Coordinates: 13°52′26″N 75°33′32″E / 13.87389°N 75.55889°E / 13.87389; 75.55889

మత్తూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మత్తూరు
గ్రామం
మత్తూరు వద్ద తుంగ నది
మత్తూరు వద్ద తుంగ నది
Nickname: 
సంస్కృత గ్రామం
మత్తూరు is located in Karnataka
మత్తూరు
మత్తూరు
Location in Karnataka, India
Coordinates: 13°52′26″N 75°33′32″E / 13.87389°N 75.55889°E / 13.87389; 75.55889
దేశం India
రాష్ట్రంకర్ణాటక
జిల్లాశివమొగ్గ జిల్లా
Government
 • Bodyగ్రామ పంచాయితీ
భాషలు
 • అధికారసంస్కృతం, కన్నడం
Time zoneUTC+5:30 (IST)
దగ్గర్లోని పట్టణంశివమొగ్గ

మత్తూరు, కర్ణాటక, షిమోగా జిల్లా లోని గ్రామం. శివమొగ్గ పట్టణానికి 8 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ఊరి జనాభా 5,000 మందిలో అత్యధికులు సంస్కృత భాషను ఎక్కువ ఉపయోగిస్తుండటం వలన ఈ గ్రామం సంస్కృత గ్రామంగా గుర్తింపు పొందింది.[1] ఈ ఊరి వారికి ఇతర భాషలు వచ్చినా సంస్కృతంలో మాట్లాడటానికే మొగ్గు చూపిస్తారు. ఇక్కడి స్కూళ్లలో ప్రతి పాఠ్యాంశమూ సంస్కృతంలోనే బోధిస్తారు. అలాగని అక్కడి వాళ్లందరికీ సంస్కృతం తప్ప మరొక భాష రాదేమో, వారికి నాగరికత తెలియదేమో అనుకోటానికి వీల్లేదు, ఎందుకంటే అనేక మంది యువకులు ఈ గ్రామంలో సంస్కృతంలో పాఠాలు చదివి, ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారు. ఇక్కడి ముస్లిములు కూడా సంస్కృతమే మాట్లాడతారు. దాదాపు 500 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఇదే పరంపర కొనసాగుతుంది..[2][3]

మత్తూరులో రామాలయం, శివాలయం, సోమేశ్వరాలయం, లక్ష్మీకేశవాలయం ఉన్నాయి.

మత్తూరుకు కవల గ్రామం లాంటి హొసహళ్ళికి కూడా మత్తూరు లక్షణాలు ఉన్నాయి. హొసహళ్ళి తుంగ నదికి ఆవలి ఒడ్డున ఉంది.ఈ రెండు గ్రామాలనూ జంటగా ప్రస్తావిస్తూంటారు.[4]

మత్తూరు, హొసహళ్ళి రెండు గ్రామాల ప్రజలు గమక కళా ప్రక్రియను అనుసరిస్తారు. ఈ రెండు గ్రామాలూ రోజువారీ వ్యవహారంలో సంస్కృతం మాట్లాడే అరుదైన గ్రామాలు.[5]

మూలాలు[మార్చు]

  1. "This village speaks gods language". Retrieved 25 November 2016.
  2. Omkar Nath Koul; L. Devaki; Central Institute of Indian Languages; Unesco (2000). Linguistic heritage of India and Asia. Central Institute of Indian Languages. p. 247.
  3. Arvind Sharma (2005). New focus on Hindu studies. D.K. Printworld (P) Ltd. p. 65.
  4. Rao, Subha J (2 March 2008). "Keeping Sanskrit alive". The Hindu. Retrieved 13 January 2017.
  5. "Sanskrit village set to glow anew". Retrieved 25 November 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=మత్తూరు&oldid=3864840" నుండి వెలికితీశారు