భోగేశ్వరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భోగేశ్వరం నంద్యాల జిల్లా, గడివేముల మండలం, గడిగరేవుల గ్రామ పొలిమేరల్లో వెలసిన శ్రీ దుర్గాభోగేశ్వరస్వామి దేవస్థానం. పూర్వము ఈ క్షేత్రము " జనమే జయ " మహారాజు గారి ప్రతిష్ఠ అని గడిగరేవుల గ్రామంలో ఉన్న శిలా శాసనాలు తెలుపుచున్నవి. ఈ క్షేత్రము గడిగరేవుల, చిందుకూరు, తిరుపాదు, కొరట మద్ది, దుర్వేశి, కె.బొల్లవరం మొదలైన గ్రామాలకు 5 కి.మీ. దూరంలో అడవి ప్రాంతంలో వెలసియున్నది. ఇచట సెలయేరు పచ్చిమంగా తూర్పుకు పారుతూ పచ్చిమ గంగ అని ప్రసిద్ధి.

పురాణ చరిత్ర[మార్చు]

ఇక్కడ పూర్వము భోగులు అనే గ్రామం ఉంది. అందున ఈక్షేత్రమునకు భోగేశ్వరము అనే పేరు వచ్చింది. ఈ భోగులు అనే గ్రామంనకు దగ్గరలో మామిడోనిపల్లె అనే ఒక చిన్న కుగ్రామం ఉంది. ఆగ్రామంలో ఒక బీద దంపతులకు 1ఆడ, 1మగ సంతానము కలరు. ఈపిల్లల చిన్న వయసులోనే ఆ దంపతులు అకస్మాత్తుగా మరనించిరి. ఆ చిన్నారులను సంతానములేని వేరువేరు కుటుంబీకులు వీరిని చేరదీసి, వారి ఆలన, పాలన చూచుచూ పెంచుకొనుచుండిరి. అనుకోని సందర్భాలలో ఇద్దర్నీ చేరదీసిన వారు ఒకచోట కలిసి వారిద్దరికే వివాహము చేయ నిశ్చయించుకొనిరి. ( వారి గతం తెలియక ) అదే ప్రకారము వివాహము జరిపించిరి. వధూవరులు భార్యాభర్తలు వుండే పడక గదిలోకి వెల్లే ప్రయత్నములో అదే ఇంటిలో పడుకున్న లేగ ఆవుదూడ తోకను వరుడు తొక్కెను. అపుదు ఆవుదూడ తన తల్లితో ఈవిదంగా పలికెను. అమ్మా వీడు నా తోక తొక్కినాడే అన్నది. అందులకు తల్లి ఇలా అన్నది. వీడు కామంతో కళ్ళు మూసుకొని స్వంత చెల్లితోనే సుఖించుటకు శోభనము గదిలోకి వెల్లుచున్నాడు అని తల్లి పలికినది. అది విన్న వరుడు దిగులుగా మంచంపై కుర్చుని ఉండగా చూచిన వధువు ఎందుకు దిగాలుగా కూర్చున్నావు అని అడుగగా అక్కడ జరిగిన సంభాషన అంతా వధువునకు చెప్పెను . జరిగినదంతా నిజం అని తెలుసుకున్న వారిద్దరు మనము నిజంగా అన్నాచెల్లెల్లము అని నిర్దారించుకొని తల్లి ఆవు వద్దకు వెల్లి తల్లి మేము తెలియక తప్పుచేశాము మాపాపానికి ప్రాయశ్చిత్తము ఏమని అడగగా మీరు వెంటనే "" విబాండ మహర్షి కుమారుడు ఋష్యశృంగ మహర్షి వద్దకు వెళ్ళి శరణు వేడమని తల్లి ఆవు పలికినది.

క్షేత్ర మహత్యం, మహిమలు[మార్చు]

భూమిపై గల ఎనుబది నాలుగు లక్షల జీవరాసులలో మానవ జీవితము లభించుట దుర్లభము పెక్కువేల జన్మలనెత్తి యెడతెగని పున్యమార్జించుకొనినధే గాని మానవజన్మం లభింపదనుట నిర్వివాదంశము, ఐశ్వర్యము, దరిద్రము, ఆరోగ్యము, అనారోగ్యము మొదలగు భేదములు పూర్వ జన్మల ననుసరించియేంకలుగుచున్నవి గాని వేరొక కారణముకాదు. కావున ప్రతి వ్యక్తియు జీవితమందు సుఖశాంతులకు రాబోవు జన్మ ఉత్తమమైనదగుటకు పున్యచింతలతో సత్కర్మలనాచరించవలెనని, మన పురానములు చెప్పుచున్నవి. అట్టి సత్కర్మలలో తీర్దాయాత్రాచరన గావించి భగవంతుని సేవించి ఆయా ప్రదేశములలో దానధర్మాలు చేయుట ఒక పద్ధతిని మన పున్యక్క్షెత్రములలో ప్రధాన పున్యక్క్షెత్రము మన భోగేశ్వరక్క్షెత్రము . ఇక్కడ గంగా ఎప్పుడూ పారుచుండును. పవిత్ర జోతిర్మయి భోగేశ్వరము మహా లింగము ఈ క్క్షెత్రమునకు ముఖ్య కారణము. మరొక పున్యక్క్షెత్రములో ఎచటనైనను నూరు సంవత్సరములు ఉన్న ఫలము భోగేశ్వరక్క్షెత్రములో ఒక్క రోజు ధర్మ చింతనతో ఉన్న కలుగును. ఇచత వెలసిన పంచాంమృత సెలయెల్లలో స్నానమాచరించిన కస్టపరంపరలు తొలగి యిష్టార్దములు పొందవచును. శ్రీ ధుర్గా భోగేశ్వరస్వామి ( స్పటికలింగం ) నకు అభిషేకం చేసిన అమ్మవార్లను దర్సించిన ఉత్తమగతులుంం కలుగునుం. ఇచట గావించిన ఏ సత్కార్యము అయినను కోటి సత్కర్మల ఫలమొసగును ఒక్కమారు భగవన్నామస్మరణ గూవించిన కోటి పర్యాయములు స్మరించిన ఫలము కలుగును. ఆ విధంగా పుణ్యక్క్షెత్రము మహిమ వివరించుట ఎంతైనను ఉంది. పంచమసాపాతము నాచరించిన వ్యక్తియైనను పంచాంరుతంం సెలయేల్లలో స్నానము వలనను, స్వామి సందర్శనము వలనను పుణ్యమూర్తియై భవబంధములు బోయి స్వర్గసుఖమును అనుభవింప అర్హుడగుచున్నాడు. ఈ క్క్షెత్రము స్మరించినంత మాత్రముననే చతుర్వేద పురుషార్దములుం త్వరితగతిన సిద్దించును. భోగేశ్వరా, భోగేశ్వరా, భోగేశ్వరా అని ముమ్మారు ఎవరి నాలుక ఉచరించునో బ్రహ్మహత్యది మహాపాతకములు పలాయనమగునుంం, అట్టివారిపై యముని ప్రభావము ఏ మాత్రము ఉండదు. శివనామము జపించువారు జన్మమృత్యురూపం దుఃఖముల నుండి తరించి మోక్షము పొంది, మృత్యుంజయు లగుదురు. పరమశివునకు ప్రియమైన ఈ భోగేశ్వరక్క్షెత్రమును ప్రాణోత్క్రమణ సమయమును స్మరించువారు, దూరమందున్నవారైనను, పాపియైనను, సర్వపాప విముక్తుడై స్వర్గభోగములు అనుభవింతురు. ఈ క్క్షెత్రములో అశ్వర్దనారాయణ వ్రృక్క్షము, శ్రీ ఆంజనేయస్వామి గుడి ఉంది. ఈ మహా వృక్షమునకు ప్రదక్షిణలు చిసినంత మాత్రమువలననే పాపఖర్మలు తొలగి భూత, ప్రేత పిశాచాల నుండి విముక్తులగుదురు.

సంతానము లేనివారును, వివాహములు కాని వారును, శ్రీ దుర్గాభోగేశ్వరస్వామికి అభిషేకము చేసి, సత్ ఫలితములను పొందిరి. కోరిన కోర్కెలు ఇచ్చువాడు కాబట్టి భొగేశ్వరుడు అని పేరు వచ్చింది. భోగాలు అనుభవిస్తూ భక్తులకు కూడా భోగాలు ప్రసాదించునుగాన భొగేశ్వరస్వామి అని పేరు. ఇక్కడ ముఖ్యంగా 5 కోనేర్లు ఉన్నాయి. పాల కోనేరు పెరు, గు కోనేరు, చక్కెర కోనేరు, నెయ్యి కోనేరు, తేనె కోనేరు అను పంచాంరుత కోనేర్లు విడివిడిగా ఉన్నాయి. ఈ అయిదు కోనేర్లలో స్నానము చెసి, స్పటిక లింగమైన, ఈశ్వరునికి భక్తితో అభిషేకము చేసిన వారికి ముక్తిని ప్రసాదించునుగాక అని దైవప్రాశస్త్యము కలధు. ఈ పంచామృత కోనేరులలో స్నానమాచరించి దైవదర్శనము చేసుకొన్న బ్రహ్మహత్యా పాతకములు నశించును. ఈ క్క్షేత్రమును ఎవరు దర్శింతురో ఈ క్క్షెత్ర మహిమ ఎవరు విందురో, అనుదినము, ఈ క్క్షెత్రమును ఎవరు స్మరింతురో, కీర్తింతురో అట్టివారు వ్యందులు, పూజ్యులు క్రుతార్దులు ముక్తి భోగులు అగుదురు. ఈ శ్రీ దుర్గా భోగేసశ్వరక్క్షెత్ర మాహాత్మ్యమును, స్థిరింతురో, శ్రవనము చేసినవారికి, విన్నవించిన వారికి మహాపుణ్యము సంప్రాప్తించును. ఈ క్క్షెత్రమహిమ విన్నవారికి తెలిపిన వారికి సర్వక్క్షెత్ర దర్శనాదులు కలుగు పుణ్యఫలమంతయు కలుగును.