మంగలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బాలునికి జుత్తు కత్తిరిస్తున్న మంగలి.

కేశఖండన మరియు కేశాలంకరణ చేసే వ్యక్తిని క్షురకుడు లేదా మంగలి అంటారు. సామాన్యంగా వీరిలో నాయీ బ్రాహ్మణ కులస్తులు ఎక్కువగా ఉంటారు. మంగలి వారిలో డోలు కళాకారులు దూదేకులవారిలో సన్నాయి విద్వాంసులు పూర్వం నుండి ప్రసిద్ధి. నాయిబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నాయి బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసింది. వంశపారంపర్యంగా క్షవరాలు చేస్తున్నా పూట గడవడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పెద్ద దుకాణాలు ఏర్పాటు చేసినా రోజు రోజుకు పెరుగుతున్న వస్తువుల ధరలతో కనీసం చేసిన అప్పులకు వడ్డీలు సైతం కట్టడానికి సరిపడ ఆదాయం రావడం లేదని పలువురు వాపోతున్నారు. ఇక చిన్న, చిన్న అంగళ్ళ నిర్వహణ చేస్తోన్న మంగలి వారు చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణకు సరి పోవడంలేదంటున్నారు. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగిన మంగళ వాయిద్యాలు వాయించే మంగలి వారు ఉండాల్సిందే. గెడ్డం చేస్తే రోజుకు వంద రూపాయలు మాత్రమే సంపాదిస్తారు. కాని అందుకు తగిన సరంజామాను కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు వెచ్చించి తీరాల్సిందే. ఫలితంగా కులవృత్తులు మానుకోని ప్రత్యామ్నాయ వృత్తులను వెదుక్కుంటున్నారు. క్షౌరశాల లను నిర్వహించుకునేందుకు బ్యాంకుల ద్వారా కాకుండా నేరుగా బిసి కార్పోరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేయాలని వాయిద్య కళాకారులకు చేయూత నిచ్చి తిరుమల తిరుపతి మరియు ఇతర దేవాలయాలలో వాయిద్యకళాకారులుగా నియమించాలని వృద్ద కళాకారులకు జీవనభృతిని కూడా పంపిణీచేయాలని వీరి కోరికలు.. దేశంలో అనేక ప్రాంతాల్లో ముస్లిములు కూడా నాయీ (క్షౌర) వృత్తి చేస్తున్నారు. కర్ణాటకలో వీరిని హజామ అని వ్యవహరించే వారు. 2011 లో అక్కడి ప్రభుత్వం ఈ పదాన్ని నిషేధించి వీరిని సవితా సమాజ ప్రతినిధులుగా వ్యవహరించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది..

ప్రసిద్ది చెందిన కొందరు మంగలి కులస్థులు[మార్చు]

రాజకీయాలలో నాయీబ్రాహ్మణులు[మార్చు]

అన్ని రాజకీయ పార్టీలు నాయీబ్రాహ్మణులకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలని ఆ సంఘం నాయకులు అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. 2014 జనవరి 21 న హైదరాబాదు సుందరయ్య కళానిలయంలో నాయీ బ్రాహ్మణులకు రాజకీయ సంకల్పం పేరిట తెలంగాణా ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. ఏళ్ళ తరబడి అగ్రవర్ణాలు తమని తీవ్రంగా అణచివేశాయని వారు మండిపడ్డారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మంగలి: ఈ కుల వృత్తి పనివారి సేవలు, వారికి దొరికే ప్రతి ఫలం: ఒక్కో మంగలి కొన్ని పల్లెలను (సుమారు నాలుగైదు పల్లెలను) తన ఇలాక గా వుంటాయి. అది తర తరాలుగా వస్తున్న ఆచారం. అది అతని హక్కు. అది వారసత్యంగా వస్తుంది. వేరొక మంగలి ఆ పల్లెల్లో పని చేయ కూడదు. రెండు మూడు రోజుల కొక సారి, లేదా ప్రత్యేకంగా పిలిపించి నప్పుడు మంగలి ఆ పల్లెలకు వెళ్ళి కావలిసిన వారికి తల గొరగడం, అనగా క్రాపు చేయడం. గడ్డం గీయడం, గోళ్లు తీయడం, తలంటి స్నానం చేయించడం. కాలిలో ముల్లు గుచ్చు కుంటే దాన్ని తీయడం మొదలగు పనులను చేయాలి. ఈ పని చేసి నందుకు అతనికి ప్రతి రోజు ఏమి ఆదాయం ఉండదు. రైతు యొక్క స్థాయిని బట్టి అతనికి మేర ప్రతి ఫలితానికి ఇస్తారు: అనగా వరి కోతలప్పుడు అందరి పని వారితో బాటు అనగా చాకలి, వడ్రంగి, కంసాలి, కుమ్మరి మొదలతు వారితో బాటు ఇతనికి ఒక మోపు వరి, నూర్చిన తర్వాత ఐదు బళ్లల వడ్లు ఇవ్వాలి. ఇది అతనికిచ్చె మేర. ప్రతి రోజు అతని భోజనం ఆ వూర్లోనె జరిగి పోతుంది. పెళ్లి వంటి సుభ కార్యాలప్పుడు మంగలితో చాల సాంగ్యాలుంటాయి. అతను లేనిదే ఆ కార్యక్రమంలో పెద్ద లోటు. దానికి ప్రత్యేకంగా మంగలికి, రైతు స్థాయిని బట్టి సంబావన వుంటుంది. మంగళ వాయిద్యాలు అవసరమై నప్పుడు రైతు ఆ వూరి మంగలికి చెప్పాలి. మిగతా వారిని అతనే సమకూర్చు కుంటాడు. ఇతని అనుమతి లేనిదే ఇతర మంగలతను ఆ వూరి కార్య క్రమాలకు రావడాని వీలు లేదు. అలా రమ్మని రైతులు కూడ పిలవరు. అటు వంటి సందర్భంలో మంగలికి సంభావన రైతు స్థాయిని బట్టి బారిగానె వుంటుంది. కాలిలో ముల్లు గుచ్చు కుంటే దాన్ని మంగలి తీసే వాడు. అలా పుట్టినదే ఈ సామెత: మంగలిని చూసిన గాడిద కుంటు కుంటు నడిచిందట అనగా తనకు ముల్లు గుచ్చుకున్నది అని అర్థం. మంగలి వారు అంట రాని వారు కాదు. మంగలి స్త్రీలకు కూడ పల్లెల్లో స్త్రీలకు సంబందించిన పనులు కొన్ని వుంటాయి. ముఖ్యంగా శుభ కార్యాలప్పుడు ఎక్కువ. ప్రస్తుతం పర్షాభావ పరిస్తితుల్లో రైతులు వ్వవసాయము చేయ నందున పాత పద్దతిలో మేర వంటి సౌకర్యం మంగలికి ఇవ్వడం లేదు. వారి పనులకు కూడ రావడంలేదు. అక్కడక్కడా చిన్న పట్టణాలలో క్షౌర శాలలు పెట్టుకొని కొంత మంది మంగలలు పని చేసు కుంటున్నారు. ఆ నాటి పల్లెల్లో మంగలికి చాకలికి వున్నంత పని, గౌరవం ఈ రోజుల్లో లేదు. రైతుకు ఇలాంటి పని వారికి సమాజంలో విడదీయ రాని అనుబందం ఉండేది.[2]

మూలాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "నాయీ బ్రాహ్మణులకు రాజకీయవాటా కల్పించాలి". eenadu. 2014-1-21. Retrieved 2014-01-21. 
  2. http://www.suryaa.com/showNews.asp?category=4&subCategory=2&ContentId=11354
"http://te.wikipedia.org/w/index.php?title=మంగలి&oldid=1198883" నుండి వెలికితీశారు