మతము
వికీపీడియా నుండి
నిర్వచనము: మరణానంతరం సకల చరాచర జగత్తు కు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలు గా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గము లో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానాలు.
ప్రధాన మతములు :
విషయ సూచిక |
[మార్చు] ఇబ్రాహీం (అబ్రహామ్) భావనల పై ఏర్పడిన మతములు
- ప్రధాన వ్యాసం: ఇబ్రాహీం మతము
ఇబ్రాహీం భావనల ఆధారంగా ఏర్పడిన మతము. ప్రధానంగా ఇది ఏకేశ్వరోపాసక మతము. బహువిగ్రహారాధన, బహుఈశ్వరోపాసన కలిగిన ఆకాలంలో ఇదో క్రొత్త సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని (ఏకేశ్వరోపాసన) ప్రారంభించిన ఇబ్రాహీం ను 'హనీఫ్' అని అంటారు. ఇతని మార్గంలో నడచి అనేక మతాలు వెలిసి వెలసిల్లుతున్నాయి. వీటికి ఉదాహరణ జుడాయిజం, క్రైస్తవ మతము మరియు ఇస్లాం మతం.
[మార్చు] జుడాయిజం
యూద మతాన్నే జుడాయిజమ్ అని అంటారు. దీనిని అరబ్బీ మూసా (మోషే లేక మోజెస్ లేక Moses) ప్రవక్త చే క్రమబద్ధీకరించబడిన జీవనవిధానము. వీరు భగవంతుణ్ణి యెహోవా లేదా 'యావే' అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంధము తోరాహ్ (అరబ్బీ: తౌరాత్). ఈ మతాన్ని అవలంబించేవారిని 'యూదులు' లేక 'యహూద్' లేక 'Jews' అంటారు. వీరి పవిత్ర క్షేత్రం జెరూసలెం.
[మార్చు] క్రైస్తవ మతము
- పౌలు తో ప్రారంభమై ఏసుక్రీస్తు దేవుడనీ, దేవుని కుమారుడనే విశ్వాసాలతో అభివృద్ది చేయబడిన జీవితవిధానము. ఈ మతాన్ని అవలంబించేవారిని 'క్రైస్తవులు' లేక Christians లేక అరబ్బీలో 'నసారా' అంటారు. వీరి పవిత్ర గ్రంధం 'బైబిల్' లేక 'బైబిలు' లేదా అరబ్బీలో 'ఇంజీల్' అంటారు. వీరి పవిత్ర క్షేత్రం జెరూసలెం.
[మార్చు] ఇస్లాం మతము
- ఆదమ్ తో ప్రారంభమై ఇబ్రాహీం, మూసా, ఈసా, ముహమ్మద్ లాంటి ఎందరో ప్రవక్తల ప్రవచనముల తో క్రమబద్ధీకరించబడిన జీవన విధానము. ఈ మతాన్ని అవలంబించేవారిని 'ముస్లిం'లు అంటారు. వీరు భగవంతుణ్ణి అల్లాహ్ అనే పేరుతో పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంధం ఖురాన్. వీరి పవిత్ర క్షేత్రం మక్కా లోని కాబా గృహం.
[మార్చు] ధర్మము, కర్మ అనే పునాదుల పై ఏర్పడిన భారతీయ మతములు
- ప్రధాన వ్యాసం: భారతీయ మతములు
[మార్చు] హిందూ మతము
- ప్రధాన వ్యాసం: హిందూ మతము
- అతి ప్రాచీన మైనది. అనేక మంది ఋషులు ప్రవచించిన విధానము.
[మార్చు] బౌద్ధ మతము
- ప్రధాన వ్యాసం: బౌద్ధ మతము
- గౌతమ బుద్ధుడు ప్రవచించిన విధానము. ధార్మిక గ్రంధము త్రిపీటకము.
[మార్చు] జైన మతము
- ప్రధాన వ్యాసం: జైన మతము
- వర్దమానమహవీరుడు ప్రవచించిన విధానము.
[మార్చు] సిక్కు మతము
- ప్రధాన వ్యాసం: సిక్కు మతము
- గురుగోవింద సింగు ప్రవచించిన విధానము. ధార్మిక గ్రంధము గ్రంధా సాహెబ్ లేదా 'ఆది గ్రంధ్'.
[మార్చు] తూర్పు దేశాలలోని మతములు
టావో మతములు : టావో అనునది చైనా పదజాలము. టావో అనే కాంసెప్ట్ పై ఆధారపడిన మతములు : వీటిలో టావోఇజం, షింటోయిజం, కోండోగ్యో, కావోడైజమ్ మరియు యుగిండావో తత్వములు. కన్ఫ్యూషియానిజం కూడా ప్రజలు అవలంబించే మతము.
[మార్చు] ఇరాన్ లోని మతములు
- జొరాస్ట్రియన్ మతము : ప్రాచీన పర్షియా (నేటి ఇరాన్) లో జొరాష్టర్ లేదా జరాతుష్ట్ర స్థాపించిన మతము. వీరు భగవంతుణ్ణి అహూరా మజ్దా అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంధం జెండ్ అవెస్తా, వీరి దేవాలయాన్ని 'అగ్ని దేవాలయం' లేదా 'ఫైర్ టెంపుల్' లేదా 'అగియారీ' అని అంటారు. ఈ మతాన్నే 'పార్శీ మతము' అని కూడా అంటారు.
- యజ్దానీ మతము
[మార్చు] షింటో మతము
[మార్చు] బహాయి విశ్వాసము
- ప్రధాన వ్యాసం: బహాయి విశ్వాసము
- బహావుద్దీన్ స్థాపించిన విశ్వాసము.
''''== వర్గీకరణ ==
ప్రసిద్ధ మతముల జనాభా విభజన క్రింది పట్టికలో ఇవ్వబడినది:
| సమూహం పేరు | మతము పేరు | అవలంబీకుల సంఖ్య | ప్రారంభ తేదీ | విస్తరణ ప్రధాన ప్రాంతాలు |
|---|---|---|---|---|
| ఇబ్రాహీం భావనల మతములు 3.4 బిలియన్లు |
జుడాయిజం | 14 మిలియన్లు | క్రీ.పూ. 1300 | ఇస్రాయెల్ మరియు యూద సమూహ ప్రాంతాలు, ప్రధానంగా అ.సం.రా. లోనూ యూరోప్ లోనూ నివసిస్తున్నారు. |
| క్రైస్తవ మతము | 2.1 బిలియన్లు | క్రీ.శ. మొదటి శతాబ్దం | ప్రపంచమంతటా, ఉత్తర ఆఫ్రికా, వాయువ్య ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పం, మధ్య ఆసియా, తూర్పు ఆసియా మరియు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలను మినహాయించి. | |
| ఇస్లాం మతం | 1.5 బిలియన్లు | క్రీ.శ. 7 వ శతాబ్దం / హి.శ.పూర్వం 10 | మధ్య ప్రాచ్యము, ఉత్తర ఆఫ్రికా, మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, పశ్చిమ ఆఫ్రికా, భారత ఉపఖండం, మలయా ద్వీపసమూహం తూర్పు ఆఫ్రికా, బాల్కన్ ద్వీపకల్పం, రష్యా, యూరప్ మరియు చైనా. | |
| బహాయి విశ్వాసము | 5 మిలియన్లు | క్రీ.శ. 19 శతాబ్దం | ప్రపంచమంతటా కలరు. కానీ జనాభా సమ్మర్ధాలు లేవు. | |
| భారతీయ మతములు 1.4 బిలియన్లు |
హిందూ మతము | 900 మిలియన్లు | స్థాపకులు లేరు. అతి ప్రాచీన మతము. | భారత ఉపఖండం, ఫిజీ, గయానా మరియు మారిషస్ |
| బౌద్ధ మతము | 376 మిలియన్లు | ఇనుప యుగం (క్రీ.పూ. 1200–300) | భారత ఉపఖండం, తూర్పు ఆసియా, ఇండోచైనా, రష్యాలోని పలు ప్రాంతాలు. | |
| సిక్కు మతము | 25.8 మిలియన్లు | క్రీ.శ. 15వ శతాబ్దం. | భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్రికా, కెనడా, అ.సం.రా., యునైటెడ్ కింగ్ డం. | |
| జైన మతము | 4.2 మిలియన్లు | ఇనుప యుగం (క్రీ.పూ. 1200–300) | భారతదేశం, మరియు తూర్పు ఆసియా | |
| దూర తూర్పు మతములు 500 మిలియన్లు |
టావోఇజం | వివరాలు తెలియవు | క్రీ.పూ. 722-481 | చైనా మరియు చైనా ప్రాంతాలు |
| కన్ఫ్యూషియానిజం | వివరాలు తెలియవు | క్రీ.పూ. 722-481 | చైనా, కొరియా, వియత్నాం మరియు చైనా-వియత్నాం ప్రాంతాలు | |
| షింటో | 4 మిలియన్లు | స్థాపకులు లేరు | జపాన్ | |
| కావోడాయిజమ్ | 1-2 మిలియన్లు | క్రీ.శ. 1925 | వియత్నాం | |
| కోండోగ్యో | 1.13 మిలియన్లు | క్రీ.శ. 1812 | కొరియా | |
| యిగువాండావో | 1-2 మిలియన్లు | క్రీ.శ. 1900 | తైవాన్ | |
| చైనా జానపద మతము | 394 మిలియన్లు | స్థాపకులు లేరు, ఇది టావోఇజం, కన్ఫ్యూషియానిజం, మరియు బౌద్ధమతము యొక్క సమ్మేళణం. | చైనా | |
| వివిధ జాతులు/తెగలు 400 మిలియన్లు |
||||
| భారతీయ తెగల మతము | 300 మిలియన్లు | స్థాపకులు లేరు | భారతదేశం, ఆసియా | |
| ఆఫ్రికా సాంప్రదాయిక మతములు మరియు ఆఫ్రికా ప్రాంతీయ మతములు | 100 మిలియన్లు | స్థాపకుల వివరాలు తెలియవు | ఆఫ్రికా, అమెరికాలు |
పైనుదహరించిన ఏ మతములోనూ గుర్తింపు పొందక ప్రత్యేక సమూహాలుగా నివసిస్తున్న సమూహాలు. అఢెరాంట్స్.కామ్, మతములు :
- జూచే (ఉత్తర కొరియా): 19 మిలియన్లు
- స్పిరిటిజం (సరైన నియంత్రణ లేని మతము): 15 మిలియన్లు
- నవీన పాగన్లు: 1 మిలియన్
- యూనిటేరియన్-విశ్వజనీయతత్వము: 800,000
- రాస్త్రఫారియానిజం: 600,000
- సైంటాలజీ: 500,000
|
|||||||||||||||||
''''
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు