మరియమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మరియమ్ [lower-alpha 1] ఇమ్రాన్, లేదా మరియమ్మ, మేరీమాత (Mother Mary) హన్నా బిన్తె ఫాఖూజ్ అనే దావూద్ వంశ దంపతులకు పుట్టి బైతుల్ ముఖద్దస్ మస్జిద్ కి దైవ సేవకై అప్పగించబడిన పవిత్రురాలు. జకరియా ప్రవక్త ఆమెకు సంరక్షకుడిగా ఉండి అల్లాహ్ వాక్యాలను ఉపదేశించాడు. అగోచర విషయాలు మరియమ్ కు అల్లాహ్ తెలియజేసినట్లు ఖురాన్ లోని ఆలె ఇమ్రాన్ :42-47 లో ఉంది. ఈమెకు స్వర్గ ఫలాలు కాలంకానికాలంలో కూడా ఆహారంగావచ్చాయి. దేవుని వాక్శక్తి ద్వారా గర్భవతియై ఈసా ప్రవక్తను కన్నది. ఈమె పేరుతో ఖురాన్ లో 19 వ సూరా ఉంది.

ఇస్లాం లో మరియమ్[మార్చు]

ఖురాన్ లో అల్లాహ్ స్వయంగా "మరియమ్"ను ప్రశంసిస్తాడు.ఇస్లాం మతం మరియ (మర్యం)ని గొప్ప స్త్రీ మూర్తిగా పరిగణిస్తుంది. బైబిల్ కొత్త నిబంధనల కంటే ఖురాన్లోనే మరియ మాత గురించి ఎక్కువ సార్లు ప్రస్తావించడం జరిగింది. "మరియమ్ ఉమ్ ఇసా" ఈసా తల్లి మరియమ్ అని ప్రస్తావించబడింది. ముస్లింలకు ఈమె చాలా పవిత్రురాలైన స్త్రీ అనే విశ్వాసం గలదు.ఈమె ఇస్లామీయ ప్రవక్త .

  • ఇమ్రాన్ వంశస్త్రీ "ప్రభూ నేను మగపిల్లవాడనుకుంటే ఆడపిల్లపుట్టింది.నేనీ పాపకు మర్యం అని పేరుపెట్టాను.ఈమెను ఈమె సంతానాన్ని షైతాన్ బారిన పడకుండా నీ రక్షణలో ఉంచుతున్నాను" అంది.అల్లాహ్ ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించి చక్కగా పెంచి పోషించాడు.ఆమె సంరక్షకుడు జకరియ్యా ఆమె ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆహార పదార్ధాలు ఉండేవి.ఆ ఆహారం దేవుడే ప్రసాదించాడని ఆమె చెప్పేది. (ఖురాన్ 3:36,37)
  • దేవదూతలు మర్యంతో "మర్యం దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.నిన్ను పరిశుద్ధపరచాడు.సృష్టిలోని మహిళ లందరికంటే నీకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి తన సేవకోసం నియమించాడు" అన్నారు .. (ఖురాన్ 3:42,43)
  • దేవుని ఆత్మ మానవాకారంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యింది (19:16,17)
  • ప్రజలు ఆమె శీలాన్ని శంకించారు (19:27,28)
  • పిల్లవాడు (ఈసా ) ఆమె తరుపున ఊయలనుండే తాను పరిశుద్ధుడనని మాట్లాడుతాడు (19:30-33)

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Hebrew: מִרְיָם, translit. Mīryām‎; మూస:Lang-arc; అరబ్బీ: مريم‎; Greek: Μαρία, translit. María; లాటిన్: Maria; మూస:Lang-cop; English: Mary
"https://te.wikipedia.org/w/index.php?title=మరియమ్&oldid=3646245" నుండి వెలికితీశారు