మన్మథుడు (సినిమా)
వికీపీడియా నుండి
| మన్మథుడు (2002) | |
| దర్శకత్వం | కె. విజయ భాస్కర్ |
|---|---|
| నిర్మాణం | అక్కినేని నాగార్జున |
| కథ | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
| చిత్రానువాదం | కె.విజయ భాస్కర్ |
| తారాగణం | అక్కినేని నాగార్జున, సోనాలి బెంద్రే, , చంద్రమోహన్, సునీల్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, సుధ, బాలయ్య, అన్షు, |
| సంగీతం | సాలూరి కోటి |
| నృత్యాలు | రాజు సుందరం, రాజశేఖర్, శంకర్ |
| గీతరచన | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
| సంభాషణలు | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
| ఛాయాగ్రహణం | రసూల్ ఎల్లోర్ |
| కళ | వి. శ్రీనివాస రాజు |
| కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
| నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ స్టూడియోస్ |
| భాష | తెలుగు |
విషయ సూచిక |
కథ [మార్చు]
తన స్వంత ప్రకటనా సంస్థలో అభిరాం (నాగార్జున) నిర్వాహకుడు. ఆడజాతి మొత్తం మోసపూరితమైనది అని అసహ్యించుకొంటూ ఉంటాడు. ఆ సంస్థ అధినేత అయిన తన బాబాయ్ (తనికెళ్ళ భరణి) సహ నిర్వాహాకురాలిగా హారిక (సోనాలీ బింద్రే) ని నియమిస్తాడు. స్త్రీ ద్వేషి అయిన అభి హారికని ముప్పు తిప్పలు పెడతాడు. విసిగి పోయిన హారిక రాజీనామా చేస్తుంది. తనికెళ్ళ భరణి అభి గతాన్ని వివరిస్తాడు. తను ప్రేమించిన అమ్మయి (అన్షు) తమకి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని తెలిస్తే తట్టుకోలేడని తన కుటుంబ సభ్యులు ఆమె వేరే పెళ్ళి చేసుకొందని అబద్ధం చెప్పటంతో అభి స్త్రీ ద్వేషి గా మారతాడు. నిజం తెలిసిన అభి ఎలా స్పందించాడు? హారిక ఏమయ్యిందన్నదే తర్వాతి కథ.
పాత్రలు-పాత్రధారులు [మార్చు]
| నటి / నటుడు | ధరించిన పాత్ర |
|---|---|
| అక్కినేని నాగార్జున | అభిరాం |
| సోనాలి బెంద్రే | హారిక |
| చంద్రమోహన్ | మహేశ్వరి మామయ్య |
| తనికెళ్ళ భరణి | ప్రసాద్ |
| బ్రహ్మానందం | లవంగం |
| బాలయ్య | అభిరాం తాతయ్య |
| అన్షు | మహేశ్వరి |
| సునీల్ | బంకు శీను |
| రంగనాథ్ | హారిక తండ్రి |
| సుధ | లక్ష్మి, ప్రసాద్ భార్య |
| ధర్మవరపు సుబ్రమణ్యం | ప్రొఫెసర్ బాలసుబ్రమణ్యం |
| మెల్కోటే | సుందర్ |
| మాస్టర్ తనీష్ | హారిక తమ్ముడు |
ఈ చిత్రంలోని సంభాషణలు [మార్చు]
- నువ్వు చూస్తున్న అభి అభి కాదమ్మా, వాడు వేరు, వాడి ప్రేమ ఒక సముద్రం, వాడి జాలి ఒక వర్షం, వాడి కోపమొక ప్రళయం
- నాగ్: ముందు మీరావిడని ప్రేమించారా? లేక ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా?
- బ్రహ్మీ: ముందు తను నన్ను ప్రేమించింది... తర్వాత నేను తనని ప్రేమించాల్సి వచ్చింది.
విశేషాలు [మార్చు]
- ఈ చిత్రం లో నాగ్ వేసిన షార్ట్ కుర్తాలు, మన్మథుడు షర్ట్ లు గా పేరొందాయి.
- 83 రోజుల ప్రదర్శనలో ఈ సినిమా 13.5 కోట్లు వసూలు చేసింది. [1]
- మెల్ గిబ్సన్ సినిమా What women want లోని చాలా సన్నివేశాలు ఈ సినిమాలో అనుకరింపబడినాయి - ఆఫీసులో ఒకమ్మాయిని ఆత్మహత్యనుండి కాపాడడం, ఇతరుల సంభాషణలను వినడం (మనసులో మాట తెలుసుకోవడం), ఇంటివద్ద హీరో లిప్‌స్టిక్ ను వాడడానికి ప్రయత్నించడం.
- ఇందులో అభి (నాగ్) వాడిన ఎర్రని స్పోర్ట్స్ కారు 1992 Nissan 300sx.
పాటలు [మార్చు]
- అందమైన భామలు, లేత మెరుపు తీగలు - దేవిశ్రీ ప్రసాద్ - రచన: భువనచంద్ర
- గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుగుస్తుంది - వేణు, సుమంగళి - రచన: సిరివెన్నెల
- చెలియ చెలియా - షాన్ - రచన: సిరివెన్నెల
- డోన్ట్ మ్యారీ బి హ్యాపీ - బాలు - రచన: సిరివెన్నెల
- నా మనసునే వీడకే చైత్రమా - బాలు, చిత్ర - రచన: సిరివెన్నెల
- నేను నేనుగా లేనే