మన్మథుడు

వికీపీడియా నుండి
మన్మథుడు
Kamadeva1.jpg
హిందువుల కామ దేవుడు
దేవనాగరి काम देव
తమిళ లిపి காம தேவன்
సంప్రదాయభావం ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు
ఆవాసం Ketumala-varsa
మంత్రం కామ గాయత్రి[1]
ఆయుధం చెఱుకు విల్లు మరియు పూల బాణం
భార్య రతి, ప్రీతి
వాహనం చిలుక

మన్మథుడు హిందూ పురాణాలలొ ప్రేమకు సంబంధించిన దేవుడు. ఇతని భార్య రతీదేవి.

విషయ సూచిక

పురాణాలలో మన్మథుడు [మార్చు]

మన్మథునికి శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్య పురాణము మరియు శివ పురాణములలో తెలుపబడినవి.[2], [3].

ఇంద్రుడు మరియు ఇతర దేవతలను తారకాసురుడు బాధించసాగెను. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.

వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు కార్తికేయుడు తారకాసురున్ని వధిస్తాడు.[4]

శివునిపై మదన బాణాన్ని సంధిస్తున్న కామదేవుడు.

స్వరూపం [మార్చు]

మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు చూపుతారు. ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.[5][6] ఈ పువ్వులు: అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. ప్రాచీనమైన మన్మథుని విగ్రహం మథుర సంగ్రహాలయంలో భద్రపరచబడినది.

రతి మరియు ప్రీతి భార్యలతో కామదేవుడు.

ఆరాధన [మార్చు]

  • కామ గాయత్రి : "ఓం కామ దేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్"

ఇతర పేర్లు [మార్చు]

మూలాలు [మార్చు]

  1. (1958) History of Dharmaśāstra. 
  2. Daniel Ingalls, (1968). Sanskrit poetry, from Vidyākara's "Treasury". Harvard University Press,. ISBN 0674788656. , p.58
  3. Klaus Klostermaier, (2000) Hinduism: A Short History. Oxford: One World Publications.
  4. Wendy Doniger O'Flaherty, (1975) Hindu Myths: A Sourcebook Translated from the Sanskrit. London: Penguin Books, p.157-159 [1]
  5. "A study of Kamadeva in Indian story literature". Retrieved on 2008-07-06. 
  6. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Sanford2002 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=మన్మథుడు&oldid=812795" నుండి వెలికితీశారు