మణిరత్నం

వికీపీడియా నుండి

మణిరత్నం ప్రముఖ తమిళ చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన ప్రముఖ కధానాయక సుహాసిని మణిరత్నం భార్య. తెలుగులో ఈయన దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా గీతాంజలి. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించబడ్డాయి. నాయకుడు, రోజా, బొంబాయి, గీతాంజలి మొదలయినవి మణిరత్నం ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే.

మణిరత్నం ముంబై లోని జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీయే చేశాడు. ఆయన తండ్రి రత్నం అయ్యర్. వీనస్ స్టూడియో కి అధినేత. ఆయన మొదటి సినిమా పల్లవి అనుపల్లవి అనే కన్నడ సినిమా. సుహాసిని మణిరత్నం దంపతులకు నందన్ అనే కుమారుడు ఉన్నాడు. అతను ప్రస్తుతం బ్రిటన్ లోని ఎడింబరో లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఆయన తీసిన సినిమాల్లో ఆయనకు బాగా నచ్చింది ఇద్దరు. అందులో మోహన్‌లాల్ నటనకు గాను జాతీయ బహుమతి వస్తుందని ఆయన అనుకున్నాడు. కానీ రాకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డాడు. [1]

[మార్చు] మూలాలు

  1. ఈనాడు ఆదివారం అనుబంధం, అక్టోబరు 24, 2010
"http://te.wikipedia.org/w/index.php?title=మణిరత్నం&oldid=665521" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు