మగ్దూం మొహియుద్దీన్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మగ్దూం మొహియుద్దీన్ (Makhdoom Mohiuddin) (ఉర్దూ: مخدوم محی الدین ), ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూకవి హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యం, విద్యాభ్యాసం
ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ జిల్లా ఆందోల్ లో 1908 ఫిబ్రవరి 4 న జన్మించాడు. ఆయన పూర్తిపేరు మహ్మద్ మగ్దూం మొహియుద్దీన్ హుజ్రీ. వీరి పూర్వీకులది ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్. ఆయన తండ్రి నిజాము ప్రభుత్వంలో సూపరింటెండెంటు గా పనిచేసేవాడు. మగ్దూం చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో మగ్దూం తన బాబాయి వద్ద పెరిగాడు. ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషను సంగారెడ్డిలోను చదివాడు. మఖ్దూం తండ్రి పరమ భక్తుడు- మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్. తల్లి- ఉమ్దా బేగం. భర్త మరణానంతరం ఆమె వేరే వివాహం చేసుకుంది. పినతండ్రి బషీరుద్దీన్ పెంచాడు. మఖ్దూం విద్యాభ్యాసం ఆందోల్ నుండి హైదరాబాద్ చేరి 1929లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తయింది. ఇంటా బయటా విరివిగా పుస్తకాలు చదవటం, సాహిత్య అధ్యయనాలు, తాత్విక విషయాల పరిశోధన మఖ్దూం నిత్యకృత్యాలైనాయి.
[మార్చు] ఉద్యమాలు
నిజాము కు వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ పోరాటం లో కీలకపాత్ర పోషించాడు.
[మార్చు] సాహిత్యము
ప్రముఖ అధ్యాపకుడు, ఉర్దూ కవి. 'షాయరే ఇంక్విలాయ్' (ఉద్యమ కవి, విప్లవ రచయిత) బిరుదాంకితుడు. కవియేగాక నాటక కర్త, గాయకుడు మరియు నటుడు కూడా. ఇతని గజల్ లు, పాఠ్యకాంశాలలోను, సినిమాలలోనూ ఉపయోగించారు.
- 'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్(గేయం) సుప్రసిధ్ధి.
- 1944లో సుర్ఖ్ సవేరా (అరుణోదయం),
- 1961లో గుల్ ఎ తర్ (తాబీపూవు),
- 1966లో బిసాతె రక్స్ (నాట్య వేదిక) పేర మూడు కవితా సంపుటాలను రచించినాడు.
- 1944-51 మధ్యకాలంలో 'తెలంగాణ' అనే కవిత రాశాడు.
మెట్రిక్యులేషన్ తరువాత మఖ్దూం ట్యూషన్లు చెప్పినాడు. చిత్రపటాలు విక్రయించాడు. పత్రికలకు వ్యాసాలు రాశాడు. కొన్నాళ్లు హైదరాబాద్ రాష్ట్ర దఫ్తర్‌లో గుమాస్తాగా ఆ తరువాత హైదరాబాదులోని సిటి కాలేజీలో ఉపాధ్యాయవృత్తిలో చేరాడు.1941లో హైదరాబాద్ ఉర్దూ అభ్యుదయ రచయితల సంఘ స్థాపనకు పూనుకున్నాడు మఖ్దూం. 1944లో అఖిల భారత అభ్యుదయ రచయితల సమావేశాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసినాడు.
[మార్చు] రాజకీయాలు
మఖ్దూం కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు కార్యకర్త, శాసన మండలి సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి భోజనం చేసే దస్తర్‌ఖాన్ల గురించి కల గన్నాడు మఖ్దూం. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసి అమరుడైనాడు. కమ్యూనిస్టు అయిన మఖ్దూం. మతాన్ని దూషించలేదు అనుసరించలేదు. 25.08.1969 తేదీన ఆయన చనిపోయాడు.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- A poet remembered, The Hindu, 29 January 2003
- Makhdoom a people’s poet: Abid Hussain, The Hindu, 8 February 2008
- The forgotten romantic, The Hindu 5 February 2008
- Writers to hold rally on Urdu poet The Times of India
|
|||||||
|
|||||