మర్రి
| మర్రిచెట్టు | |
|---|---|
| F. benghalensis shoot in Karnataka, India | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | Magnoliophyta |
| Class: | Magnoliopsida |
| Order: | Urticales |
| Family: | మోరేసి |
| Genus: | ఫైకస్ |
| Species: | ఫై. బెంగలెన్సిస్ |
మర్రి (ఆంగ్లం Banyan) ఫైకస్ జాతికి చెందిన ఒక చెట్టు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది.
దీని గింజలు వేరే చెట్టు పగుళ్ళలో లేదా ఒరలలో (ఒకోమారు పెద్ద భవనాలు, వంతెనలు, రాళ్ళ సందులలో) చిగురించి కాలక్రమాన విస్తరిస్తాయి. "మర్రి" (Banyan) అనే పేరు ప్రత్యేకించి ఫైకస్ బెంగలెన్సిస్ (Ficus benghalensis) అనే జాతికి చెందిన చెట్లకు చెందుతుంది, కాని ఆ విధమైన ఇతర చెట్లకు, "యురోస్టిగ్మా" ఉపజాతికి చెందిన వాటికి, అన్నింటికీ కూడా ఈ పేరును వాడుతారు.[1]
ఈ చెట్టు విత్తనాలు పళ్లు తినే పక్షుల ఇతర ప్రదేశాలకు వెదజల్లబడతాయి. వేరే చెట్టుమీద పడి, దాని పగుళ్ళలో మొలకెత్తిన మొక్కల వేల్ళు క్రమంగా భూమికి ప్రాకుతాయి. కొమ్మలు ఆకాశంవైపు విస్తరిస్తాయి. ఇలా ఆశ్రయమిచ్చిన చెట్లను చుట్టుముట్టి పెరిగే లక్షణం ఉష్ణమండలంలో కాంతికోసం పోటీపడే చెట్లలో, ముఖ్యంగా "ఫికస్"జాతికి చెందినవాటిలో కనుపిస్తుంది.[2][3][4] కనుక వీటన్నింటికి strangler fig అనే ఆంగ్లపదం వాడుతారు.
భారతదేశంలో "బనియాలు ('వణికులు' లేదా 'వ్యాపారులు') తమ ప్రయాణాలలో తరచు ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకొనేవారు అని విదేశీ పరిశీలకులు గమనించినందువల్ల గనుక దీనికి "బనియన్ ట్రీ" (ఫికస్ బెంగాలెన్సిస్) అనే పేరు పెట్టారు.[5]
లక్షణాలు [మార్చు]
- వెడల్పాటి అండాకారంగా గురుఅగ్రంతో ఉన్న సరళ పత్రాలు.
- పత్రగ్రీవాలలో జతలుగా ఏర్పడిన పైపాంథోడియం పుష్ప విన్యాసంలో అమరిన వర్ణ్రరహిత పుష్పాలు.
- ఎరుపు రంగులో ఉన్న సైకోనస్ ఫలాలు.
విశేషాలు [మార్చు]
- త్రిమూర్తులు మర్రిచెట్టు మీదుంటారని హిందువుల నమ్మకం.
- ఆంధ్ర ప్రదేశ్ ఉన్న తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలో అతిపెద్ద మర్రిచెట్టు కావచ్చును. ఇది అనంతపూర్ జిల్లాలో కదిరి దగ్గరకదిరి నుండి 27 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర అటవీశాఖ సమాచారం ప్రకారం ఇది 570 సంవత్సరాల చెట్టు. దీనికి 1650 (ఊడ) వ్రేళ్లు ఉన్నాయి. [3]. తరువాత కలకత్తాలోని 'బొటానికల్ గార్డెన్స్'లోనిది, తరువాత చెన్నైలోని 'అడయారు' చెట్టు - వీటి తరువాత బెంగళూరు దగ్గరలో మైసూరు రోడ్డుపైని కుంబల్‌గోడ్ గ్రామంలో ఉన్న 400 సంవత్సరాల మర్రిచెట్టు నాలుగవది.[4] (మరింత నిర్దుష్టమైన ఆధారాలు కావాలి).
- మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమర్రి (వృక్షం) 700 సంవత్సరాలది.
మూలాలు, బయటిలింకులు [మార్చు]
- ↑ Note usage of "Banyan" versus "banyan" in మూస:PDF by Vidya R Athreya, Nature Watch, July 1997; also "Aerial-rooting banyan trees", washington.edu
- ↑ Zhekun, Zhou & Michael G. Gilbert (2003) Flora of China (Moraceae) 5: 21-73. [1]
- ↑ Serventy, V. 1984. Australian Native Plants. Victoria: Reed Books.
- ↑ Light in the rainforest 1992 Tropical topics. Vol 1 No. 5 [2]
- ↑ Yule, Henry, Sir. Hobson-Jobson: A glossary of colloquial Anglo-Indian words and phrases, and of kindred terms, etymological, historical, geographical and discursive. New ed. edited by William Crooke, B.A. London: J. Murray, 1903.
- కొన్ని పెద్ద మర్రిచెట్ల ఫొటోలు
- Banyan tree కొన్ని వివరాలు
- Stranglers and Banyans మర్రిచెట్ల గురించి, palomar.edu
- Plant Cultures: Banyan tree history and botany, plantcultures.org.uk