మర్వన్ ఆటపట్టు (Marvan Samson Atapattu) 1970, నవంబర్ 22న శ్రీలంక లోని కలుతరలో జన్మించాడు. ఇతడు శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లీగ్ లో ఢిల్లీ జెట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
క్రీడా జీవితం [మార్చు]
ఆతపట్టు నవంబర్ 1990లో టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసినాడు. ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అతని ఆటతీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. తొలి 6 ఇన్నింగ్సులలో 5 డకౌట్లు మరో ఇన్నింగ్సులో 1 పరుగు సాధించాడు. దేశవాళి పోటీలలో టన్నులకొద్ది పరుగులు సాధించే ఆటపట్టు ఆ తరువాత 11 ఇన్నింగ్సులలో అత్యధిక స్కోరు 29 మించలేకపోయాడు. అతని 10వ టెస్టులో భారత్ పై ఎట్టకేలకు తొలి సెంచరీని నమోదుచేశాడు. అప్పటికి టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసి 7 సంవత్సరాలు కావడం గమనార్హం. 22 మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి డకౌట్లలో మరియు పేరౌట్లలో (రెండు ఇన్నింగ్సులలోనూ సున్నాకే ఔట్ కావడం) టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు!
టెస్ట్ క్రికెట్ గణాంకాలు [మార్చు]
క్రమక్రమంగా పట్టు సాధించి మొత్తంపై 89 టెస్టులలో 5502 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు మరియు 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 249 పరుగులు.
వన్డే క్రికెట్ గణాంకాలు [మార్చు]
ఆటపట్టు 268 వన్డేలలో 37.57 సగటుతో 8529 పరుగులు సాధించాడు. అందులో 11 సెంచరీలు మరియు 59 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 132 (నాటౌట్).
ప్రపంచ కప్ క్రికెట్ [మార్చు]
ఆటపట్టు 4 సార్లు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో ప్రాతినిధ్యం వహించాడు. తొలిసారిగా శ్రీలంక విజయం సాధించిన 1996లో, ఆ తరువాత 1999, 2003 మరియు 2007లలో కూడా శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
|
2003 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులు |
|
|
|
|
|
2007 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులు |
|
|
|
|