మర్రి చెన్నారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్రి చెన్నారెడ్డి
మర్రి చెన్నారెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
06/03/1978—11/10/1980
ముందు జలగం వెంగళరావు
తరువాత టంగుటూరి అంజయ్య
నియోజకవర్గం వికారాబాద్
పదవీ కాలం
03/12/1989—17/12/1990
ముందు ఎన్.టి.రామారావు
తరువాత నేదురుమిల్లి జనార్ధనరెడ్డి
నియోజకవర్గం తాండూర్

వ్యక్తిగత వివరాలు

జననం జనవరి 13, 1919
మరణం డిసెంబర్ 2, 1996
రాజకీయ పార్టీ కాంగ్రెసు
మతం హిందూ

మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 - డిసెంబర్ 2, 1996) రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.చేనేత, లఘు పరిశ్రమల శాఖ

జననం[మార్చు]

చెన్నారెడ్డి జనవరి 13, 1919న ప్రస్తుత వికారాబాదు జిల్లా, వికారాబాదు తాలూకాలోని మార్పల్లి మండలం లోని సిరిపురం గ్రామములో జన్మించాడు. ఇతని తండ్రి మర్రి లక్ష్మారెడ్డి.చెన్నారెడ్డి 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. తర్వాతి రోజులో వరంగల్ లోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేశాడు తర్వాత రోజుల్లో ఆంధ్ర యువజన సమితి, విద్యార్థి కాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత, సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు.ఇతను ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు.1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1978 లో కాంగ్రెస్ చీలిక సమయంలో మర్రి చెన్నారెడ్డి శ్రీమతి ఇందిరాగాంధీ వర్గంలో చేరి అప్పటి సమైక్య ఇందిరా కాంగ్రెస్ అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు నాయకత్వ సారథ్యం వహించి సుమారు 175 నియోజక వర్గాలలో విజయం చేకూర్చి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టినారు.[1]

రాజకీయ జీవితం[2][మార్చు]

గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రం. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకుడుగా, గాంధేయుడుగా, విద్యార్థి నాయకుడుగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడుగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను అనుభవించారు

మరణం[మార్చు]

డిసెంబర్ 2,1996లో చెన్నారెడ్డి మరణించాడు. ప్రస్తుతం చెన్నారెడ్డి సమాధి హైదరాబాదులోని ఇందిరా పార్కు ఆవరణలో ఉంది. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజా సమితి పార్టీ పెట్టి అన్ని సీట్లు గెలిచి, ఆ పార్టీని కాంగ్రెసులో విలీనం చేశాడు.

మూలాలు[మార్చు]

  1. "List of Chief Ministers – AP State Portal". Archived from the original on 2020-03-26. Retrieved 2020-07-17.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1978". Elections in India. Archived from the original on 2019-12-10. Retrieved 2020-07-17.

బయటి లింకులు[మార్చు]


ఇంతకు ముందు ఉన్నవారు:
జలగం వెంగళరావు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
06/03/1978—11/10/1980
తరువాత వచ్చినవారు:
టంగుటూరి అంజయ్య


ఇంతకు ముందు ఉన్నవారు:
నందమూరి తారక రామారావు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
03/12/1989—17/12/1990
తరువాత వచ్చినవారు:
నేదురుమిల్లి జనార్ధనరెడ్డి