స‌మ‌యంలో అమ్మేట‌ప్పుడు దీనిని గ‌డ్డ‌ప్ర‌సాద‌మ‌ని చెప్తుంటారు.

ఎక్కడ దొరుకుతుంది[మార్చు]

సహజసిద్ధంగా అడవులలో పెరిగిన, పొలాలలో కంచెగా నాటుకున్న అమెరికా కలబంద మొక్క నుంచి ఇది లభిస్తుంది.

ఉపయోగాలు[మార్చు]

  • ర‌క్త‌విరోచ‌నాలు,
  • క‌డుపులోప‌ల ప‌డే పుండ్ల‌ను మాన్పుతుంది.
  • ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తుంది.
  • తాజాగా తీసిన ముక్క‌ను చాలా కొద్దిగా పాలు, తేనెతో క‌లిపి మిక్సీలో వేస్తే వ‌చ్చే పాలను గడ్డపాలు అంటారు.
  • పాలు ఇవ్వ‌లేని త‌ల్లులు ఈ 'గ‌డ్డ‌పాలు' పసిపిల్లలకు పడతారు
  • దాహాన్ని నివారించుటకు
  • పాము,తేలు కాటు వేసినపుడు గిరిజన వైద్యంలో [1]
అమ్మకానికి ఉంచిన భూచక్రగడ్డ

సూచిక[మార్చు]

  1. K.R.Kirthikar, P.D Basu, "Indian Medicinal Plants", The Indian Press, Allahabad, p 101, (1918)


ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]