మన దేశం
వికీపీడియా నుండి
| మన దేశం (1949) | |
చందమామ పత్రికలో మనదేశం ప్రకటన |
|
|---|---|
| దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్ |
| నిర్మాణం | కృష్ణవేణి మరియు ఆమె భర్త మీర్జాపురం రాజా |
| కథ | సముద్రాల రాఘవాచార్య శరత్ బెంగాలీ నవల ఆధారంగా |
| తారాగణం | కృష్ణవేణి, నాగయ్య, నారాయణరావు, ఎన్.టి.రామారావు, రేలంగి, బాలసరస్వతి, వంగర, రామనాధశాస్త్రి, కాంచన్, హేమలత, లక్ష్మీకాంతం |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, జిక్కి, ఎమ్.ఎస్. రామారావు, పి.లీల |
| గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
| సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
| ఛాయాగ్రహణం | ఎమ్.ఎ. రెహమాన్ |
| నిర్మాణ సంస్థ | ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్ |
| విడుదల తేదీ | నవంబర్ 24, 1949 |
| నిడివి | 172 నిముషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
మన దేశం, 1949లో విడుదలైన ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ఎన్.టి. రామారావు మొదటి సినిమా. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. భారత స్వాతంత్ర్య సంగ్రామం ఈ చిత్ర కధకు నేపధ్యం.
విషయ సూచిక |
విశేషాలు [మార్చు]
- ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఎన్.టి. రామారావు మరియు ఎస్.వి.రంగారావు తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని పి. లీల కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం నేపధ్యగానంలో ప్రవేశించింది. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు.
- సినిమా కధనంలో బుర్ర కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలు, బొమ్మలాటలు వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను వాడారు.
- సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్ర్యం తరువాత దిగజారిన విలువలను చూపౌఇంచారు.
- ఇది బెంగాలీ కధ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కధలుగా వెలువడి విజయవంతమయ్యాయి.
కధ [మార్చు]
పాటలు [మార్చు]
- ఏషా మధ్యేకాంచితంనో: రాజ్యం భోగ సుఖానిచ (శ్లోకం) - ఘంటసాల
- ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
- కళ్ళ నిన్ను చూచినానే పిల్లా ఒళ్ళు ఝల్లుమన్నదే - ఘంటసాల,జిక్కి - రచన: సముద్రాల
- చెలో చెలో చెలో చెలో రాజా చెలో చెలో చెలో - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
- జయహే జయహే - ఘంటసాల,కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
- జడియకురా ధీరా సాత్వికరణ విజయము నీదేరా - నాగయ్య - రచన: సముద్రాల
- జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల
- జయ జననీ పరమపావనీ జయ జయ భారతజనని- ఘంటసాల,కృష్ణవేణి - రచన: సముద్రాల
- దారులు కాచే రాజుసేనలు దాసి (బుర్రకధ) - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
- నిర్వేదమేలా కన్నీరదేల భరతజాతికపూర్వపర్వము ఈవేళ - నాగయ్య - రచన: సముద్రాల
- భారత యువకా కదలరా భారతయువతా - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
- మరువలేనురా నిను నేను మరువలేనురా ఓ పంచదారవంటి - జిక్కి - రచన: సముద్రాల
- మావా నందయ మావా అందుకో నన్నందుకో నా అందాలే - జిక్కి - రచన: సముద్రాల
- మాటా మర్మము నేర్చినవారు మనసు - ఘంటసాల,కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
- వెడలిపో తెల్లదొరా మాదేశపు ఎల్ల దాటీ వెడలిపో - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
- వైష్ణవ జనతో తేనే కహియే పీడపరాయీ (గుజరాతీ) - ఘంటసాల - రచన: నరసింహ మెహతా
మూలాలు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)