మధురకవి

వికీపీడియా నుండి

మధురకవి
జన్మస్థలం తిరుక్కోలూరు
జన్మ నక్షత్రము చిత్ర

మధురకవి 6వ శతాబ్దము నుండి 9వ శతాబ్దముల మధ్య దక్షిణ భారతదేశములో జీవించిన వైష్ణవ సాధువు మరియు కృతికర్త. ఈయన నాలాయిరుమ్ (నాలుగువేల) దివ్యప్రబంధములో తన గురువైన నమ్మాళ్వారును స్తుతిస్తూ 11 పాశురాలను రచించాడు. ఈయన పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడుగా భావిస్తారు. మధురకవి నమ్మాళ్వారు కంటే ముందే పుట్టినందువలన ఈయన్ను నమ్మాళ్వార్ లేవకముందే, సూర్యుడు ఉదయించేముందు స్తుతిస్తారు. సాంప్రదాయ కథలలో ఈయన్ను బాగా చదువుకున్న, సంగీతజ్ఞానమున్న, లోకం తిరిగిన బ్రాహ్మణునిగా చెబుతారు. ఈయన నమ్మాళ్వారు రచనలకు సంగీతాన్ని సమకూర్చాడు.

[మార్చు] తొలి జీవితం

మధురకవి ఆళ్వారు, ఆళ్వారు తిరునగరి వద్ద తిరుక్కోలూరు అనే దివ్యదేశంలో చైత్రమాసంలో చిత్రా నక్షత్రములో ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ దివ్యదేశములో పెరుమాళు వైతమానిధి (అనంత ధనరాశి భండారము)గా వెలశాడు.

మధురకవి ఆళ్వారు వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అంతేకాక తమిళ, సంస్కృత భాషలలో పండితుడు. ఈయన భగవంతుని స్తుతిస్తూ అనేక కీర్తనలు రచించాడు. జీవితములోని ఒక దశలో ఈయన అన్ని సంసారబంధాలను త్యజించి, మోక్షసాధనకై కృషిచేశాడు. ఈ ప్రయత్నములో భాగంగానే ఉత్తరాదిలోని దివ్యదేశాలైన అయోధ్య, మథుర మొదలైన ప్రదేశాలను సందర్శించాడు.[1]

[మార్చు] మూలాలు


ఆళ్వారులు ఫైలు:Alvaarulu.jpg
సరోయోగి (పొయ్ గయాళ్వార్) | భూత యోగి (పూదత్తాళ్వార్ ) | మహాయోగి (పేయాళ్వార్) | భట్టనాథులు (పెరియాళ్వార్ ) | భక్తిసారులు (తిరుమళిశయాళ్వార్) | కులశేఖరుడు (కులశేఖరాళ్వార్) | మునివాహనులు (తిరుప్పాణాళ్వార్) | భక్తాంఘ్రిరేణువు (తొండరడిప్పొడియాళ్వార్) | పరకాలయోగి (తిరుమంగయాళ్వార్) | మధురకవి (ఆళ్వారుక్కు అదియాన్ ) | శఠకోపముని (నమ్మాళ్వార్) | గోదాదేవి
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు