మంతెన వెంకటరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంతెన వెంకటరాజు (1904-1968) ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు.

గుంటూరు జిల్లా బాపట్ల తలూకా మంతెనవారిపాలెంలో జన్మించాడు.పదిహేడు సంవత్సరముల వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో జాతీయ కళాశాల చదువు వదిలి వేశాడు. పలు సత్యాగ్రహోద్యమాలలో పాల్గొన్నాడు. పలుమార్లు కారాగార శిక్ష అనుభవించాడు. 1938లో రాజకీయ పాఠశాల నడిపి ఎంతోమంది యువకులకు స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి నూరిపోశాడు. 1934లోనే హరిజనులకు దేవాలయప్రవేశము చేయించాడు. సమీపములోని కర్లపాలెములో వితంతు వివాహాలు, కులంతర వివాహాలు జరిపించాడు. గ్రామాలలో త్రాగునీటికై బావులు త్రవ్వించాడు.

1940 లో కుచిపూడి గ్రామంలో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో కళా వెంకట్రావు, కల్లూరి చంద్రమౌళి, శరణు రామస్వామి చౌదరి వంటి స్వాతంత్ర్య యోద్గులతో కలిసి ప్రారంభించగా వీరికి 300 రూపాయలు జరిమాన, ఆరు నెలలు జైలు శిక్ష విధించారు

1946లో బాపట్ల నుండి శాసనసభ్యునిగా 1962 వరకు కొనసాగాడు. పలువురు ముఖ్యమంత్రులు రాజుగారి ఆశీస్సులు, సలహాలు తీసుకునేవారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి 1962లో 58 సంవత్సరముల వయసులో రాజకీయముల నుండి విరమించాడు. రాజు జీవితము ఎందరికో ఆదర్శప్రాయము.