మంద కృష్ణ మాదిగ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మంద కృష్ణ మాదిగ
Manda Krishna jpg.jpg
జననం 1965 (age 49–50)
ఆంధ్రప్రదేశ్, భారతదేశము
నివాస ప్రాంతం హైదరాబాదు, భారతదేశము
జాతీయత భారతీయుడు
వృత్తి సామాజిక కార్యకర్త మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపకులు

మంద కృష్ణ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘ స్థాపకుడు.వరంగల్ జిల్లా హంటర్‌రోడ్డు శాయంపేట లో జన్మించారు. ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన కృష్ణ మాదిగ వికలాంగుల పక్షాన, హృద్రోగుల పక్షాన, వృద్ధులు, వితంతువుల పక్షాన కూడా పోరాటాలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ దళితులలో జనాభా పరంగా 70 శాతం ఉన్న మాదిగ మరియు మాదిగ ఉపకులలకు 10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు అందితే, 30 శాతం ఉన్న మాల లకు మిగతా 90 శాతం అందుతున్నాయి.దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటోంది. ఈ సమస్యను పరిష్కరించాలి అన్యాయం పాలైన వర్గానికి న్యాయం జరగాలి.బిసిలో ఎబిసిడి వర్గీకరణ వల్లే ఎవరి వాటా వారు అనుభవించగలుగుతున్నారు. వర్గీకరణతో బిసిల్లో చీలిక రానప్పుడు, ఎస్‌సిల్లో వర్గీకరణ జరిగితే చీలిపోతారని ఎలా అంటున్నారు? షెడ్యూల్డ్ కులాల్లో మాదిగల కంటే వెనుకబడిన వారు కూడా ఉన్నారు. రెల్లి , పైడి , పాకి తో పాటు చాలా ఉపకులాలు ఈ 50 ఏళ్ల కాలంలో రిజర్వేషన్ ఫలాలు ఏ మాత్రం పొంద లేదు. వాళ్లను ఏం చేయాలి? రిజర్వేషన్ల పంపిణీలో మొదటి ముద్ద వాళ్లకు పెట్టండి.

న్యాయాన్యాయాలతో ప్రమేయం లేకుండా అంతా మాకే దక్కాలనుకోలేను.మాదిగలు సంఘటితమై గొంతు విప్పిన తరువాతే కదా సమస్య చర్చకొచ్చింది. మరి ఆ ఉపతెగల వాళ్లు గొంతు విప్పే స్థితికి ఎప్పుడు రావాలి? దానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అప్పటిదాకా వారికి రావలసిన వాటా ఏదీ అందకుండానే పోవాలా?రిజర్వేషన్ అంటే ఏమిటో, మానవ హక్కులు అంటే ఏమిటో తెలియని స్థితిలో వాళ్లింకా ఉన్నారు. వాళ్లకు చెందవలసిన అవకాశాల్ని వారికి ఇవ్వకపోతే మన బ్రతుక్కి అర్థం లేదు.స్వార్థం అనేది మనిషిని ఎదుటి వారికి జరిగే అన్యాయాన్ని చూడనివ్వదు. మనము,మన కుటుంబం, మన వర్గం తప్ప మరి దేన్నీ పట్టించుకోనివ్వదు.అన్యాయం జరిగిన వర్గం వైపు ఉండాలనే నిజాయితీ ఉంటే, ఎదుటి వారికి జరిగిన అన్యాయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.అదే మనిషికి స్థిరమైన నడక నేర్పుతుంది.(ఆంధ్రజ్యోతి 9.8.2013)

బయటి లింకులు[మార్చు]

మాదిగ లకు ఆత్మ గౌరవం తెచ్చిన ఉద్యమ కారుడు, జాతి కోసం దేని కైనా సిద్దపడే వాడు. నూతన పంథా లో ఉధ్యమాలను నిర్మిస్తుంటాడు.