భూమా శోభా నాగిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శోభా నాగిరెడ్డి
భూమా శోభా నాగిరెడ్డి


ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు.
నియోజకవర్గం ఆళ్ళగడ్డ

వ్యక్తిగత వివరాలు

జననం (1968-11-16)1968 నవంబరు 16
ఆళ్ళగడ్డ, ఆంధ్రప్రదేశ్, భారతదేశము
మరణం 2014 ఏప్రిల్ 24(2014-04-24) (వయసు 45)
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశము
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి భూమా నాగిరెడ్డి
సంతానం భూమా అఖిల ప్రియ, భూమా నాగ మౌనిక, భూమా విఖ్యాత్[1]

శోభా నాగిరెడ్డి (నవంబరు 16 1968ఏప్రిల్ 24 2014) [2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గంలో 2012లో ఆమె రాజీనామా చేసిన వరకు నాలుగు సార్లు శాసన సభ్యురాలిగా ఉన్నారు.[3] ఆమె ఆంధ్రప్రదేశ్ రోడ్దు రవాణా సంస్థలో చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఆమె అంతకు పూర్వం తెలుగు దేశంపార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. 2012 లో ఆమె ప్రజారాజ్యం పార్టీని వీడి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె భర్త భూమా నాగిరెడ్డి కూడా ప్రముఖ రాజకీయనాయకులు. ఆయన రెండుసార్లు శాసనసభ్యునిగానూ, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగానూ పనిచేశారు. ఆమె కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసన సభ్యులు, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అయిన శోభా నాగిరెడ్డి చురుకైన నేత.

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె 1968 నవంబర్‌ 16ఆళ్లగడ్డలో జన్మించారు. ఈమె ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి యొక్క చిన్న కుమార్తె. ఆమె ఇంటర్ వరకు చదివారు. ఆమె తమ్ముడు ఎస్.వి.మోహనరెడ్డి కూడా రాజకీయనాయకుడే.1986లో ఈమెకు భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది[1].

రాజకీయ ప్రవేశం[మార్చు]

1996 నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటివరకూ గృహిణిగానే ఉన్నారు.ఆమె భర్తె భూమా నాగిరెడ్డి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనపుడు ఆళ్ళగడ్డ నియోజవర్గ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.అప్పుడు ఖాళీ అయిన ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి 1997లో జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. 1999లో మరోదఫా టీడీపీ నుంచి శాసన సభ్యులుగా విజయం సాధించారు. 2004 లో నంధ్యాల లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేదు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాయలసీమలో గెలిచిన ఏకైక శాసన సభ్యులు శోభా నాగిరెడ్డి మాత్రమే. అది కూడా చిరంజీవి ప్రభావం వల్ల కాకుండా, తమ కుటుంబానికి ఉన్న పరపతితోనే ఆమె గెలిచారు. 2011 లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత ఆమె "వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ" లోనికి వెళ్లారు.[4]

మరణం[మార్చు]

2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా 23న నంద్యాలలో షర్మిల పాటు శోభానాగిరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో షర్మిలకు వీడ్కోలు పలికి... శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు. దీబగుంట్ల సమీపంలోని జాతీయ రహదారిపై స్థానిక రైతులు వేసిన ఆరబోసిన ధాన్యపు కుప్పల్లోకి ఆమె ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లింది. ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శోభానాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు.లో అక్కడ చికిత్స పొందుతూ 24వ తేది ఉదయం 11.05 గంటలకు మరణించారు.[5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Election commission manual of 2009
  2. "Bhuma Shobha Nagireddy No More". Filmcircle. Archived from the original on 26 ఏప్రిల్ 2014. Retrieved 24 April 2014.
  3. "Shobha submits fresh resignation". Expressbuzz. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 19 March 2012.
  4. "Bhuma, Sobha Nagireddy to hold talks". The Hindu. Chennai, India. 4 July 2008. Archived from the original on 6 జూలై 2008. Retrieved 25 ఏప్రిల్ 2014.
  5. "Bhuma, Sobha Nagireddy Declared Dead". Tollywooddaily. Hyderabad, India. 24 April 2014. Archived from the original on 26 ఏప్రిల్ 2014. Retrieved 25 ఏప్రిల్ 2014.

ఇతర లింకులు[మార్చు]