మలబద్దకం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Types 1 and 2 on the Bristol Stool Chart indicate constipation
  • మల విసర్జన సహజమైన కాలకృత్యాలలో ఒకటి. మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే, కొందరిలో రెండు-మూడు రోజులకొకసారి అవుతుంది. ఎవరిలోనైనా వారికి సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్దకం (ఆంగ్లం: Constipation) గా భావించాలి. సాధారణంగ మూడు రోజులకు మించి మలవిసర్జన కాకుండ ఉంటే దానికి కారణం తెలుసుకోవడం మంచిది.

కారణాలు[మార్చు]

  • మందుల దుష్ఫలితాలు: కొన్ని దగ్గు మందులు, రక్తపోటు మందులు, కాల్షియం సమ్మేళనాలు, ఆందోళన తగ్గించడానికి వాడే మందులు మొదలైనవి మలబద్దకాన్ని కలిగించవచ్చును.
  • మాలాశయంలో పుండ్లు: క్షయ, అమీబియాసిస్ వంటి వ్యాధులలో పేగులలో పుండ్లు / ట్యూమర్లు తయారై మలబద్దకం రావచ్చు.
  • పెద్ద పేగులో ట్యూమర్లు: పెద్దపేగులో కాన్సర్ సంబంధించిన ట్యూమర్లు మల విసర్జనకు అడ్డుపడి మలబద్దకాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య చాలా కాలంగా ఉంటున్నా, మలంతోపాటు రక్తపు జీర కనిపించినా దీని గురించి ఆలోచించాలి.
  • థైరాయిడ్ గ్రంధి చురుకుదనం తగ్గడం (హైపో థైరాయిడిజం): దీనిలో మలబద్దకంతో పాటు, శరీరపు క్రియలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. దీనిమూలంగా బరువు పెరగడం, చలి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, నాడి వేగం తగ్గం, చర్మం దళసరిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • నరాల దౌర్బల్యం: వెన్నుపూసలలో ట్యూమర్లు పెరగడం, డిస్క్ జారడం వంటి సందర్భాలలో వచ్చే నరాల బలహీనతలు. వీనిలో మలబద్దకంతో, మూత్ర నియంత్రణ కూడ కోల్పోతారు. చంటిపిల్లలలో నరాలకు సంబంధించిన న్యూరాన్లు లోపించడం వల్ల పుట్టిన తర్వాత కొన్ని రోజులలోనే మలబద్దకం ప్రారంభమౌతుంది.

సలహాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=మలబద్దకం&oldid=810004" నుండి వెలికితీశారు