భైరవునిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భైరవునిపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం మాచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

భైరవునిపాడు పల్నాడు జిల్లా, మాచెర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామములోని ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న 10 ఏళ్ళుగూడా నిండని విద్యార్థులు, కోలాటంలో నేర్పరులు. 8 ఏళ్ళుగా వీరు పలుచోట్ల ప్రదర్శనలిచ్చి, పాఠశాలకూ మరియూ గ్రామానికీ పేరు తెచ్చుచున్నారు.[1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ శివనాగేంద్రస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016, నవంబరు-11వతేదీ శుక్రవారంనాడు ప్రారంభించెదరు. 11న ధాన్యవాసం, 12న జలవాసం కార్యక్రమాలు నిర్వహించి, 13వ తేదీ ఆదివారంనాడు విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన నిర్వహించి, అనంతరం అన్నసమారాధన, గ్రామోత్సవం నిర్వహించెదరు. [2]

శ్రీ షిర్డీసాయిబాబా మందిరం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం గురుపొర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు.[3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

  1. ఈనాడు గుంటూరు జిల్లా, 2013,అక్టోబరు-19; 5వపేజీ.
  2. ఈనాడు గుంటూరు రూరల్; 2016,నవంబరు-11; 4వపేజీ
  3. ఈనాడు గుంటూరు రూరల్; 2017,జులై-10; 4వపేజీ