మనసున మనసై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి (1964) సినిమా లోనిది.

ఈ పాటకి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారి సాహిత్యానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యలు నటించారు. ఈ సన్నివేశం నాగార్జున సాగర్ నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడింది.

ఈ పాటను ఆధారం చేసుకుని తెలుగు సాహిత్యంలో కొన్ని కథలు వ్రాయబడ్దాయి. అంపశయ్య నవీన్ ఇదే పేరుతో ఒక నవల రాశారు. అదే "షరతులు లేని ప్రేమ" (అన్ కండిషనల్ లవ్) "నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు" రూపంలో తొలిసారిగా తెలుగు సినీ గీతాల్లో ప్రతిపాదించబడింది.

పాట[మార్చు]

పల్లవి :

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

చరణం: 1

ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...

చీకటి మూసిన ఏకాంతములో.....

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

చరణం: 2

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు

నేనున్నానని నిండుగ పలికే

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

చరణం: 3

చెలిమియె కరువై.. వలపే అరుదై

చెదిరిన హృదయమే శిలయై పోగా...

నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే...

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము.

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

బయటి లింకులు[మార్చు]